Hema Malini: ధర్మేంద్ర, ఆశా భోంస్లేకు నివాళిగా ట్రిబ్యూట్ వాల్స్- భర్త మరణంపై సీనియర్ హీరోయిన్ హేమ మాలిని కన్నీళ్లు!

Hema Malini Emotional Tribute To Dharmendra Asha Bhosle: బాలీవుడ్ దిగ్గజ నటుడు ధర్మేంద్ర మరణం తర్వాత తన జీవితం శూన్యంగా మారిందని, ఆయన జ్ఞాపకాల నుంచి తేరుకోవడం కష్టమవుతోందని సీనియర్ హీరోయిన్, ఎంపీ హేమమాలిని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Published on: May 1, 2026, 15:48:37 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

Hema Malini Emotional Tribute To Dharmendra Asha Bhosle: భారతీయ చలనచిత్ర రంగానికి సంబంధించిన అరుదైన దృశ్యరూపకాలను ప్రదర్శించే 'లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్' ఎగ్జిబిషన్‌ను కేంద్ర సాంస్కృతిక శాఖ సహకారంతో ముంబైలోని నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ ఏర్పాటు చేసింది. ఈ ప్రదర్శనను బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ హేమ మాలిని ప్రారంభించారు. ఈ సందర్భంగా దివంగత నటుడు ధర్మేంద్ర, గాన కోకిల ఆశా భోంస్లేలకు నివాళి అర్పిస్తూ ప్రత్యేకంగా రూపొందించిన 'ట్రిబ్యూట్ వాల్స్' అందరినీ ఆకట్టుకున్నాయి.

ధర్మేంద్ర, ఆశా భోంస్లేకు నివాళిగా ట్రిబ్యూట్ వాల్స్- భర్త మరణంపై సీనియర్ హీరోయిన్ హేమ మాలిని కన్నీళ్లు!
ధర్మేంద్ర, ఆశా భోంస్లేకు నివాళిగా ట్రిబ్యూట్ వాల్స్- భర్త మరణంపై సీనియర్ హీరోయిన్ హేమ మాలిని కన్నీళ్లు!

ఆయన లేరంటే నమ్మలేకపోతున్నా..

వేదికపై భర్త ధర్మేంద్ర గురించి మాట్లాడుతూ హేమ మాలిని కన్నీరు పెట్టుకున్నారు. "ఆయనతో గడిపిన క్షణాలను నా అదృష్టంగా భావిస్తాను. ఇప్పుడు ఆయన లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నాను. మిగిలిన జీవితాన్ని ఆయన లేకుండా ఎలా గడపాలో నాకు అర్థం కావడం లేదు" అని హేమ మాలిని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రేక్షకుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ

కేవలం ఒక నటుడిగానే కాకుండా, కెమెరా వెనుక ఆయన నిబద్ధత, ప్రేక్షకుల పట్ల ఆయనకు ఉన్న ప్రేమ వెలకట్టలేనివని హేమ మాలిని కొనియాడారు. "సినిమా అనేది హృదయాలను కలిపే వారధి" అని ధర్మేంద్ర తరచూ చెప్పేవారని ఆమె గుర్తు చేసుకున్నారు.

ఆయన శైలి అద్వితీయం

బాలీవుడ్ 'హీ-మ్యాన్'గా గుర్తింపు పొందిన ధర్మేంద్ర, 2025 నవంబర్ 24న తన 90వ పుట్టినరోజుకు కొద్దిరోజుల ముందే కన్నుమూసిన సంగతి తెలిసిందే. యాక్షన్, కామెడీ, ఎమోషనల్ డ్రామా.. ఇలా ఏ పాత్రలోనైనా ఒదిగిపోయే ఆయన శైలి అద్వితీయమని హేమ పేర్కొన్నారు.

ఆశా భోంస్లే మరణం తీరని లోటు

ఇదే ఏడాది ఏప్రిల్ 12న దిగ్గజ గాయని ఆశా భోంస్లే కూడా తుదిశ్వాస విడిచారు. ఈ ప్రదర్శనలో ఆమెను కూడా స్మరించుకున్నారు. 77 ఏళ్ల హేమమాలిని స్పందిస్తూ.. తన సినీ కెరీర్‌లో లతా మంగేష్కర్, ఆశా భోంస్లేల గాత్రం తన పాత్రలకు ప్రాణం పోశాయని చెప్పారు. "బంగారు కంఠం కలిగిన అద్భుతమైన గాయనిని మనం కోల్పోయాం. లతాజీ తరహాలోనే ఆశాజీ కూడా నా కోసం ఎన్నో చిరస్మరణీయమైన పాటలు పాడారు" అని హేమ మాలిని తన కృతజ్ఞతను చాటుకున్నారు.

ప్రముఖుల హాజరు

ఈ వేడుకలో ప్రదీప్ చంద్ర, శాంతను దాస్ వంటి ప్రముఖ ఫోటో జర్నలిస్టుల ఛాయాచిత్రాలను ప్రదర్శించారు. వెటరన్ యాక్టర్ రంజిత్, పూనమ్ సిన్హా, మధు, ప్రముఖ ఫోటోగ్రాఫర్ అవినాష్ గోవారికర్ వంటి బాలీవుడ్ ప్రముఖులు ఈ ప్రదర్శనకు హాజరై పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు.

తరచుగా అడిగే ప్రశ్నలు (FAQs)

1. ధర్మేంద్ర ఎప్పుడు మరణించారు?

బాలీవుడ్ లెజెండరీ నటుడు ధర్మేంద్ర 2025, నవంబర్ 24న మరణించారు. ఆయన తన 90వ పుట్టినరోజుకు (డిసెంబర్ 8) కేవలం రెండు వారాల ముందు తుదిశ్వాస విడిచారు.

2. హేమమాలిని ప్రారంభించిన ఎగ్జిబిషన్ పేరేంటి?

ముంబైలో 'లెన్స్ అండ్ లెగసీ: బాలీవుడ్ ఇన్ ఫోకస్' అనే పేరుతో భారతీయ సినిమా చరిత్రను ప్రతిబింబించే ఫోటో ఎగ్జిబిషన్‌ను ఆమె ప్రారంభించారు.

3. ఆశా భోస్లే ఎప్పుడు కన్నుమూశారు?

ప్రముఖ గాయని ఆశా భంస్లే 2026, ఏప్రిల్ 12న మరణించారు. ఆమె మరణం పట్ల హేమ మాలిని తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తూ తన నివాళి అర్పించారు.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More