అమెరికాలో నిఖితా గోడిశాల హత్య కేసులో ట్విస్ట్.. చంపింది ప్రేమించిన వ్యక్తి కాదు!
అమెరికాలో హైదరాబాద్‌కు చెందిన నిఖితా గోడిశాల హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే ఆమెను చంపింది మాజీ ప్రియుడు అర్జున్ శర్మ అంటూ వార్తలు వచ్చాయి. ఈ విషయంపై క్లారిటీ వచ్చింది.
అమెరికాలో తన మాజీ ప్రియుడి చేతిలో నిఖితా గోడిశాల(27) హత్యకు గురైందని వార్తలు వచ్చాయి. కానీ ఈ విషయంపై మృతురాలి తండ్రి ఆనంద్ గోడిశాల స్పష్టత ఇచ్చారు. అర్జున్ శర్మ, నిఖితా ప్రేమికులు కాదని చెప్పారు. ఆర్థిక వ్యవహారాలే ఈ హత్యకు కారణం అని చెప్పారు.

మేరీల్యాండ్‌లోని కొలంబియాలోని హోవార్డ్ కౌంటీలో నిఖితా గొడిశాల (27) హత్యకు గురైంది. ఆమె మాజీ ప్రియుడు అర్జున్ శర్మ ఆమెను కత్తితో పొడిచి, ఆమె కనిపించడంలేదని ఫిర్యాదు చేశాడని, ఆపై భారతదేశానికి పారిపోయాడని పోలీసులు మెుదటగా భావించారు. తన కుమార్తె హత్యపై తండ్రి ఆనంద్ గొడిశాల హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు.
26 ఏళ్ల నిందితుడు అర్జున్ శర్మ తన కుమార్తె మాజీ ప్రియుడు అనే విషయాన్ని ఆనంద్ గోడిశాల ఖండించారు. అర్జున్ శర్మ, నిఖితాతోపాటుగా మరో ఇద్దరు రూమ్‌మేట్స్‌గా ఉండేవారని చెప్పారు. 'నా కూతురు నాలుగు సంవత్సరాల క్రితం కొలంబియాకు వెళ్లింది. ఆమె అక్కడే పనిచేస్తోంది. నిఖితాకు మాజీ రూమ్‌మేట్ అర్జున్. మాజీ బాయ్‌ఫ్రెండ్ అనేది సరైనది కాదు.' అని ఆనంద్ మీడియాకు తెలిపారు.
నిఖితా తండ్రి ప్రకారం, ఆమె హత్య వెనక ఉద్దేశం ఆర్థికపరమైన కారణాలే తప్ప, ప్రేమ సంబంధం కాదు. ఒక అపార్ట్‌మెంట్‌లో నలుగురు వ్యక్తులు ఉండేవారు. అందులో అర్జున్ శర్మ, నిఖితా కూడా ఉండేవారు. తన కుమార్తె దగ్గర నుంచి అర్జున్ చాలా డబ్బు తీసుకునేవాడు. అతడికి అప్పులు చేయడం అలవాటు అని చెప్పాడు ఆనంద్ గోడిశాల.
నిఖితా బంధువు సరస్వతి గొడిశాల కూడా అమెరికాలోని భారత రాయబార కార్యాలయంలో అర్జున్ శర్మ తీసుకున్న డబ్బు మొత్తాన్ని వివరిస్తూ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అర్జున్ 4,500 డాలర్లను నిఖితా దగ్గర అప్పుగా తీసుకున్నాడు. 3,500 డాలర్లు తిరిగి ఇచ్చాడు. కానీ 1,000 డాలర్లు ఇవ్వడం లేదు. భారతదేశానికి వెళ్లే ముందు డబ్బు తిరిగి ఇవ్వమని నిఖితా గట్టిగా అడిగింది.
ఈ క్రమంలోనే అర్జున్ శర్మ ఉండే ప్రదేశానికి వెళ్లింది నిఖితా. తన డబ్బులు తనకు తిరిగి ఇచ్చేయాలని చెప్పింది. దీంతో అతను నిఖితాను చంపి పారిపోయాడు. నిఖితా గొడిశాల కనిపించకుండా పోయినట్లుగా అర్జున్ శర్మే జనవరి 2న ఫిర్యాదు చేశాడు. అతడు నివసించే మేరీల్యాండ్‌లోని కొలంబియా అపార్ట్‌మెంట్‌లో నిఖితా కత్తిపోట్లతో చనిపోయి ఉన్నట్లు హోవార్డ్ కౌంటీ పోలీసులు తెలిపారు.
నిఖితాను చంపి అర్జున్ శర్మ భారతదేశానికి పారిపోయాడని ఆరోపిస్తూ.. ఫస్ట్, సెకండ్ డిగ్రీ హత్య ఆరోపణలపై అమెరికా పోలీసులు అరెస్టు వారెంట్ పొందారు. అయితే తమిళనాడులో అరెస్ట్ అయిన వ్యక్తి అర్జున్ శర్మ అనే విషయంపై క్లారిటీ లేదు.
మరోవైపు తన కుమార్తె మృతదేహాన్ని వీలైనంత త్వరగా అప్పగించాలని రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాన్ని నిఖితా తండ్రి ఆనంద్ గోడిశాల కోరుతున్నారు. తన కుమార్తె మరణానికి కారణమైన వ్యక్తికి కఠినమైన శిక్ష విధించాలని డిమాండ్ చేశారు.
నిఖితా గత నాలుగు సంవత్సరాలుగా అమెరికాలో నివసిస్తోంది. చివరిసారిగా మూడేళ్ల క్రితం భారతదేశానికి వచ్చింది. అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసిన తర్వాత వేదా హెల్త్‌లో డేటా అండ్ స్ట్రాటజీ అనలిస్ట్‌గా పనిచేసింది. డిసెంబర్ 31న హైదరాబాద్‌లోని కుటుంబ సభ్యులకు కాల్ చేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు కూడా తెలిపింది. ప్రస్తుతం నిఖితా కుటుంబం తార్నాకలో నివసిస్తోంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


