...
...
Next Story

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్లు.. హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు.. ఇలా వెళ్లిపోండి

జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక నామినేషన్ల నేపథ్యంలో హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు ప్రకటించారు పోలీసులు. భారీ ఎత్తున ర్యాలీలు ఉండటంతో ప్రయాణికులకు ఇబ్బందికలగకుండా చర్యలు తీసుకున్నారు.

Published on: Oct 17, 2025, 10:26:35 IST
Advertisement

జూబ్లీహిల్స్ అసెంబ్లీ ఉప ఎన్నిక నామినేషన్ల నేపథ్యంలో అక్టోబర్ 17న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ జారీ చేశారు. అక్టోబర్ 17న ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు జరగనున్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నికకు నామినేషన్ ప్రక్రియను దృష్టిలో ఉంచుకుని ట్రాఫిక్ పోలీసులు ట్రాఫిక్ మళ్లిస్తున్నారు.

హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు
హైదరాబాద్‌లో ట్రాఫిక్ మళ్లింపు

యూసఫ్‌గూడ, కృష్ణ నగర్, సమీప ప్రాంతాలలో అనేక రాజకీయ ర్యాలీలు, ఊరేగింపులు జరిగే అవకాశం ఉంది. దీని కారణంగా వాహనాల మళ్లింపులు, పార్కింగ్ ఏర్పాట్లు చేయనున్నారు.

యూసఫ్‌గూడ, కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం, కృష్ణ నగర్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అనేక రాజకీయ పార్టీలు ర్యాలీలు, ఊరేగింపులు ఉంటాయి. అటువైపుగా వెళ్లొద్దని చెప్పారు అధికారులు.

ట్రాఫిక్ మళ్లింపు ఇలా..

దీని ప్రకారం మైత్రీవనం జంక్షన్ నుండి యూసఫ్‌గూడ బస్తీ, రహమత్‌నగర్, కార్మికనగర్, బోరబండ వైపు వెళ్లే వాహనాలను కృష్ణకాంత్ పార్క్ - జీటీఎస్ టెంపుల్ - కళ్యాణ్ నగర్ - మోతీ నగర్ - బోరబండ బస్టాప్ మీదుగా మళ్లిస్తారు.

అదేవిధంగా యూసఫ్‌గూడ చెక్‌పోస్ట్ మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు వచ్చే ట్రాఫిక్‌ను యూసఫ్‌గూడ బస్తీ వద్ద ఆర్‌బీఐ క్వార్టర్స్ - కృష్ణా నగర్ జంక్షన్ - జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్ వైపు మళ్లిస్తారు.

జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, వెంకటగిరి నుండి స్టేడియం వైపు వెళ్లే వాహనాలను కృష్ణ నగర్ జంక్షన్ వద్ద శ్రీనగర్ కాలనీ - పంజాగుట్ట వైపు మళ్లిస్తారు.

బోరబండ బస్టాప్ నుండి యూసఫ్‌గూడ వైపు వచ్చే ట్రాఫిక్‌ను ప్రైమ్ గార్డెన్ ఫంక్షన్ హాల్, శ్రీ రామ్ నగర్ ఎక్స్ రోడ్స్ వద్ద మిడ్‌ల్యాండ్ బేకరీ - జీటీఎస్ కాలనీ - కళ్యాణ్ నగర్ జంక్షన్ - వెంగళరావు నగర్ - ఉమేష్ చంద్ర విగ్రహం - మైత్రివనం జంక్షన్ వైపు మళ్లిస్తారు.

ట్రాఫిక్ మళ్లింపులు వాహనదారులు సహకరించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు విజ్ఞప్తి చేశారు. కార్ల పార్కింగ్ కోసం స్థలం యూసఫ్‌గూడ మెట్రో పార్కింగ్ (జానకమ్మ తోట 1, 2) వద్ద, సవేరా ఫంక్షన్ హాల్, మహమూద్ ఫంక్షన్ హాల్ వద్ద అందుబాటులో ఉంటుంది.

మెుత్తానికి కోట్ల విజయ భాస్కర్ రెడ్డి ఇండోర్ స్టేడియం ప్రాంతానికి ప్రయాణికులు దూరంగా ఉండాలని, ప్రత్యామ్నాయ మార్గాలను ఉపయోగించాలని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు కోరారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks