న్యూ ఇయర్ వేళ డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు : హైదరాబాద్ సిటీలో 2,731 కేసులు నమోదు - ఎక్కువగా ఎక్కడంటే..?
డిసెంబర్ 31 రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు ముందు జాగ్రత్త చర్యల్లో భాగంగా హైదరాబాద్ సిటీ వ్యాప్తంగా డ్రంక్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. అన్ని కమిషనర్లేట్లలో కలిపి మొత్తం 2,731 కేసులు నమోదయ్యాయి.
నూతన సంవత్సరం సందర్భంగా నగరంలోని కమిషనరేట్ల పరిధిలో పోలీసులు డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో భారీగా వాహనాలను పట్టుకున్నారు. మొత్తం 2,731 మందిపై కేసులు నమోదు చేశారు. గతేడాదితో పోల్చితే ఈసారి 5 శాతం కేసుల సంఖ్య తగ్గినట్లు పోలీసులు తెలిపారు. గత సంవత్సరం న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా 2,873 కేసులు నమోదయ్యాయి.

కమిషనర్లేట్ల వారీగా కేసులు…
ఈసార నమోదైన డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులను కమిషనరేట్ల వారీగా చూస్తే…. హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో 1,198 మంది, సైబరాబాద్‌లో 928 మంది, మాల్కాజ్ గిరి కమిషరేట్ పరిధిలో 605 మంది డ్రంక్ అండ్ డ్రైవ్‌లో పట్టుబడ్డారు. ఈ వివరాల ప్రకారం… హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోనే అత్యధికంగా కేసులు నమోదయ్యాయి.
మల్కాజిగిరి పోలీస్ కమిషనరేట్ లో నూతన సంవత్సర వేడుకలు పెద్ద సంఘటనలు, రోడ్డు ప్రమాదాలు జరగకుండా గడిచిపోయాయని సంబంధిత పోలీస్ అధికారులు ప్రకటించారు. ఈ కమిషనరేట్ అంతటా 36 ప్రత్యేక బృందాలను మోహరించారు. డ్రైవ్ సమయంలో మొత్తం 605 మంది మద్యం మత్తులో డ్రైవింగ్ చేస్తూ పట్టుబడ్డగా… వీరిపై కేసులు నమోదయ్యాయి.
ఛార్జిషీట్లు దాఖలు చేసిన తర్వాత నిందితులందరినీ కోర్టులో హాజరుపరుస్తామని పోలీసు అధికారులు తెలిపారు. దీనితో పాటు వారి డ్రైవింగ్ లైసెన్సులను స్వాధీనం చేసుకుని మోటారు వాహనాల చట్టం, 1988 లోని సెక్షన్ 19 ప్రకారం సస్పెండ్ చేయడానికి సంబంధిత ప్రాంతీయ రవాణా అధికారులకు (ఆర్టీఏ) పంపబడుతుందని పోలీసుల అధికారులు వివరించారు. ఎల్బీనగర్, వనస్థలిపురం, ఉప్పల్, కుశాయిగూడ తదితర ప్రాంతాల్లో డ్రంక్ డ్రైవ్ కేసులు ఎక్కువగా నమోదయ్యాయి.
విస్తృతమైన ట్రాఫిక్ నిర్వహణ మరియు రహదారి భద్రతా నిబంధనలను కఠినంగా అమలు చేయడం వల్ల నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మల్కాజిగిరి కమిషనరేట్ పరిధిలో ఎక్కడా పెద్ద రోడ్డు ప్రమాదాలు జరగలేదని అధికారులు గుర్తించారు.
రోడ్లపై భద్రతను కాపాడటానికి దోహదపడిన పౌరుల సహకారం మరియు బాధ్యతాయుతమైన ప్రవర్తనకు మల్కాజిగిరి పోలీసులు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే రోజుల్లోనూ డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.
ABOUT THE AUTHORMaheshwaram Mahendra Charyమహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్టీ ఇన్స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More

E-Paper

