Hema: మరోసారి డ్రగ్స్ కలకలం.. నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేసిన నటి హేమ.. ఎప్పుడూ తప్పు చేయనంటూ!

Hema: హైదరాబాద్ లో మరోసారి డ్రగ్స్ కలకలం రేగింది. ఓ పబ్ లో జరిగిన పార్టీలో రైడ్ చేయగా కొంతమందికి పాజిటివ్ వచ్చింది. ఇదే పార్టీలో ఉన్న హేమ తన డ్రగ్ టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వచ్చిందంటూ వీడియో రిలీజ్ చేయడం గమనార్హం. 

Published on: Apr 3, 2026, 10:42:16 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డ్రగ్స్ కలకలం మరోసారి హాట్ టాపిక్ గా మారింది. హైదరాబాద్ లోని ఓ పబ్ లో డ్రగ్ టెస్టు నిర్వహిస్తే మొత్తం 8 మందికి పాజిటివ్ రావడం సంచలనంగా మారింది. ఇదే పార్టీకి టాలీవుడ్ సీనియర్ నటి హేమ కూడా అటెండ్ అయింది. డ్రగ్ టెస్టు రిజల్ట్ పై ఆమె వీడియో రిలీజ్ చేసింది.

నటి హేమ (instagram-KOLLA HEMA)
నటి హేమ (instagram-KOLLA HEMA)

హేమ వీడియో

టాలీవుడ్ సీనియర్ నటి హేమ అంటే తెలియని వాళ్లు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. కామెడీ పండించింది. దిగ్గజ కమెడియన్ల సరసన యాక్ట్ చేసింది. తాజాగా ఆమె తన డ్రగ్ టెస్ట్ రిజల్ట్ నెగెటివ్ వచ్చిందని సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసింది.

తప్పు చేయదని

‘‘ఇవాళ నేను పబ్ కు వచ్చా. అక్కడ నా యూరిన్ శాంపిల్ తీశారు. నా డ్రగ్ టెస్టు రిజల్ట్ నెగెటివ్ వచ్చింది. కనిపించిందా? నేను మరో వీడియో పోస్టు చేస్తా. మీ హేమక్క ఎప్పుడూ తప్పు చేయదు. జెన్యూన్ గా ఉంటుంది. ముక్కుసూటిగా ఉంటుంది. లవ్యూ ఆల్’’ అని ఆ వీడియోలో తన డ్రగ్ టెస్టు రిజల్ట్ చూపించింది.

8 మందికి

కొండాపూర్ లోని ఓ పబ్ లో పార్టీ చేసుకున్న వాళ్లలో డ్రగ్స్ పాజిటివ్ రావడం కలకలం రేపుతోంది. ఇందులో మొత్తం 64 మందికి డ్రగ్స్ టెస్ట్ నిర్వహించారు. ఆరుగురికి గంజాయి పాజిటివ్, ఇద్దరికి డ్రగ్స్ టెస్ట్ పాజిటివ్ వచ్చిందని తెలిసింది. ఇదే పార్టీలో నటి హేమ కూడా పాల్గొంది. కానీ తనకు నెగెటివ్ వచ్చిందంటూ ఆమె వీడియో పోస్టు చేసింది.

ఆ డ్రగ్ కేసు

గతంలో బెంగళూరులో రేవ్ పార్టీ సందర్భంగా హేమ డ్రగ్స్ తీసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. కానీ వెంటనే లైవ్ వీడియో రిలీజ్ చేసిన ఆమె డ్రగ్స్ తీసుకోలేదని పేర్కొంది. కానీ ఆ కేసులో హేమ పేరును కూడా విచారణ నిర్వహించారు. అయితే హేమకు క్లీన్ చీట్ ఇచ్చారు.

అది నరకం

డ్రగ్స్ కేసు సమయంలో నరకం అనుభవించానని ఓ సందర్భంగా హేమ పేర్కొంది. ‘‘ఆ సమయంలో నరకం అనుభవించా. దాని గురించి మాటల్లో చెప్పలేను. నా చుట్టూ జరుగుతున్న ప్రచారం చూసి కుంగిపోయా. ఒక దశలో చనిపోవాలని అనిపించింది. ఏ తప్పు చేయకున్నా నిందలు పడాల్సి వచ్చింది. నేను ఎలాంటి తప్పు చేయలేదు. అందుకే నిర్దోషిగా బయటపడ్డా’’ అని అప్పుడు హేమ తెలిపింది.

  • Chandu Shanigarapu
    ABOUT THE AUTHOR
    Chandu Shanigarapu

    చందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైట‌ర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More