తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీజీఎస్ఆర్టీసీ) ట్రాఫిక్ సూపర్‌వైజర్ ట్రైనీ, మెకానికల్ సూపర్‌వైజర్ ట్రైనీ 198 పోస్టులకు రిక్రూట్‌మెంట్ చేస్తోంది. ఏదైనా గ్రాడ్యుయేట్, డిప్లొమా ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ దరఖాస్తు 30-12-2025న ప్రారంభమైంది. 20-01-2026న ముగుస్తుంది. అభ్యర్థులు www.tgprb.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

198 పోస్టుల్లో ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ(టీఎస్టీ): 84, మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ(ఎంఎస్టీ): 114 పోస్టులు ఉన్నాయి. జీతం నెలకు రూ.27,080 నుంచి రూ.81,400 మధ్య ఉంటుంది. టీఎస్టీకి డిగ్రీ, ఎంఎస్టీకి ఆటోమొబైల్/మెకానికల్ ఇంజనీరింగ్‌లో డిప్లొమా అర్హత ఉండాలి. 18 నుండి 25 సంవత్సరాల మధ్య వయసు ఉండాలి.
తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ఈ రిక్రూట్‌మెంట్ చేస్తోంది. రిక్రూట్‌మెంట్‌లో భాగంగా మెడికల్ పరీక్షలు కూజా ఉంటాయి. దరఖాస్తు ఫీజు -ట్రాఫిక్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. మెకానికల్ సూపర్ వైజర్ ట్రైనీ పోస్టులకు అప్లయ్ చేసుకునే ఎస్సీ , ఎస్టీ అభ్యర్థులు రూ. 400, ఇతరులు రూ. 800 చెల్లించాలి. రాత పరీక్ష ఆధారంగా ఎంపిక చేస్తారు.
దరఖాస్తులను TSLPRB వెబ్‌సైట్ (www.tgprb.in) లో ఆన్‌లైన్ మోడ్ ద్వారా మాత్రమే సమర్పించాలి. అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు వారి అర్హతను జాగ్రత్తగా తనిఖీ చేసుకోవాలి. పుట్టిన తేదీకి సంబంధించిన SSC/మెట్రిక్యులేషన్ సర్టిఫికేట్ ఉండాలి. 1 నుండి 7వ తరగతి వరకు స్టడీ సర్టిఫికేట్ లేదా ఎంఆర్ఓ జారీ చేసిన నివాస ధృవీకరణ పత్రం, తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన తాజా కమ్యూనిటీ సర్టిఫికేట్ కావాలి. 2025 ఏప్రిల్ 1న లేదా ఆ తర్వాత జారీ చేసిన నాన్-క్రీమీ లేయర్ సర్టిఫికేట్ (BC అభ్యర్థులకు), 1 ఏప్రిల్ 2025న లేదా ఆ తర్వాత జారీ చేసిన EWS సర్టిఫికెట్ (వర్తిస్తే) ఉండాలి.
ఎలా దరఖాస్తు చేయాలి
మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి TSLPRB వెబ్‌సైట్ www.tgprb.in లో నమోదు చేసుకోండి.
{{/usCountry}}మొబైల్ నంబర్‌ను యూజర్ ఐడీగా ఉపయోగించి TSLPRB వెబ్‌సైట్ www.tgprb.in లో నమోదు చేసుకోండి.
{{/usCountry}}అర్హత ప్రకారం మీరు దరఖాస్తు చేసుకోవాలనుకుంటున్న పోస్ట్ ఎంచుకోండి.
ఎంచుకున్న పోస్ట్, కేటగిరీని బట్టి ఫీజు మొత్తాన్ని గమనించండి.
క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, నెట్ బ్యాంకింగ్ లేదా అందుబాటులో ఉన్న ఇతర పద్ధతులను ఉపయోగించి రుసుము చెల్లించండి.
చెల్లింపు తర్వాత వినియోగదారు ఐడీతో TSLPRB వెబ్‌సైట్‌లో కొనసాగండి, దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
పాస్‌పోర్ట్ ఫోటోగ్రాఫ్, సంతకం చిత్రాన్ని jpg ఫార్మాట్‌లో ఒకే ఫైల్‌గా సిద్ధం చేయండి. (30kb నుండి 100kb వరకు)
ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌తో ఫోటో ప్లస్ సంతకం ఫైల్‌ను స్కాన్ చేసి అప్‌లోడ్ చేయండి.
ఏ కాలమ్‌ను ఖాళీగా ఉంచకుండా అన్ని సంబంధిత వరుసలను జాగ్రత్తగా పూరించండి.
డిక్లరేషన్‌ను ఆమోదించండి, రిజిస్టర్డ్ మొబైల్‌కు పంపిన ఓటీపీతో కన్ఫామ్ చేయండి.
సమర్పించే ముందు అన్ని వివరాలను జాగ్రత్తగా ధృవీకరించండి.
దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయడానికి సబ్మిట్ బటన్‌ను క్లిక్ చేయండి.
భవిష్యత్ ఉపయోగం కోసం సమర్పించిన దరఖాస్తు ఫారమ్ కాపీని PDFలో డౌన్‌లోడ్ చేసుకోండి.