...
...
Next Story

TGSRTC Sabarimala : శబరిమలకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సు సర్వీసులు.. వారికి ఫ్రీ

TGSRTC Sabarimala Buses : శబరిమలకు వెళ్లాలి అనుకునేవారికి టీజీఎస్ఆర్టీసీ శుభవార్త అందించింది. ప్రత్యేక బస్సులు నడపనున్నట్టుగా ప్రకటించింది. ఇందులో గురుస్వాములకు ఉచితంగా వెళ్లేందుకు అవకాసం కల్పిస్తోంది.

Published on: Nov 4, 2026, 22:13:34 IST
Advertisement

శబరిమల అయ్యప్ప స్వామి మండల, మకరవిలక్కు పూజల మహోత్సవాల కాలం ప్రారంభమవుతున్న వేళ తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (TGSRTC) భక్తులకు శుభవార్త అందించింది. శబరిమల యాత్రకు వెళ్లే అయ్యప్ప స్వాముల సౌకర్యార్థం 2026–27 సంవత్సరానికి గాను ప్రత్యేక బస్సు సర్వీసులను (Sabarimalai Special Bus Services) అందుబాటులోకి తెచ్చింది.

శబరిమలకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు
శబరిమలకు టీజీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు

ప్రయాణికులకు అత్యుత్తమ సేవలు అందించేలా ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. ఈ ప్రత్యేకాధికార క్యారేజ్ బస్సుల బుకింగ్స్‌పై భక్తులకు, గురుస్వాములకు ఆర్టీసీ అనేక రకాల రాయితీలు, ఆఫర్లను ప్రకటించింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం నిర్వహించే ప్రధాన పూజా సమయాలకు అనుగుణంగా టీజీఎస్ఆర్టీసీ ఈ బస్సులను నడపనుంది. మండల పూజ 16 నవంబర్ 2026 నుంచి 27 డిసెంబర్ 2026 వరకు, మకర విలక్కు 30 డిసెంబర్ 2026 నుంచి 20 జనవరి 2027 వరకు అనుగుణంగా బస్సు సర్వీసులను నడుపుతోంది టీజీఎస్ఆర్టీసీ.

గురుస్వాములు, భక్తులకు టీజీఎస్ఆర్టీసీ అందించే ప్రత్యేక వెసులుబాట్లు కూడా ఉంటాయి. శబరిమల యాత్రను సురక్షితంగా, ఆధ్యాత్మిక వాతావరణంలో పూర్తి చేసుకోవడానికి ఆర్టీసీ ప్రత్యేక నిబంధనలతో కూడిన ఆఫర్లను అందుబాటులోకి తీసుకొచ్చింది.

భక్తుల కోసం బస్సును బుక్ చేసిన గురుస్వామికి ఉచిత ప్రయాణ సదుపాయం ఉంటుంది. ఒకవేళ గురుస్వామి ఒక బస్సు కంటే ఎక్కువ బస్సులను బుక్ చేస్తే, ఒక బస్సులో ఉచిత ప్రయాణంతో పాటు మిగిలిన బస్సులపై ఏటీబీ ఏజెంట్లు, టీజీఎస్ఆర్టీసీ ఉద్యోగులతో సమానంగా రోజుకు బస్సుకు రూ.350 చొప్పున కమిషన్ ఉంటుంది.

శబరిమల పవిత్ర యాత్ర కోసం ముందస్తుగా బస్సులను బుక్ చేసుకోవడానికి భక్తులు సమీపంలోని ఆర్టీసీ డిపోలను లేదా అధికారిక నంబర్లను సంప్రదించవచ్చు. సంప్రదించాల్సిన ఫోన్ నంబర్లు: 040-69440000, 040-23450033, అధికారిక వెబ్‌సైట్ tgsrtcbus.inను సంప్రదించవచ్చు. అయ్యప్ప భక్తులు తమ సురక్షితమైన, సౌకర్యవంతమైన భక్తి యాత్ర కోసం ఆర్టీసీ బస్సు సేవలను వినియోగించుకోవాలని సంస్థ యాజమాన్యం కోరింది.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks