హైదరాబాద్ : ఎకరం రూ.151 కోట్లు - రాష్ట్ర చరిత్రలో రెండో అత్యధిక ధర...! ప్రాజెక్ట్ ప్రత్యేకతలివే

హైదరాబాద్‌ లోని కోకాపేటలో భూములు రికార్డు ధర పలికుతున్నాయి. తాజాగా అక్కడ ఎకరం భూమి ధర రూ.151.25 కోట్లు పలికింది. నియోపొలిస్‌లోని ప్లాట్‌ నంబర్‌ 15ను “ది కాస్కేడ్స్ నియోపోలిస్” డెవలపర్స్ దక్కించుకుంది.

Published on: Dec 10, 2025 8:20 AM IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

కోకాపేట…. ఈ పేరు వింటే చాలు భూముల రికార్డు ధరలు వినిపిస్తుంటాయి…! గత కొంత కాలంలో ఇక్కడ హెచ్ఎండీఏ ఆధ్వర్వంలో నిర్వహిస్తున్న భూముల వేలంలో రికార్డు ధరలు పలుకుతున్నాయి. పాత వాటిని బ్రేక్ చేస్తూ… కొత్త రికార్డులు కూడా నమోదవుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి.

ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు - రికార్డు ధర..!
ఎకరానికి 151 కోట్ల 25 లక్షలు - రికార్డు ధర..!

తాజాగా కోకాపేటలోని నియోపోలిస్ సమీపంలోని ప్లాట్ నెంబర్ 15, 16లోని భూములకు హెచ్ఎండీఏ వేలం నిర్వహించింది. ప్లాట్ నెంబర్ 15లోని ఎకరం భూమి ధర అత్యధికంగా 151 కోట్ల 25 లక్షలు పలికింది.“ది కాస్కేడ్స్ నియోపోలిస్” డెవలపర్స్ ఈ భూమిని దక్కించుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను ఆ సంస్థ ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది.

  • “ది కాస్కేడ్స్ నియోపోలిస్” డెవలపర్స్ పేర్కొన్న వివరాల ప్రకారం…. జీహెచ్ఆర్ ఇన్‌ఫ్రా, లక్ష్మీ ఇన్‌ఫ్రా మరియు అర్బన్‌బ్లాక్స్ రియాలిటీ డెవలపర్స్ సంయుక్తంగా ఈ వేలంలో పాల్గొన్నాయి. నియోపోలిస్ లోని ప్లాట్ 15ను ఎకరానికి రూ. 151.25 కోట్లకు పొందాయి.
  • ఈ ప్లాట్ కు రెండు వైపులా 150 అడుగుల రోడ్ ఉంటుంది. ఈ ప్రీమియం బిట్ 4.03 ఎకరాల విస్తీర్ణంలో ఈశాన్య మూలలో ఉంది.
  • ఇది ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్ర చరిత్రలో రెండోవ అత్యధిక బిడ్. నియోపోలిస్‌లో ఇప్పటివరకు అత్యధిక బిడ్ గా రికార్డు నమోదు చేసింది.
  • రాష్ట్రంలో నమోదు చేసిన ఏకైక అత్యధిక బిడ్ ఈ ఏడాది అక్టోబర్‌లో నమోదైంది. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీలోని రాయదుర్గ్‌లో ఎకరానికి రూ. 177 కోట్ల ధర పలికింది.

ఈ సంవత్సరం జూన్‌లో "ది కాస్కేడ్స్ నియోపోలిస్" పేరిట రూ. 3169 కోట్ల వ్యయంతో విలాసవంతమైన నివాస ప్రాజెక్టును ప్రారంభించినట్లు ప్రకటించింది. ఐదు 63 అంతస్తుల టవర్లు మరియు 217 మీటర్ల ఎత్తుతో ప్రాజెక్ట్ ఉంటుంది. సమకాలీన డిజైన్లు, పర్యావరణ అనుకూల జీవనం మరియు గృహ ఆటోమేషన్ వ్యవస్థల అద్భుతమైన సమ్మేళనంగా ఈ ప్రాజెక్ట్ ను పూర్తి చేసేందుకు కార్యాచరణను సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టుకు మంచి ఆదరణ లభిస్తోంది.

“ నియోపోలిస్‌లో ఈ రెండవ విజయవంతమైన బిడ్‌తో మేము నియోపోలిస్ కోసం మా లక్ష్యాన్ని మరింత బలోపేతం చేయాలనుకుంటున్నాం. ఈ అందమైన నగరానికి మరింత తోడ్పాటు అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. మూడు వైపులా ఓపెన్ వ్యూలు కలిగి ఉంటుంది. ఈశాన్య మూలలో ఉన్న ఈ ల్యాండ్ పార్శిల్, రెండు వైపులా 150 అడుగుల రోడ్, సులభంగా చేరుకునే అవకాశం, అల్ట్రా-అర్బన్ సందర్భం నియోపోలిస్ ప్లాట్ 15 (తాము కొత్తగా సొంతం చేసుకున్న ల్యాండ్ పార్శిల్) ను అరుదైన కాన్వాస్‌గా చేస్తాయి” అని కొనుగోలు చేసిన సంస్థకు ప్రాతినిధ్యం వహిస్తున్న కర్తేష్ రెడ్డి(జిహెచ్‌ఆర్ ఇన్‌ఫ్రా),లక్ష్మీ నారాయణ జి(లక్ష్మి ఇన్‌ఫ్రా), శరత్ వి (అర్బన్‌బ్లాక్స్ రియాల్టీ) సంయుక్త ప్రకటన ద్వారా తెలిపారు.

“ప్లాట్ 15 కోసం మాస్టర్ ప్లానింగ్ , కాన్సెప్ట్ డెవలప్‌మెంట్ ప్రస్తుతం పురోగతిలో ఉన్నాయి. డిజైన్ తుది నిర్ణయంతో పాటు చట్టబద్ధమైన ప్రక్రియల పూర్తయిన తర్వాత కాన్ఫిగరేషన్‌లు మరియు టైమ్‌లైన్‌ వివరాలు పంచుకోబడతాయి” అని వారు పేర్కొన్నారు.

ఆగస్టు 2023లో ఇదే డెవలపర్లు ఉమ్మడి కన్సార్టియంను నెలకొల్పారు. నియోపోలిస్‌లో ప్లాట్ 14 బిడ్‌ను గెలుచుకున్నారు. ఇందుకోసం ఎకరానికి రూ. 70 కోట్లు వెచ్చించారు. కాస్కేడ్స్ నియోపోలిస్ పేరిట మెగా రెసిడెన్షియల్ ప్రాజెక్ట్ ను మార్చి 2030 నాటికి కొనుగోలుదారులకు అందించాలనే లక్ష్యంతో నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఈ ప్రాజెక్టులో ప్రముఖ గ్లోబల్ రియాలిటీ కన్సల్టెంట్లు, యుహెచ్ఏ లండన్ (కాన్సెప్ట్ ఆర్కిటెక్ట్), కూపర్స్ హిల్ సింగపూర్ (ల్యాండ్‌స్కేప్ ఆర్కిటెక్ట్), స్టూడియో హెచ్ బి ఏ సింగపూర్ (ఇంటీరియర్ డిజైన్ - సౌకర్యాలు), బురో హాపోల్డ్ (యుకె) (స్ట్రక్చరల్ ఇంజనీరింగ్), మరియు క్వింటెసెన్షియల్లీ వంటి పలు అంతర్జాతీయ కన్సైర్జ్ సేవలు భాగమయ్యాయి.