TS SSC Supply Exams 2026 : పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షల ముఖ్యమైన తేదీలు.. రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ షెడ్యూల్

TS SSC Supplementary Exams 2026 : తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. దీనికి సంబంధించిన ముఖ్యమైన తేదీలు అధికారికంగా విడుదల చేశారు.

Published on: Apr 29, 2026, 14:33:55 IST
By , Hyderabad
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో పదో తరగతి పరీక్షల ఫలితాలు విడుదల అయ్యాయి. అర్హులైన అభ్యర్థుల కోసం నిర్వహించే ఎస్ఎస్‌సీ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు 05.06.2026 నుంచి 12.06.2026 వరకు జరుగుతాయి. ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. పరీక్షలు నిర్వహించడానికి అందుబాటులో ఉన్న సమయం పరిమితంగా ఉండటంతో రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ ఫలితాలను వేచి చూడకుండా దరఖాస్తు స్వీకరిస్తామని బోర్డు స్పష్టం చేసింది.

తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు
తెలంగాణ పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి మార్చి 2026 పరీక్షల్లో ఫెయిల్ అయినవారు.. అలాగే 2015 సీసీఈ ప్యాటర్న్ నుంచి ఫెయిల్ అయినవారు, అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావాలనుకుంటే.. 30.04.2026 నుంచి నిర్ణిత గడువు ప్రకారం పరీక్ష ఫీజును చెల్లించాలని అధికారులు వెల్లడించారు.

అభ్యర్థులు పరీక్ష ఫీజను సంబంధిత పాఠశాల ప్రధానోపాద్యాయులకు ఆన్‌లైన్ ద్వారా చెల్లించడానికి గడువు తేదీని 14.05.2026గా నిర్ణయించారు. హెడ్‌మాస్టర్లు ఈఎన్ఆర్‌ను ఆన్‌లైన్ ద్వారా డీఈవోకు సమర్పించడానికి చివరి తేదీ 15.05.2026గా ఉంది. డీఈఓలు ఈఎన్ఆర్‌ను ప్రభుత్వ పరీక్షల కార్యాలయానికి ఆన్‌లైన్ ద్వారా సమర్పించడానికి గడువు తేదీ 16.05.2026గా ఉంది. రూ.50 ఆలస్య రుసుముతో సంబంధిత సబ్జెక్ట్ పరీక్ష ప్రారంభానికి రెండు రోజుల ముందు వరకు చెల్లించవచ్చు.

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ షెడ్యూల్

రీకౌంటింగ్/రీవెరిఫికేషన్ షెడ్యూల్‌ను కూడా అధికారులు ప్రకటించారు. ఇందుకోసం ఆన్‌లైన్‌లో https://bse.telangana.gov.in వెబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలనుకునే.. అభ్యర్థులు 30.04.2026 నుంచి 14.05.2026 వరకు నిర్దేశిత విధానం ప్రకారం.. నిర్ణీత గడువులోగా దరఖాస్తు చేసుకోవచ్చు.

  • మార్కుల రీకౌంటింగ్ ఫీజు-రూ.500
  • రీ-వెరిఫికేషన్-రూ.1000(ఒక్కో సబ్జెక్ట్‌కు ఉంటుంది)

రీకౌంటింగ్, రీ వెరిఫికేషన్‌ కోసం కొన్ని పత్రాలు అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అవి హాల్ టికెట్ జిరాక్స్, హెడ్‌మాస్టర్ సంతకం చేసిన కంప్యూటరైజ్డ్ మార్క్స్ మెమో ప్రతులు, దరఖాస్తులు వ్యక్తిగత అభ్యర్థి లేదా హెడ్‌మాస్టర్ ద్వారా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయాలి. బోర్డుకు పోస్టు ద్వారా చేసిన దరఖాస్తులను స్వీకరించరు.

ఇక రీ వెరిఫికేషన్‌లో పలు విషయాలు ఉంటాయి. మార్కుల మళ్లీ లెక్కిస్తారు. అన్ని సమాధానాలకు మార్కులు నమోదు చేసిన విషయాన్ని పరిశీలిస్తారు. మూల్యాంకనం చేయని సమాధానాలు ఉంటే మూల్యాంకనం చేస్తారు. తక్కువగా మార్కులు ఇచ్చారని చేసే అభ్యర్థనలు పరిగణించరు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More