నల్లగొండలో విషాదం.. ఒకే ఇంట్లో కుళ్లిన స్థితిలో నలుగురి మృతదేహాలు.. ఎలా చనిపోయారు?

నల్లగొండ జిల్లాలో విషాదం జరిగింది. నల్లగొండ పట్టణం సాగర్ రోడ్డు తెలంగాణ కాలనీలో ఓ ఇంట్లో నాలుగు డెడ్ బాడీలు గుర్తించారు. ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మగ వ్యక్తుల మృతదేహాలు లభ్యమయ్యాయి.

Published on: Jun 22, 2026, 21:21:27 IST
By , Nalgonda
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

నల్లగొండ పట్టణంలో అత్యంత హృదయవిదారకమైన ఘటన వెలుగుచూసింది. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు వ్యక్తులు తమ ఇంట్లోనే అనుమానాస్పద స్థితిలో ప్రాణాలు కోల్పోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. బతుకుదెరువు కోసం నమ్ముకున్న వ్యాపారం సజావుగా సాగకపోవడమో లేదా మరేదైనా ఆర్థిక, కుటుంబ సమస్యల వల్లో తెలియదు కానీ, ఒక నిండు కుటుంబం ఇలా విగతజీవులుగా మారడం శోకసంద్రంలో నెట్టింది.

నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు
నల్లగొండలో ఒకే ఇంట్లో నలుగురి మృతదేహాలు

నల్లగొండ పట్టణ పరిధిలోని సాగర్ రోడ్డులో గల తెలంగాణ కాలనీలో ఈ విషాదం చోటుచేసుకుంది. స్థానికంగా నివాసముంటున్న షేక్ సుల్తాన్ ఇంట్లో నుంచి గత తీవ్రమైన దుర్వాసన వస్తుండటాన్ని గమనించిన పొరుగువారు పోలీసులకు సమాచారం అందించారు.

వెంటనే ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు, ఇల్లు లోపలి నుంచి గడియ పెట్టి ఉండటంతో తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లారు. అక్కడ కనిపించిన దృశ్యం చూసి పోలీసులు సైతం దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషుల మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయిన స్థితిలో పడి ఉన్నాయి.

మరణించిన వారిని పట్టణంలో బ్యాగుల వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న షేక్ సుల్తాన్, ఆయన భార్య హసీనా, వారి ఇద్దరు పిల్లలుగా చెబుతున్నారు. మృతదేహాలు పూర్తిగా కుళ్లిపోయి, దుర్వాసన వస్తుండటాన్ని బట్టి చూస్తే, వారు దాదాపు నాలుగు రోజుల క్రితమే మరణించి ఉంటారని పోలీసులు ప్రాథమికంగా అనుమానిస్తున్నారు.

ఘటనా స్థలంలో లభించిన ఆధారాలను బట్టి సదరు కుటుంబం ఆత్మహత్యకు పాల్పడి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు. వ్యాపారంలో నష్టాలు వచ్చాయా? అప్పుల బాధలు ఏమైనా ఉన్నాయా? లేక కుటుంబంలో మరేదైనా తీవ్రమైన సమస్య ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. క్లూస్ టీమ్ రంగంలోకి దిగి ఘటనా స్థలం నుండి కీలక ఆధారాలను సేకరించింది.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More