...
...
Next Story

టీజీఎస్ఆర్టీసీలో అడ్వర్టైజ్‌మెంట్ కాంట్రాక్టులకు నోటిఫికేషన్.. పూర్తి వివరాలు ఇవే!

టీజీఎస్ఆర్టీసీ సంస్థ పరిధిలో అడ్వర్టైజ్‌మెంట్ కాంట్రాక్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. టెండర్లలో పాల్గొనాలి అనుకునేవారి కోసం పూర్తి వివరాలు ఇక్కడ ఉన్నాయి.

Published on: Jul 2, 2026, 07:31:12 IST
Advertisement

తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) ఆదాయ వనరులను పెంచుకునే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. సంస్థ పరిధిలోని వివిధ ప్రాంతాలలో, బస్సులలో ప్రకటనలు ప్రదర్శించడానికి అర్హులైన కాంట్రాక్టర్ల నుండి బిడ్లను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు టీజీఎస్‌ఆర్‌టీసీ వైస్ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ వై.నాగిరెడ్డి అధికారిక ప్రకటన విడుదల చేశారు. నాలుగు వేర్వేరు విభాగాలలో ఈ అడ్వర్టైజ్‌మెంట్ కాంట్రాక్టుల కోసం టెండర్లను జారీ చేశారు.

టెండర్ల వివరాలు

టీజీఎస్ఆర్టీసీ ప్రకటనలు
టీజీఎస్ఆర్టీసీ ప్రకటనలు

బస్సులపై ప్రకటనలు (Tender ID: 712141): సిటీ ఆర్డినరీ, సబర్బన్, మోఫుసిల్, సిటీ ఎక్స్‌ప్రెస్, డిస్ట్రిక్ట్ ఎక్స్‌ప్రెస్, పల్లెవెలుగు బస్సుల (సొంత బస్సులు మాత్రమే) పై ప్రకటనల ప్రదర్శన. కరీంనగర్, నల్గొండ, నిజామాబాద్, ఆదిలాబాద్, ఖమ్మం, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్ ప్రాంతాల్లో ఉన్నాయి.

టికెట్ రోల్స్ వెనుక ప్రకటనలు (Tender ID: 712095): టికెట్ ఇష్యూయింగ్ మెషీన్ రోల్స్ వెనుక భాగంలో ప్రకటనల ముద్రణ, సరఫరా చేయాలి. టీజీఎస్ఆర్టీసీ సంస్థ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో చేయాలి.

బస్టాండ్లలో డిజిటల్ టీవీ ప్రకటనలు (Tender ID: 712106): బస్టాండ్‌లలో పెద్ద ఎల్‌ఈడీ స్క్రీన్‌లు, చిన్న డిజిటల్ టీవీల ద్వారా ప్రకటనల ప్రదర్శన చేయాలి. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ పరిధిలో చేయాల్సి ఉంటుంది.

గ్రాబ్ హ్యాండిల్స్ ప్రకటనలు (Tender ID: 712135): బస్సుల లోపల ప్రయాణికులు పట్టుకునే గ్రాబ్ హ్యాండిల్స్‌పై(సొంత, అద్దె బస్సులలో) ప్రకటనల హక్కులు, నిర్వహణ చూసుకోవాలి. ఆదిలాబాద్, కరీంనగర్, నల్గొండ, మహబూబ్‌నగర్, మెదక్, వరంగల్‌లో ఉన్నాయి.

ముఖ్యమైన తేదీలు

ఈ టెండర్లలో పాల్గొనే కాంట్రాక్టర్లు ఆన్‌లైన్ ద్వారా, హార్డ్ కాపీల ద్వారా తమ బిడ్లను సమర్పించాల్సి ఉంటుంది. ఆన్‌లైన్ బిడ్ సమర్పణకు చివరి తేదీ 15/07/2026 సాయంత్రం 05:00 గంటల వరకు నిర్ణయించారు. హార్డ్ కాపీల సమర్పణ తేదీ 16/07/2026 ఉదయం 11:00 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు ఉంది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe