OTT Telugu: కారులో శవంతో ప్రయాణం.. అదిరే ట్విస్ట్‌లు.. ఇవాళ ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు కామెడీ క్రైమ్ థ్రిల్లర్
OTT Telugu: ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చింది. కారులో శవంతో ప్రయాణం చేసే ఓ ఫ్యామిలీ, ఆ బాడీని మాయం చేయాలనుకుంటుంది. ఇందులో వచ్చే ట్విస్ట్ లు ఆకట్టుకుంటాయి.
శుక్రవారం వచ్చేసింది. డిజిటల్ ఆడియన్స్ ను ఎంటర్ టైన్ చేసేందుకు ఓటీటీలో కొత్త సందడి కూడా వచ్చేసింది. ఇవాళ ఓటీటీలోకి ఓ తెలుగు క్రైమ్ కామెడీ థ్రిల్లర్ వచ్చేసింది. రీసెంట్ గా థియేటర్లలో నవ్వులతో పాటు సస్పెన్స్, థ్రిల్ అందించిన ఆ సినిమానే ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. ఈ మూవీ ఇవాళ ఓటీటీలో అడుగుపెట్టింది.

సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని ఓటీటీ
తెలుగు లేటెస్ట్ క్రైమ్ కామెడీ థ్రిల్లర్ ‘సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ ఇవాళ (ఏప్రిల్ 3) ఓటీటీలోకి వచ్చేసింది. చాలా ఏళ్ల తర్వాత శివాజీ, లయ కలిసి నటించిన ఈ తెలుగు మూవీ డిజిటల్ డెబ్యూ చేసింది. పాపులర్ ఓటీటీ ప్లాట్ ఫామ్ నెట్‌ఫ్లిక్స్ లో ఇది స్ట్రీమింగ్ అవుతోంది.
థియేటర్లో ఇలా
థియేటర్ లో రిలీజ్ చేద్దామా లేదా ఓటీటీలోనే డైరెక్ట్ గా స్ట్రీమింగ్ చేద్దామా? అనే కన్య్ఫూజన్ ను దాటి థియేటర్లలో విడుదలైన మూవీ సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. మార్చి 6, 2026న ఈ సినిమా ప్రేక్షకులను ఎంటర్ టైన్ చేసేందుకు బిగ్ స్క్రీన్ పైకి వచ్చేసింది. ఈ చిత్రానికి మిక్స్ డ్ టాక్ వినిపించింది.
ఈటీవీ విన్ లో అనుకుంటే
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని సినిమాకు ఇందులో హీరోగా చేసిన శివాజీనే ప్రొడ్యూసర్. ఫస్ట్ నుంచి ఇది ఈటీవీ విన్ మూవీగానే జర్నీ స్టార్ట్ చేసింది. దీంతో ఈటీవీ విన్ ఓటీటీ ప్లాట్ ఫామ్ లోనే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ అవుతుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్ లోకి వచ్చేసింది. సుధీర్ శ్రీరామ్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీలో శివాజీ, లయతో పాటు రోహన్, శరత్ లోహితాశ్వ, అలీ, ధన్ రాజ్, ప్రిన్స్, ఇమ్యాన్యుయేల్ తదితరులు నటించారు.
సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని స్టోరీ
ఓ ఫ్యామిలీ, ఓ శవం, దాన్ని మాయం చేయాలనుకోవడం.. ఈ కథాంశం చుట్టూ సాగే సినిమానే సంప్రదాయిని సుప్పిని సుద్దపూసని. శ్రీరామ్ (శివాజీ) పంచాయతీ సెక్రెటరీగా పని చేస్తుంటాడు. అతని నిజాయతీపరుడు. లంచం తీసుకోడు. అతని భార్య ఉత్తర (లయ), కొడుకు బిట్టు అలియాస్ నితిన్ (రోహన్).
శ్రీరామ్ తో ఓ సారి ఎస్సై విక్రమ్ వాసుదేవ్ (ప్రిన్స్)కు గొడవ జరుగుతుంది. దీంతో శ్రీరామ్ ఇంట్లో లేని సమయంలో ఉత్తరపై ప్రిన్స్ అఘాయిత్యానికి ప్రయత్నిస్తాడు. అప్పుడే వాసుదేవ్ ను బిట్టు చంపేస్తాడు. ఈ శవాన్ని మాయం చేసేందుకు ఫ్యామిలీ ప్రయత్నిస్తుంది. ఈ క్రమంలో వచ్చే ట్విస్ట్ లు సినిమాను మరో లెవల్ తీసుకెళ్లాయి.
ABOUT THE AUTHORChandu Shanigarapuచందు శనిగారపు ప్రస్తుతం హిందూస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ రైటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. మీడియా రంగంలో ఎనిమిదేళ్లకు పైగా అనుభవం ఆయన సొంతం. 2025 నుంచి డిజిటల్ మీడియాలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. సినిమా వార్తలను ఎప్పటికప్పుడు అందించడం, స్పోర్ట్స్ న్యూస్ ముఖ్యంగా క్రికెట్ విశ్లేషణలను చదివించేలా ఇవ్వడం ఆయన ప్రత్యేకత. మ్యాచ్ రిపోర్ట్ లను వేగంగా అందించడం, లైవ్ అప్ డేట్స్ ఇవ్వడంలో ఆయన ముందుంటారు. చందు తన కెరీర్ లో ప్రింట్ మీడియాలో ఎక్కువగా పనిచేశారు. ప్రముఖ దినపత్రిక ఈనాడులో ఏడేళ్లకు పైగా స్పోర్ట్స్ రిపోర్టర్ గా పనిచేశారు. తన ఆర్టికల్స్ తో ఎంతోమంది యువ క్రీడాకారుల ప్రతిభను వెలుగులోకి తెచ్చారు. ప్రత్యేక ఆర్టికల్స్ తో వాళ్లకు ఆర్థిక సాయం అందేలా చూశారు. క్రికెట్ ప్రపంచకప్ లు, ఒలింపిక్స్ లాంటి మెగా టోర్నీల కవరేజీలో ఆయనకు విశిష్ఠ అనుభవం ఉంది. మల్లారెడ్డి కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ నుంచి చందు బీటెక్ డిగ్రీ పొందారు. ఓ వైపు టెక్నికల్ నాలెడ్జ్ తో పాటు జర్నలిజంపై ప్రేమతో మీడియా రంగంలో కొనసాాగుతున్నారు. జర్నలిజంలో డిప్లొమా చేశారు. సినిమా వార్తలను, మూవీ రివ్యూలను, ఓటీటీ విషయాలను, క్రికెట్ సమాచారాన్ని, క్రీడా సంగతులను పాఠకులకు అందిస్తున్నారు.Read More

E-Paper












