తెలంగాణ పర్యాటక శాఖ వీక్లీ బర్డ్‌వాచింగ్ వాక్.. మీరు కూడా వెళ్లొచ్చు
తెలంగాణ పర్యాటక శాఖ హైదరాబాద్ వ్యాప్తంగా వారానికోసారి పక్షుల వీక్షణ యాత్రలను ప్రారంభించింది. ప్రతీ ఆదివారం నిర్వహించాలని యోచిస్తోంది.
తెలంగాణ పర్యాటక అభివృద్ధి సంస్థ(టీజీటీడీసీ) రాష్ట్రంలో పక్షి వీక్షణం, జీవవైవిధ్య పరిరక్షణ, ప్రకృతి ఆధారిత పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి 'వింగ్స్ అండ్ వైల్డర్‌నెస్' అనే వీక్లీ నేచర్ వాక్ కార్యక్రమాన్ని ప్రారంభించింది. నానక్‌రామ్‌గూడలోని ఘర్-ఎ-ముబారక్‌లో జరిగిన ప్రారంభ నడకలో 30 మంది పక్షి పరిశీలకులు, ప్రకృతి ప్రేమికులు పాల్గొన్నారు. ప్రకృతితో ప్రజల మమేకాన్ని ప్రోత్సహించడానికి, పర్యావరణ పరిరక్షణపై అవగాహన కల్పించడానికి, ఈ సంస్థ ప్రతి ఆదివారం ఈ వాకింగ్ నిర్వహించాలని యోచిస్తోంది.

మెుదటిసారి నేచర్ వాకింగ్ సందర్భంగా నిపుణులు పాకెట్ ఫీల్డ్ గైడ్‌లను ఉపయోగించి వివిధ పక్షి జాతులను గుర్తించడంలో పాల్గొన్నవారికి మార్గనిర్దేశం చేశారు. వారు పక్షుల విలక్షణ లక్షణాలు, వాటి పిలుపుల ఆధారంగా గుర్తించే పద్ధతులు, పక్షులకు ఆవాసాలను అందించడంలో దేశీయ, దేశీయేతర మొక్కల జాతుల పర్యావరణ ప్రాముఖ్యతను వివరించారు.
శిఖర, భారతీయ నెమలి, బ్లాక్ డ్రోంగో, గ్రీన్ బీ-ఈటర్, కింగ్‌ఫిషర్, గోల్డెన్ ఓరియోల్, ఆసియా కోయల్, రెడ్-వెంటెడ్ బుల్బుల్, రెడ్-వాటిల్డ్ లాప్‌వింగ్, ఇండియన్ సిల్వర్‌బిల్, గ్రే ఫ్రాంకోలిన్‌తో సహా అనేక జాతులను నేచర్ వాకింగ్ సందర్భంగా గుర్తించారు.
ఈ సందర్భంగా టీజీటీడీసీ మేనేజింగ్ డైరెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ.. విత్తనాలను వెదజల్లడం, సహజ జీవావరణ వ్యవస్థలను నిలబెట్టడం వంటి కార్యకలాపాల ద్వారా పర్యావరణ సమతుల్యతను కాపాడటంలోనూ, జీవవైవిధ్యాన్ని పరిరక్షించడంలోనూ పక్షులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు.
ప్రపంచ వారసత్వ వారోత్సవాల్లో భాగంగా టీజీటీడీసీ చారిత్రాత్మక కుతుబ్ షాహీ సమాధుల వద్ద ‘వింగ్స్ ఓవర్ హెరిటేజ్’ పేరుతో ఒక ప్రత్యేక పక్షి వీక్షణ, హెరిటేజ్ వాక్ నిర్వహించనుంది. ఈ వాక్‌లో పక్షులను వీక్షించడంతో పాటు హైదరాబాద్ చారిత్రక, సాంస్కృతిక వారసత్వాన్ని ఆస్వాదించే అవకాశం ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు రిజిస్ట్రేషన్, మరిన్ని వివరాల కోసం 8019249292 నంబరును సంప్రదించవచ్చు. బర్డ్ వాచింగ్ కోసం రూ.200 రిజిస్ట్రేషన్ ఉంటుంది. మెుదటగా రిజిస్ట్రేషన్ చేసుకున్నవారికే అవకాశం ఉంటుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


