...
...
Next Story

చర్లపల్లి - తిరువనంతపురం మధ్య ‘అమృత్ భారత్ రైలు’ ప్రారంభం… ఏపీ, తెలంగాణలో హాల్టింగ్ స్టేషన్లు ఇవే

చర్లపల్లి - తిరువనంతపురం అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ రైలు ప్రారంభమైంది. కేరళ పర్యటనలో భాగంగా ప్రధానమంత్రి మోదీ ఈ రైలును జెండా ఊపి ప్రారంభించారు. చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్.. వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది.

Published on: Jan 23, 2026, 15:47:14 IST
Advertisement

చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ రాకపోకలు ప్రారంభమయ్యాయి. ప్రధానమంత్రి మోదీ జెండా ఊపి ఈ సరికొత్త ట్రైన్ సేవలను ప్రారంభించారు. మొత్తం 29 స్టేషన్లలో ఈ ట్రైన్ కు హాల్టింగ్ ఇచ్చారు. ఇందులో తెలంగాణతో పాటు ఏపీలోని పలు రైల్వే స్టేషన్లు ఉన్నాయి.

అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్
అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్

చర్లపల్లి (హైదరాబాద్) – తిరువనంతపురం మధ్య ప్రారంభమైన ఈ అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్ వారానికి ఒకసారి సర్వీసు అందిస్తుంది. ఈ రైలు ప్రతి మంగళవారం (ట్రైన్ నెంబర్ 17041) ఉదయం చర్లపల్లి నుంచి ఉదయం 7.15కు బయలుదేరి.. మరుసటి రోజు (బుధవారం) మధ్యాహ్నం 2.45కు తిరువనంతపురం చేరుకుంటుంది. అక్కడినుంచి (ట్రైన్ నెంబర్ 17042) గురువారం రాత్రి 11.30కు బయలుదేరి.. శనివారం సాయంత్రం 5.30 గంటలకు చర్లపల్లికి చేరుకుంటుంది.

హాల్టింగ్స్ ఇవే…

ఈ అమృత్ భారత్ ఎక్స్ ప్రెస్ ట్రైన్… తెలంగాణలోని నల్గొండ, మిర్యాలగూడ, చర్లపల్లి, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నెల్లూరు, రేణిగుంట స్టేషన్లలో ఆగుతుంది. ఇక తమిళనాడులోని తిరుత్తణి, కటపాడి,జోలార్ పెట్టయ్, సేలం, ఈరోడ్, తిరుప్పూర్, కోయంబత్తూర్.. కేరళలోని పాలక్కాడ్, త్రిస్సూర్, అలువా, ఎర్నాకులం టౌన్, కొట్టాయం, చంగన్‌సెర్రీ, తిరువల్ల, చెంగనూర్, మావెలికర, కాయంకుళం, కరునాగపల్లి, కొల్లాం, వర్కాల శివగిరి మీదుగా తిరువనంతపురం చేరుకుంటుంది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks