టీజీఎస్ఆర్టీసీలో 198 ఉద్యోగాలు.. అప్లికేషన్‌ చేసేందుకు ఈరోజే లాస్డ్ డేట్

కొన్ని రోజుల కిందట టీజీఎస్ఆర్టీసీ పలు జోన్‌లలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ పోస్టులకు అప్లికేషన్ తేదీ జనవరి 20వ తేదీతో ముగుస్తుంది.

Published on: Jan 20, 2026 11:53 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

ఇటీవల టీజీఎస్ఆర్టీసీ పలు పోస్టుల కోసం రిక్రూట్‌మెంట్ ప్రారంభించింది. పలు పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆర్టీసీలో ఖాళీగా ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులను భర్తీ చేస్తోంది. మొత్తం 198 ఖాళీలున్నాయి.

తెలంగాణ ఆర్టీసీ
తెలంగాణ ఆర్టీసీ

ఈ పోస్టుల భర్తీ కోసం TSLPRB (తెలంగాణ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు) డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. అర్హత కలిగిన, ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 30వ తేదీ నుంచి దరఖాస్తులు చేసుకునేందుకు అవకాశం కల్పించింది. ఈ గడువు జనవరి 20, 2026వ తేదీతో ముగుస్తుంది. అభ్యర్థులు http://tslprb.in వెబ్ సైట్ లోకి వెళ్లి అప్లికేషన్ చేసుకోవచ్చు.

నోటిఫికేషన్ వివరాలు

ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(84), మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ - 114 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తున్నారు. డిగ్రీ లేదా సంబంధిత విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. మెడికల్ పరీక్షలుంటాయి. ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ - 20, జనవరి 2026గా నిర్ణయించారు.

దరఖాస్తు ఫీజు

ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకునే ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక ఉంటుంది.

వయోపరిమితి, జీతం

2025 జులై 1వ తేదీ నాటికి 18 నుంచి 25 ఏళ్ల వయసు మించకూడదు. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 5 ఏళ్లు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు 3 సంవత్సరాలు వయోపరిమితిలో సడలింపు దొరుకుతుంది. నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 వరకు జీతం ఉంటుంది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More