భద్రాచలం ఆర్టీసీ డిపోను ఆ సంస్థ ఎండీ నాగిరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా మెుక్కలు నాటి.. అనంతరం బస్సులను పరిశీలించారు. ఆ తర్వాత మాట్లాడిన నాగిరెడ్డి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణలో రోజూ 10 వేల బస్సుల్లో 60 లక్షల మంది ప్రయాణిస్తున్నట్టుగా వెల్లడించారు. ఇందులో సుమారు 45 లక్షల మంది మహిళలు ఉన్నట్టుగా తెలిపారు.

'మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ప్రభుత్వం నుంచి ఆర్టీసీకి రాబడి పెరుగుతోంది. ఇప్పటి వరకు 250 కోట్లకుపైగా మహిళలు ఉచిత ప్రయాణం చేశారు. ఫ్రీ బస్సుతో మహిళలకు రూ.8500 కోట్ల వరకు ఆదా అయింది. రెండు సంవత్సరాలలో 2500 కొత్త బస్సులను కొనుగోలు చేశాం. హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో 800కిపైగా ఎలక్ట్రిక్ బస్సులు నడుస్తున్నాయి. మూడు సంవత్సరాలలో హైదరాబాద్‌లో, ఆ తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బస్సులు తీసుకుని వస్తాం.' అని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి వెల్లడించారు.
మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ
మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇచ్చే చొరవలో భాగంగా గ్రామీణ పేదరిక నిర్మూలన సంఘం(SERP) రవాణా రంగంలోకి మహిళలు ప్రవేశించడానికి సాధికారత కల్పించడంలో మరో అడుగు వేసింది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే టీజీఎస్ఆర్టీసీలో మహిళా డ్రైవర్‌ను నియమించింది.
తాజాగా SERP, ఒక ప్రైవేట్ బస్సు ఆపరేటర్ సహకారంతో ప్రజా భవన్‌లో మహిళలకు బస్సు డ్రైవర్లుగా శిక్షణ ఇవ్వడానికి ఒక అవగాహన ఒప్పందం(MoU)పై సంతకం చేసింది. ఈ కార్యక్రమానికి SERP చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దివ్య దేవరాజన్ అధ్యక్షత వహించారు. శిక్షణ కార్యక్రమంలో చేరిన అనేక మంది ఆశావహులు అవకాశం లభించడం పట్ల సంతోషాన్ని వ్యక్తం చేశారు. భవిష్యత్తులో బాధ్యతాయుతమైన, ప్రొఫెషనల్ బస్సు డ్రైవర్లుగా పనిచేస్తామని చెప్పారు.
ఈ స్థాయిలో మహిళలు నడిపే బస్సు డ్రైవర్ శిక్షణా కార్యక్రమానికి అధికారికంగా మద్దతు ఇచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీ తమదని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ నిర్వాహకులు తెలిపారు. మహిళలకు డ్రైవింగ్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సు కార్యకలాపాలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ చొరవ కొత్త కెరీర్ మార్గాలను సృష్టిస్తుందన్నారు. రవాణా రంగంలో నమ్మకం, శ్రామిక శక్తిని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
{{/usCountry}}ఈ స్థాయిలో మహిళలు నడిపే బస్సు డ్రైవర్ శిక్షణా కార్యక్రమానికి అధికారికంగా మద్దతు ఇచ్చిన భారతదేశంలోని మొట్టమొదటి కంపెనీ తమదని ప్రైవేట్ బస్సు ఆపరేటర్ నిర్వాహకులు తెలిపారు. మహిళలకు డ్రైవింగ్ అనుభవం, ఎలక్ట్రిక్ బస్సు కార్యకలాపాలపై అవగాహన కల్పించడం ద్వారా ఈ చొరవ కొత్త కెరీర్ మార్గాలను సృష్టిస్తుందన్నారు. రవాణా రంగంలో నమ్మకం, శ్రామిక శక్తిని నిర్మించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పారు.
{{/usCountry}}