...
...
Next Story

జర్మనీలో ఉద్యోగాలు.. నెలకు రూ.3.8 లక్షల జీతం.. దరఖాస్తుకు జూన్ 30 ఆఖరి తేదీ!

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(టామ్‌కామ్) జర్మనీలో నెలకి రూ. 3.8 లక్షల జీతంతో ఉద్యోగాల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది. జూన్ 30వ తేదీని చివరి తేదీగా ఉంది.

Published on: Jun 28, 2026, 20:03:35 IST
Advertisement

విదేశాల్లో స్థిరపడాలనుకునే నిరుద్యోగులకు, వైద్య రంగ నిపుణులకు తెలంగాణ ప్రభుత్వం ఒక సువర్ణావకాశాన్ని కల్పించింది. తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ(TOMCOM) జర్మనీలో ఫిజియోథెరపిస్ట్ (Physiotherapist) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఎంపికైన అభ్యర్థులకు నెలకు గరిష్టంగా రూ. 3.8 లక్షల వరకు వేతనం లభించనుంది. ఈ ఉద్యోగ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలు, అర్హతలు, దరఖాస్తు విధానం కింది విధంగా ఉన్నాయి.

ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు
ఫిజియోథెరపిస్ట్ ఉద్యోగాలు

ఫిజియోథెరపీలో డిప్లొమా, బ్యాచిలర్స్, లేదా మాస్టర్స్ డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. కౌన్సిల్ రిజిస్ట్రేషన్ తర్వాత కనీసం 2 సంవత్సరాల పని అనుభవం తప్పనిసరి. దరఖాస్తుదారుల వయస్సు 43 సంవత్సరాల కంటే తక్కువ ఉండాలి. జర్మన్ హెల్త్‌కేర్ నిబంధనల ప్రకారం అభ్యర్థులు నిర్దేశిత వ్యాక్సినేషన్ (టీకాలు) పూర్తి చేసుకుని ఉండాలి.

ఈ ఉద్యోగాలలో జీతాన్ని రెండు విభాగాలుగా చెల్లిస్తారు. రెకగ్నిషన్ కాలంలో (లైసెన్స్ రాకముందు) నెలకు 2,500 నుండి 2,900 యూరోలు (సుమారు రూ. 2.74 లక్షల నుండి రూ. 3.17 లక్షలు). జర్మన్ లైసెన్స్ పొందిన తర్వాత నెలకు 3,500 నుండి 3,800 యూరోలు (సుమారు రూ. 3.35 లక్షల నుండి రూ. 3.80 లక్షలు).

ఎంపికైన అభ్యర్థులకు టామ్‌కామ్ ద్వారా జర్మన్ భాషా (German Language) శిక్షణను ఇప్పిస్తారు. A1 స్థాయి నుండి ఉచిత శిక్షణ ప్రారంభమవుతుంది. (అభ్యర్థులు B1/B2 సర్టిఫికేషన్ సాధించాల్సి ఉంటుంది). వీసా అసిస్టెన్స్, డాక్యుమెంటేషన్ సపోర్ట్, ఎంప్లాయర్ స్పాన్సర్డ్ హెల్త్ ఇన్సూరెన్స్, ఏడాదికి 25-30 రోజుల వార్షిక సెలవులు ఉంటాయి. జర్మనీలో శాశ్వత నివాసం (Permanent Residency) పొందేందుకు ఇది అద్భుతమైన అవకాశం. దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ జూన్ 30, 2026గా ఉంది.

దరఖాస్తు చేయడం ఎలా?

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe