తెలంగాణ సర్కార్ శుభవార్త - సనత్‌నగర్ TIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు
TIMS Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 122 టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.
TIMS Recruitment 2026: హైదరాబాద్ సనత్‌నగర్‌లోని తెలంగాణ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (TIMS) లో ఖాళీగా ఉన్న వివిధ పోస్టుల భర్తీకి ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. పూర్తిగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ విభాగాల్లో అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది.

మొత్తం 122 ఖాళీలు… వివరాలు
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 122 ఖాళీలను భర్తీ చేయనున్నారు. వీటిలో 98 టెక్నికల్ పోస్టులు, 24 అడ్మినిస్ట్రేటివ్ పోస్టులు ఉన్నాయి. టిమ్స్ సనత్‌నగర్ ఆసుపత్రిలో రెగ్యులర్ నియామకాలు పూర్తయ్యే లోపు, అక్కడి వైద్య సేవలకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు తాత్కాలిక ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ఈ కాంట్రాక్ట్ నియామకాలు చేపడుతున్నారు. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు 2026 జూలై 6వ తేదీ సాయంత్రం 4:00 గంటల లోపు తమ దరఖాస్తులను సమర్పించాల్సి ఉంటుంది.
టెక్నికల్ పోస్టుల వివరాలు (మొత్తం 98 ఖాళీలు) : ఆసుపత్రిలోని వివిధ ల్యాబ్‌లు, డయాగ్నోస్టిక్ విభాగాల్లో పని చేయడానికి అవసరమైన టెక్నీషియన్ పోస్టుల జాబితా క్రింది విధంగా ఉంది:
- ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 34 పోస్టులు
- అనస్థీషియా టెక్నీషియన్: 20 పోస్టులు
- ఎక్స్-రే/సి-ఆర్మ్ టెక్నీషియన్ గ్రేడ్-II: 10 పోస్టులు
- ఈసీజీ టెక్నీషియన్: 06 పోస్టులు
- క్యాథ్ ల్యాబ్ టెక్నీషియన్: 06 పోస్టులు
- బ్లడ్ బ్యాంక్ టెక్నీషియన్ గ్రేడ్-II: 04 పోస్టులు
- సీటీ టెక్నీషియన్ గ్రేడ్-II: 04 పోస్టులు
- ఎంఆర్‌ఐ టెక్నీషియన్: 04 పోస్టులు
- సీఎస్‌ఎస్‌డీ (CSSD) టెక్నీషియన్: 04 పోస్టులు
- ఈఈజీ టెక్నీషియన్ గ్రేడ్-II: 02 పోస్టులు
- బయోమెడికల్ టెక్నీషియన్: 02 పోస్టులు
- ఆడియోమెట్రీ టెక్నీషియన్: 01 పోస్టు
- ఆడియో విజువల్ టెక్నీషియన్: 01 పోస్టు
అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల వివరాలు (మొత్తం 24 ఖాళీలు) : కార్యాలయ నిర్వహణ, అకౌంట్స్ విభాగాల కోసం కింది పోస్టులను భర్తీ చేస్తున్నారు…
- సీనియర్ అసిస్టెంట్: 05 పోస్టులు
- సూపర్‌వైజర్: 04 పోస్టులు
- హెల్త్ ఇన్‌స్పెక్టర్: 04 పోస్టులు
- అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్: 02 పోస్టులు
- డిప్యూటీ రిజిస్ట్రార్ / డిప్యూటీ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02 పోస్టులు
- అసిస్టెంట్ రిజిస్ట్రార్ / అసిస్టెంట్ ఫైనాన్షియల్ కంట్రోలర్: 02 పోస్టులు
- అకౌంటెంట్: 02 పోస్టులు
- మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (జూనియర్): 01 పోస్టు
- స్టాటిస్టిషియన్: 01 పోస్టు
- అకౌంట్స్ ఆఫీసర్ / ఫైనాన్షియల్ కంట్రోలర్: 01 పోస్టు
ఈ పోస్టులకు సంబంధించిన విద్యార్హతలు, వయోపరిమితి, దరఖాస్తు విధానం మరియు జీతభత్యాల పూర్తి వివరాలను అభ్యర్థులు నిమ్స్ అధికారిక వెబ్‌సైట్ ద్వారా తెలుసుకోవచ్చు. నిబంధనల ప్రకారం అర్హత గల అభ్యర్థులు గడువు తేదీ లోపల దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులు సూచించారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్‌టీ ఇన్‌స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

