హైదరాబాద్ నగరంలోని సౌత్‌వెస్ట్ ప్రాంత వాసులను అక్టోబర్ 27 ఒక విచిత్రమైన శబ్ధం భయాందోళనకు గురిచేసింది. ఆకస్మికంగా భూమి కంపించడమే కాకుండా, భారీ పేలుడు వంటి శబ్దాలు వినపడటంతో స్థానికులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. అయితే ఇది సాధారణ టెక్టోనిక్ భూకంపం కాదని, నీటి ఊటల కారణంగా సంభవించే హైడ్రో-సెస్మిసిటీ(Hydro-seismicity) అని నిపుణులు స్పష్టం చేశారు.

నగరంలోని రాజేంద్రనగర్, ఉప్పర్‌పల్లి, అత్తాపూర్, ఎర్రబోడ, కేశవస్వామి నగర్, లంగర్‌హౌజ్ వంటి ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు సంభవించాయి. గాలిలో లేదా భూమి అంతర్భాగంలో భారీ పేలుడు జరిగినట్లు వింత శబ్దాలు రావడం, దానికి తోడు నివాసాలు కదలడంతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు. ముఖ్యంగా ఎత్తైన భవనాల్లో నివసించే వారు ఆందోళన వ్యక్తం చేశారు.
ఏమిటీ హైడ్రో-సెస్మిసిటీ?
హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI) శాస్త్రవేత్తలు ఈ ఘటనపై స్పందిస్తూ ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని తేల్చిచెప్పారు. ఇది టెక్టోనిక్ భూకంపం కాదని వివరించారు. భారీ వర్షాల సమయంలో నీరు భూమి లోతుల్లోకి ఇంకి, గ్రెనైట్ రాతి పొరల్లో ఉండే చిన్న చిన్న రంధ్రాలు, క్రాక్స్‌లోకి చేరుతుంది. రాళ్ల నడుమ ఇరుక్కుపోయిన వర్షపు నీరు, గాలి తీవ్ర ఒత్తిడికి గురవుతాయి.
ఒత్తిడి పెరిగినప్పుడు భూమి లోపలి రాళ్ల పగుళ్ల వద్ద ఆకస్మిక కదలికలు ఏర్పడతాయి. ఈ క్రమంలో శక్తి ఒక్కసారిగా విడుదల కావడం వల్ల భూకంపం లాంటి ప్రకంపనలు, శబ్దాలు వస్తాయి. హైదరాబాద్ వంటి ప్రాంతాలకు వినాశకరమైన భూకంపాల ముప్పు చాలా తక్కువ అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హైదరాబాద్ అత్యంత దృఢమైన స్పటికాకార గ్రెనైట్(Crystalline Granite) పొరలపై ఉంది. దీనివల్ల పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు. భారతదేశాన్ని భూకంప ముప్పు ఆధారంగా జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
{{/usCountry}}హైదరాబాద్ అత్యంత దృఢమైన స్పటికాకార గ్రెనైట్(Crystalline Granite) పొరలపై ఉంది. దీనివల్ల పెద్ద భూకంపాలు వచ్చే అవకాశం దాదాపు లేదనే చెప్పవచ్చు. భారతదేశాన్ని భూకంప ముప్పు ఆధారంగా జోన్ 2, జోన్ 3, జోన్ 4, జోన్ 5 అనే నాలుగు విభాగాలుగా వర్గీకరించారు.
{{/usCountry}}జోన్ 2 (తక్కువ ప్రమాదం): హైదరాబాద్‌తో పాటు తెలంగాణలోని మెజారిటీ జిల్లాలు జోన్ 2 పరిధిలోకి వస్తాయి. అందుకే ఇక్కడ అత్యంత స్వల్ప స్థాయి కంపనాలు మాత్రమే నమోదవుతాయి. జోన్ 3 (మధ్యస్థ ప్రమాదం): తెలంగాణలోని కొన్ని తూర్పు ప్రాంతాలు మాత్రం మధ్యస్థ ముప్పు ఉండే జోన్ 3 కిందకు వస్తాయి.
ప్రస్తుతం నమోదైన ప్రకంపనలు కేవలం స్థానిక భౌగోళిక మార్పుల వల్ల (హైడ్రో-సెస్మిసిటీ) వచ్చినవే తప్ప, పెద్ద ప్రమాదానికి సంకేతం కాదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు.