కొన్ని రోజులుగా ట్రైనీ ఐపీఎస్ ఉదయ్ కృష్ణారెడ్డి కేసుపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది. అయితే ఉదయ్ కృష్ణారెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. తనపై నమోదైన కేసును కొట్టివేయాలని పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను బుధవారం(జులై 22) హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఉదయ్ కృష్ణారెడ్డి లైంగిక వేధింపులకు గురిచేశాడంటూ ఓ మహిళా ట్రైనీ ఐపీఎస్ అత్తాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది.

శివరాంపల్లిలోని నేషనల్ పోలీస్ అకాడమీలో శిక్షణ పొందుతున్న ఉదయ్ కృష్ణ రెడ్డి అనే ఐపీఎస్ ట్రైనీపై బాధితురాలు ఫిర్యాదు చేసింది. కొన్ని వారాలుగా నిందితుడు తనను తీవ్ర వేధింపులకు గురిచేస్తున్నట్లు సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్ అధికారిణి తన ఫిర్యాదులో పేర్కొ్న్నారు. జూన్ 23వ తేదీ నుండి ఈ వేధింపుల పర్వం మొదలైందని, రోజురోజుకూ నిందితుడి ప్రవర్తన మితిమీరిపోయిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
బాధితురాలు పోలీసులకు తెలిపిన వివరాల ప్రకారం.. ఉదయ్ కృష్ణారెడ్డి ఆమెకు వాట్సాప్ ద్వారా తీవ్ర అసభ్యకరమైన, లైంగిక వేధింపులతో కూడిన సందేశాలను పంపేవాడు. అంతటితో ఆగకుండా, అకాడమీలోని ఇతర ట్రైనీల సమక్షంలో ఆమెను ఉద్దేశించి తెలుగులో అత్యంత అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యలు చేస్తూ మానసిక క్షోభకు గురిచేసేవాడని తెలిపారు.
ఆ తర్వాత రోజు ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఆసుపత్రిలో జాయిన్ అయ్యాడు. ఆయన రాసిన లేఖ ఒకటి బయటకు వచ్చింది. అందులో ఉదయ్ తీవ్రమైన ఆరోపణలు చేశారు. సదరు ట్రైనీ మహిళా ఐపీఎస్‌తో తనకు గత ఏడాది కాలంగా సన్నిహిత సంబంధాలు ఉన్నాయని లేఖలో పేర్కొన్నారు. వారిద్దరి మధ్య ఉన్న సంబంధానికి సంబంధించిన వీడియో ఆధారాలు కూడా తన వద్ద భద్రంగా ఉన్నాయని ఆయన లేఖలో ప్రస్తావించారు.
ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురై ఆయనను వెంటనే ఎస్ఆర్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లేఖలోని అంశాలు నిజమేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఐపీఎస్ ట్రైనీ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
{{/usCountry}}ఉదయ్ కృష్ణారెడ్డి అపస్మారక స్థితిలో ఉన్నట్టుగా గమనించిన కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళనకు గురై ఆయనను వెంటనే ఎస్ఆర్ నగర్‌లోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై ఎస్ఆర్ నగర్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. లభించిన సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు, లేఖలోని అంశాలు నిజమేనా అనే కోణంలో విచారణ జరుపుతున్నారు. సర్దార్ వల్లభ్‌భాయ్ పటేల్ జాతీయ పోలీస్ అకాడమీ వంటి ప్రతిష్టాత్మక సంస్థలో ఐపీఎస్ ట్రైనీ అధికారుల మధ్య ఇలాంటి వివాదం చోటుచేసుకోవడం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
{{/usCountry}}