...
...
Next Story

ఆశన్న కూడా ఆయుధం వదిలేశారు.. ఛత్తీస్‌ఘడ్ పోలీసుల ఎదుట లొంగిపోయిన 208 మంది మావోయిస్టులు!

మావోయిస్టు పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌ఘడ్ పోలీసుల ఎదుట మావోయిస్ట్ సీనియర్ నేత ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు లొంగిపోయారు.

Published on: Oct 17, 2025, 12:54:24 IST
Advertisement

మావోయిస్టు పార్టీకి వరుసగా ఎదురుదెబ్బలు తగులుతూనే ఉన్నాయి. మెున్నటికి మెున్న మావోయిస్టు అగ్రనేత మల్లోజుల 60 మంది సహచరులతో కలిసి లొంగిపోయారు. తాజాగా అగ్రనేత, పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న, రూపేష్ ఛత్తీస్‌ఘడ్ పోలీసులు ఎదట లొంగిపోయారు. ఆశన్న సహా 208 మంది మావోయిస్టులు పోలీసులకు ఆయుధాలు అప్పగించారు.

పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆశన్న
పోలీసుల ఎదుట లొంగిపోయిన ఆశన్న

మావోయిస్టు పార్టీ చరిత్రలో ఇదే పెద్ద లొంగుబాటుగా చెబుతున్నారు. లొంగిపోయిన వారిలో 110 మంది మహిళలు, 98 మంది పురుషులు ఉన్నారు. 153 తుపాకులు, 19 ఏకే 47 రైఫిళ్లు, 17 ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు, 23 ఇన్సాస్‌లు, 1 ఇన్సాస్ ఎల్ఎంజీ, 303 రైఫిళ్లు, 11 బీజీఎల్, నాలుగు కార్బైన్‌లు, 41 బోర్ షాట్ గన్స్, పిస్తోళ్లను పోలీసులకు అప్పజెప్పారు.

అయితే ఆశన్న పేరు చాలా కీలక దాడుల్లో వినిపించింది. ఆయన వ్యూహం వేస్తే పక్కాగా జరిగేదని కొందరు చెబుతుంటారు. సీఎం చంద్రబాబు నాయుడు, మాజీ సీఎం నేదురుమల్లి జనార్దనరెడ్డిలపై బాంబులు పేల్చి హత్యాయత్నం చేసినప్పుడు ఆశన్న పేరు ఎక్కువగా వినిపించింది. అంతేకాదు ఐపీఎస్ అధికారి ఉమేశ్ చంద్ర హత్య, అప్పటి హోంమంత్రి మాధవరెడ్డి హత్య ఘటనల్లోనూ ఆశన్న ఉన్నారని ఇప్పటికీ పలువురు చెబుతుంటారు.

ఆశన్నది ములుగు జిల్లా వెంకటాపూర్ మండలంలోని నర్సింగాపూర్ గ్రామం. 40 ఏళ్ల కిందట ఉద్యమం వైపునకు ఆకర్శితులు అయ్యారు. ఒకటి నుంచి ఐదో తరగతి వరకు వెంకటాపూర్ మండలంలోని లక్ష్మీదేవిపేట ప్రభుత్వ స్కూల్‌లో చదువుకున్నారు. తర్వాత కాజీపేటలో సెకండరీ విద్య, కాకతీయ యూనివర్సిటీలో డిగ్రీ చదివారు. ఈ సమయంలోనే రాడికల్ స్టూడెంట్ యూనియన్‌తో సంబంధాలు ఏర్పడ్డాయి. ఆర్ఎస్‌యూ కోసం ఆశన్న చాలా కాలం పని చేశారు. తర్వాత నిర్బంధం పెరగడంతో 25 ఏళ్ల వయసులో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. మావోయిస్టు పార్టీలో ఆయన కీలక బాధ్యతలు చూసుకున్నారు.

ముందుగా రక్షణ చాలా అవసరం అని, సమాజ ప్రధాన స్రవంతిలోకి రావాల్సిన సమయం వచ్చిందని చెప్పారు ఆశన్న. అడవులు, ఇతర రాష్ట్రాల్లోని మావోయిస్టులు లొంగిపోవాలని అనుకుంటే తనతోపాటు చేరేందుకు సంప్రదించాలని పిలుపుచ్చారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe