దివ్యాంగులకు 7 వరాలు ప్రకటించిన సీఎం.. ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం!
ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో దివ్యాంగులకు ఉచిత ప్రయాణం కల్పిస్తున్నట్టుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు.
అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం పురస్కరించుకుని.. విజయవాడలో నిర్వహించిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా దివ్యాంగుల కోసం ఏడు వరాలు ప్రకటించారు. వారు ఏ రంగంలోనూ వెనకబడి ఉండకూడదని చెప్పారు. అన్ని విధాలుగా ప్రభుత్వం అండగా ఉంటుందని, ప్రోత్సాహం అందిస్తామని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. కొత్తగా ప్రకటించిన 7 వరాలు దివ్యాంగుల జీవితాల్లో వెలుగులు నింపుతాయని చెప్పారు.

దివ్యాంగులకు ప్రకటించిన ఏడు వరాల్లో ఏపీఎస్ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ఉంది. దీని ద్వారా దివ్యాంగులు రాకపోకల ద్వారా అయ్యే ఖర్చు తగ్గనుంది. స్థానిక సంస్థలు, కార్పొరేషన్లు, పబ్లిక్ సెక్టార్ ఎంటర్ ప్రైజెస్‌లో కనీసం ఒక దివ్యాంగ ప్రతినిధిని నామినేట్ చేస్తామని సీఎం ఈ సందర్భంగా వెల్లడించారు. అంతేకాదు.. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు ఆర్థిక సబ్సిడీ అందించనట్టుగానే దివ్యాంగులకు మళ్లీ ప్రారంభిస్తామని చెప్పారు.
'ప్రభుత్వ హౌసింగ్ ప్రాజెక్టుల్లో దివ్యాంగులకు గ్రౌండ్ ఫ్లోర్ కేటాయిస్తాం. రాష్ట్రస్థాయిలో అమరావతిలో దివ్యాంగ్ భవన్ ఏర్పాటు చేస్తాం. బాపట్లలో ఉన్న ప్రభుత్వ పాఠశాల, జూనియర్ కాలేజీతోపాటు వినికిడి లోపం ఉన్న విద్యార్థుల కోసం ప్రత్యేక డిగ్రీ కాలేజీ ఏర్పాటుకు చర్యలు తీసుకుంటాం. రెసిడెన్షియల్ స్కూల్స్, కాలేజీలు, హాస్టల్స్‌లో చదివే దివ్యాంగ విద్యార్థులకు అక్కడే సామాజిక భద్రతా పెన్షన్ పంపిణీ చేస్తాం. శాప్ ద్వారా అన్ని క్రీడా కార్యక్రమాలు, టాలెండ్ డెవలప్‌మెంట్ స్కీములు దివ్యాంగులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటాం.' అని చంద్రబాబు ప్రకటించారు.
దివ్యాంగులకు కేవలం దయతో చూసే విధానం మారాలని సీఎం చంద్రబాబు ఈ సందర్భంగా చెప్పారు. సమాజంలో భాగస్వాములుగా, సమాన పౌరులుగా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. వైకల్యం అనేది బలహీనత కాదన్నారు. అవకాశాలు కల్పిస్తే ఎక్కడైనా విజయం సాధిస్తారన్నారు. దివ్యాంగుల సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని మరోసారి చంద్రబాబు స్పష్టం చేశారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


