సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సీతారాం మృతి కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తొలుత మానసిక ఒత్తిడి లేదా వ్యక్తిగత కారణాలతో సీతారాం బలవన్మరణానికి పాల్పడి ఉంటాడని భావించినప్పటికీ, పోలీసుల విచారణలో వెలుగుచూసిన వాస్తవాలు అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి. ఈ విషాద ఘటనలో ఆయన భార్య రేణుక ప్రవర్తన ఇప్పుడు కేసును కీలక మలుపు తిప్పింది.

సీతారాం మరణించిన కేవలం నెల రోజులు కూడా గడవక ముందే, రేణుక తన ప్రియుడు రమణారెడ్డిని రహస్యంగా వివాహం చేసుకోవడం సంచలనం సృష్టించింది. భర్త మరణిస్తే పుట్టెడు దుఃఖంలో ఉండాల్సిన భార్య.. అంత తక్కువ సమయంలోనే మరో వ్యక్తితో ఏడడుగులు వేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అసలు ఆమె భార్యేనా.. అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి.
సీతారాం బతికున్నప్పుడే రేణుకకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉన్నట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో కొన్ని కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. సీతారాం ఆత్మహత్య వెనుక రేణుక, ఆమె ప్రియుడి ప్రోద్బలం ఏమైనా ఉందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
రేణుక కాల్ డేటా, సోషల్ మీడియా చాటింగ్స్ పరిశీలించగా, గత కొంతకాలంగా ఆమె సదరు వ్యక్తితో సన్నిహితంగా ఉన్నట్లు తేలింది. సీతారాం మరణంపై మొదటి నుంచీ అనుమానం వ్యక్తం చేస్తున్నారు ఆయన తల్లిదండ్రులు. ఇప్పుడు రేణుక పెళ్లి వార్తతో ఆందోళనకు దిగారు. తమ కొడుకును పథకం ప్రకారమే వేధించి ఆత్మహత్యకు ప్రేరేపించారని ఆరోపిస్తున్నారు.
ప్రస్తుతం రేణుకతోపాటుగా ఆమె వివాహం చేసుకున్న రమణారెడ్డిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్టుగా తెలుస్తోంది. భర్త చనిపోయిన వెంటనే పెళ్లి చేసుకోవడం వెనుక ఉన్న ఉద్దేశ్యం ఏమిటి? సీతారాం మరణానికి, వీరి వివాహానికి మధ్య ఉన్న లింకు ఏంటి? అనే ప్రశ్నలకు సమాధానం లభించాల్సి ఉంది.
ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు కోల్పోతే, కనీసం నెల రోజులు కాకముందే.. మరో పెళ్లి చేసుకోవడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికే అనిపిస్తోందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తే.. క్లారిటీ రానుంది. మరోవైపు సీతారాం తండ్రి పలు మీడియా ఛానల్లోకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఘోరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయాల మీద స్పష్టత వస్తుంది.
{{/usCountry}}ప్రేమించి పెళ్లి చేసుకున్న భర్త ప్రాణాలు కోల్పోతే, కనీసం నెల రోజులు కాకముందే.. మరో పెళ్లి చేసుకోవడం చూస్తుంటే ఇది ముందస్తు ప్రణాళికే అనిపిస్తోందని చాలా మంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసులో మరిన్ని ఆధారాలు లభిస్తే.. క్లారిటీ రానుంది. మరోవైపు సీతారాం తండ్రి పలు మీడియా ఛానల్లోకి ఇస్తున్న ఇంటర్వ్యూల్లో ఘోరమైన విషయాలు వెల్లడిస్తున్నారు. అయితే పోలీసుల విచారణలో ఈ విషయాల మీద స్పష్టత వస్తుంది.
{{/usCountry}}