తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ.. ఏ అధికారి ఎక్కడకు?
తెలంగాణలో భారీగా ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. మెుత్తం 45 మందిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
తెలంగాణలో 45 మంది ఐఏఎస్ అధికారులు బదిలీ అయ్యారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏ అధికారి ఎక్కడకు బదిలీ అయ్యారో చూద్దాం..

- సంజయ్ కుమార్ - పరిశ్రమలు, ఐటీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ పదవి నుంచి పీఆర్ అండ్ ఆర్డీ, ఆర్‌డబ్ల్యూఎస్ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీగా బదిలీ.
- సబ్యసాచి ఘోష్ – ఫ్లాగ్‌షిప్ వెల్ఫేర్ అండ్ డెవలప్‌మెంట్ స్కీమ్స్ యూనిట్‌తో పాటు సీఎస్ఆర్ బాధ్యతలు.
- ఎం. దాన కిషోర్ – లేబర్, ఎంప్లాయ్మెంట్, ట్రైనింగ్ అండ్ ఫ్యాక్టరీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా కొనసాగుతూ విపత్తు నిర్వహణ శాఖకు అదనపు బాధ్యత.
- ఎన్.శ్రీధర్ – ఐటీ అండ్ పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా నియామకం.
- రాహుల్ బొజ్జా – జనరల్ అడ్మినిస్ట్రేషన్ శాఖలో రాజకీయ వ్యవహారాల ప్రిన్సిపల్ సెక్రటరీగా బదిలీ.. బీసీ వెల్ఫేర్ శాఖకు అదనపు బాధ్యత.
- శ్రీధర్ – ఇరిగేషన్ అండ్ సీఏడీ శాఖ కార్యదర్శిగా నియామకం.
- గౌరవ్ ఉప్పల్ – ఫైనాన్స్ అండ్ ప్లానింగ్ శాఖ కార్యదర్శిగా నియామకం. టీజీఆర్‌ఏసీ ఈఓ డీజీగా అదనపు బాధ్యత.
- బీ.విజేంద్ర – మహబూబ్‌నగర్ కలెక్టర్ నుంచి తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శిగా నియామకం.
- డి.దివ్య – సర్ప్ సీఈఓగా కొనసాగుతూ ప్రజావాణి రాష్ట్ర నోడల్ అధికారిగా అదనపు బాధ్యత.
- అద్వైత్ కుమార్ సింగ్ – మహబూబాబాద్ కలెక్టర్ నుంచి తెలంగాణ భవన్ (ఢిల్లీ)లో సమన్వయ శాఖ ప్రత్యేక కార్యదర్శిగా నియామకం.
- ఎం.హనుమంత రావు – యాదాద్రి భువనగిరి కలెక్టర్ నుంచి ఎండోమెంట్స్ డైరెక్టర్‌గా బదిలీ.
- సిక్తా పట్నాయక్ – నారాయణపేట్ కలెక్టర్ నుంచి ఫైనాన్స్ శాఖ స్పెషల్ సెక్రటరీగా నియామకం.
- సందీప్ కుమార్ ఝా – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి జనగాం కలెక్టర్‌గా నియామకం.
- ఎండీ ముషరఫ్ అలి ఫరూఖీ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీ నుంచి మూడో డిస్కమ్ సీఎండీగా బదిలీ.
- పమేలా సత్పతి – కరీంనగర్ కలెక్టర్ నుంచి కార్మిక శాఖ స్పెషల్ కమిషనర్‌గా బదిలీ.
- అనురాగ్ జయంతి – జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ నుంచి యాదాద్రి భువనగిరి కలెక్టర్‌గా నియామకం.
- రాహుల్ రాజ్ పీఎస్ – మెదక్ కలెక్టర్ నుంచి సహకార శాఖ స్పెషల్ కమిషనర్ అండ్ రిజిస్ట్రార్‌గా నియామకం.
- భవేష్ మిశ్రా – ఐటీ శాఖలో స్పెషల్ సెక్రటరీగా రీడిజిగ్నేషన్.
- జితేష్ వీ.పాటిల్ – టీజీఎస్పీడీసీఎల్ సీఎండీగా నియామకం.
- రిజ్వానా భాష షేక్ – జనగాం కలెక్టర్ నుంచి జోగులాంబ గద్వాల్ కలెక్టర్‌గా బదిలీ.
- సంతోష్ బీఎం – జోగులాంబ గద్వాల్ కలెక్టర్ నుంచి గిరిజన సంక్షేమ డైరెక్టర్‌గా బదిలీ.
- ప్రతీక్ జైన్ – వికారాబాద్ కలెక్టర్ నుంచి నారాయణపేట్ కలెక్టర్‌గా నియామకం.
- స్నేహ శబరిష్ – హనుమకొండ కలెక్టర్ నుంచి మహబూబాబాద్ కలెక్టర్‌గా బదిలీ.
- పి.కాత్యాయిని దేవి– స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్‌గా నియామకం.
- జి.ఫణింద్ర రెడ్డి – టీజీఎంఎస్ఐడీసీ ఎండీ నుంచి నారాయణపేట్ అదనపు కలెక్టర్‌గా బదిలీ.
- చిత్ర మిశ్రా – ఏటూరునాగారం ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ నుంచి కరీంనగర్ కలెక్టర్‌గా నియామకం.
- గరిమ అగర్వాల్ – రాజన్న సిరిసిల్ల కలెక్టర్‌గా నియామకం.
- దీపక్ తివారీ – వికారాబాద్ కలెక్టర్‌గా నియామకం.
- ప్రతిమ సింగ్ – మెదక్ కలెక్టర్‌గా నియామకం.
- అంకిత్ – భద్రాద్రి కొత్తగూడెం కలెక్టర్‌గా నియామకం
- చహత్ బాజ్‌పాయ్ – హనుమకొండ కలెక్టర్‌గా నియామకం, జీడబ్ల్యూఎంసీ కమిషనర్‌గా అదనపు బాధ్యత.
- ఖుష్బూ గుప్తా – మహబూబ్‌నగర్ కలెక్టర్‌గా నియామకం.
- మంద మకరందు – జీహెచ్ఎంసీ రాజేంద్రనగర్ జోనల్ కమిషనర్.
- ఫైజన్ అహ్మద్ – మెడ్చల్ మల్కాజిగిరి అదనపు కలెక్టర్.
- శివేంద్ర ప్రతాప్ – హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్.
- Parmar Pinkeshkumar Lalitkumar – జీహెచ్ఎంసీ కుత్బుల్లాపూర్ జోనల్ కమిషనర్.
- ఉమా శంకర్ ప్రసాద్ – వికారాబాద్ అదనపు కలెక్టర్.
- జీవీ శ్యామ్ ప్రసాద్ లాల్ – నాగర్‌కర్నూల్ అదనపు కలెక్టర్
- పి.చంద్రయ్య – మంచిర్యాల అదనపు కలెక్టర్
- వైవీ గణేష్ – వరంగల్ అదనపు కలెక్టర్
- అబ్దుల్ హమీద్ – సిద్ధిపేట అదనపు కలెక్టర్
- బి.వెంకటేశ్వర్లు – నిర్మల్ అదనపు కలెక్టర్
- ఎన్.కిమ్యా నాయక్ – వనపర్తి అదనపు కలెక్టర్
- కె.విద్యాసాగర్ – ఇండస్ట్రీ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ సెల్ అదనపు సీఈఓగా నియామకం
- ఎం.సురేందర్ – ప్రజావాణి అదనపు నోడల్ అధికారిగా నియామకం
మొత్తం 45 మంది అధికారులకు బదిలీలు/కొత్త బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


