న్యాయం గెలిచింది, కడిగిన ముత్యంలా బయటపడ్డాను, కానీ అమ్మను కోల్పోయాను.. రేవ్ పార్టీ కేసు తీర్పుపై నటి హేమ ఎమోషనల్

నటి హేమ తాజాగా ఎమోషనల్ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేశారు. 2024లో తనపై వచ్చిన రేవ్ పార్టీ కేసు గురించి వచ్చిన తీర్పుపై హేమ రియాక్ట్ అవుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. రేవ్ పార్టీ కేసులో కడిగిన ముత్యంలా బయటపడ్డానని, కానీ తన తల్లిని కోల్పోయానని నటి హేమ ఎమోషనల్ అయ్యారు.

Published on: Nov 23, 2025, 11:42:53 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలుగులో పాపులర్ నటీమణుల్లో హేమ ఒకరు. ఎన్నో సినిమాల్లో తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హేమ. నువ్వు నాకు నచ్చావ్, అతడు, జులాయి వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో తన కామెడీతో అలరించిన హేమపై గతంలో రేవ్ పార్టీ అభియోగాలు వచ్చిన విషయం తెలిసిందే.

న్యాయం గెలిచింది, కడిగిన ముత్యంలా బయటపడ్డాను, కానీ అమ్మను కోల్పోయాను.. రేవ్ పార్టీ కేసు తీర్పుపై నటి హేమ ఎమోషనల్
న్యాయం గెలిచింది, కడిగిన ముత్యంలా బయటపడ్డాను, కానీ అమ్మను కోల్పోయాను.. రేవ్ పార్టీ కేసు తీర్పుపై నటి హేమ ఎమోషనల్

రేవ్ పార్టీలో హేమ

ఓ రేవ్ పార్టీలో హేమ దొరికినట్లు మీడియాలో కథనాలు చాలా వచ్చాయి. ఈ న్యూస్ అప్పట్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఆ రేవు పార్టీ కేసు కోర్టు వరకు వెళ్లింది. అయితే, ఆ రేవు పార్టీలో తాను లేనని, అనవసరంగా తనపై కథనాలు ప్రచురిస్తున్నారని అప్పట్లోనే చెప్పుకొచ్చారు హేమ.

తాజాగా ఆ రేవ్ పార్టీ కేసుపై కోర్టులో తుది నిర్ణయం వచ్చింది. ఈ సందర్భంగా నటి హేమ ఎమోషనల్ వీడియోను పంచుకున్నారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో హేమ కన్నీటిపర్యంతం అయ్యారు.

"అందరికి నమస్కారం నేనే మీ హేమ. రేవ్ పార్టీ కేసులో కడిగిన ముత్యంలా బయటపడ్డాను. ఈ కేసులో క్లీన్ చీట్ ఇచ్చిన బెంగళూరు హైకోర్టుకు ధన్యవాదాలు" అని చెప్పారు హేమ.

నా లైఫ్‌ను కుదిపేసింది

"నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్నాను. అద్భుతమైన పాత్రలతో, నటనతో తెలుగు ప్రేక్షకుల హృదయాలకు ఎంతో దగ్గరయ్యాను. అలాంటిది నాపై వచ్చిన ఓ ఆరోపణ నా జీవితంతో పాటు నా పర్సనల్ లైఫ్‌ను కూడా కుదిపేసింది" అని హేమ తెలిపారు.

"మానసికంగా, శారీరకంగా చాలా బాధపడ్డాను. మా అమ్మను కూడా కోల్పోయాను. నేను తప్పు చేయలేదని ఎంత చెప్పినా నెగెటివ్ ప్రచారం చేస్తూనే వచ్చారు. ముఖ్యంగా మీడియా, సోషల్ మీడియా, ట్రోలర్స్ విపరీతంగా తప్పుడు ప్రచారాన్ని చేశారు. అయినా నా విశ్వాసాన్ని సడలించుకోకుండా న్యాయ పోరాటం చేశాను. అందుకే కర్ణాటక హైకోర్టు క్లీన్ చీట్ ఇచ్చింది" అని నటి హేమ పేర్కొన్నారు.

"నవంబర్ 3న తీర్పు వెలువడగా నవంబర్ 21న కోర్టు తీర్పు కాపీలు నా చేతికి అందాయి. ఈ తీర్పు ద్వారా నాపై నమోదైన కేసును హైకోర్టు కొట్టివేసింది. న్యాయస్థానం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది" అని హేమ వెల్లడించారు.

ఎంత చెప్పిన పట్టించుకోలేదు

"మే 19, 2024లో జరిగిన రేవ్‌ పార్టీతో నాకు ఎలాంటి సంబంధం లేదని, నేను నిర్దోషిని అని ఎన్నిసార్లు చెప్పినా ఎవరు పట్టించుకోలేదు. అప్పటికీ గత 18 నెలలుగా నేను ఎన్నో అవమానాలు భరిస్తూ వచ్చాను. కానీ, విశ్వసాన్ని కోల్పోలేదు. అందుకే నాకు కర్ణాటక హైకోర్టులో న్యాయం లభించింది. బెంగళూరు రేవ్ పార్టీకి సంబంధించి నాపై నమోదైన కేసులను కర్ణాటక హైకోర్టు కొట్టివేసింది" అని హేమ అన్నారు.

"ఈ తీర్పు తరువాత ఎంతో భావోద్వేగానికి లోనయ్యాను. అలస్యం అయినా సత్యమే గెలుస్తుంది అని నా విషయంలో నిజం అయింది. గత 18 నెలలుగా ఎంతో వర్ణించలేని మానసిక క్షోభను అనుభవించాను. ఈ కష్ట కాలంలోనే నా తల్లిని కూడా కోల్పోయాను" అని నటి హేమ ఎమోషనల్ అయ్యారు.

"ఈ విజయం కేవలం నా ఒక్కదానిదే కాదు. ఇది నిజాయితీకి దక్కిన విజయం. ఈ కష్ట కాలంలో నాకు అండగా నిలిచిన స్నేహితులు, శ్రేయోభిలాషులు, ముఖ్యంగా నా అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు" అని హేమ ముగించారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

  • Chetupelli Sanjiv Kumar
    ABOUT THE AUTHOR
    Chetupelli Sanjiv Kumar

    చెటుపెల్లి సంజీవ్ కుమార్ ప్రస్తుతం హిందుస్థాన్ టైమ్స్ తెలుగులో సీనియర్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. డిజిటల్ మీడియా రంగంలో ఆయనకు 8 ఏళ్ల అనుభవం ఉంది. ముఖ్యంగా సినిమా వార్తలు, మూవీ రివ్యూలు, ఓటీటీ కంటెంట్, సీరియల్స్, బుల్లితెరకు సంబంధించిన న్యూస్ అందించడంలో ఆయనది ప్రత్యేక శైలి. సమాచారాన్ని పాఠకులకు ప్రభావవంతంగా చేరవేయడంలో ఆయన ఎప్పుడూ ముందుంటారు. డిజిటల్ మీడియా వేగంగా మారుతున్న తరుణంలో, పాఠకుల అభిరుచులకు అనుగుణంగా నాణ్యమైన కంటెంట్‌ను రూపొందించడంలో ఆయనది అందెవేసిన చేయి. అందుకే ఆయన అమోఘమైన పనితీరుకు గాను ప్రస్తుత సంస్థలో ప్రతిష్టాత్మకమైన 'డిజీ జర్నో ఆఫ్ ది క్వార్టర్' (Digi Journo of the Quarter) అవార్డును, అనేకసార్లు కంటెంట్ ఇన్‌స్టా అవార్డులను అందుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం. ఈయన గతంలో ఈటీవీ భారత్, సాక్షి, ఫిల్మీబీట్ మీడియా సంస్థల్లో పని చేశారు. సినిమా, ప్రాంతీయ వార్తలపై కథనాలు అందించడంతోపాటు ఫిల్మీ రిపోర్టింగ్ చేశారు. కంటెంట్ రాయడం, ఎడిటింగ్‌తోపాటు వీడియో ఎడిటింగ్, ఎస్‌ఈవో (SEO) అంశాలపై మంచి పట్టు ఉంది. 2017లో తెలంగాణ యూనివర్సిటీలో జర్నలిజంలో పీజీ చేస్తున్న సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌లో చేరారు. ఈటీవీ భారత్ తెలంగాణ లాంచ్ సమయంలో కీలక పాత్ర పోషించారు. ఆయన అందించిన బులిటెన్స్, న్యూస్ ఆర్టికల్స్‌తో సదరు వెబ్‌సైట్ లాంచ్ అవడం విశేషం. అనంతరం ఏడాదికి కంటెంట్ ఎడిటర్‌గా పని చేస్తూనే యాక్టింగ్ షిఫ్ట్ ఇన్‌ఛార్జ్ బాధ్యతలు నిర్వర్తించారు. 2023లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరిన ఆయన ప్రస్తుతం ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్స్‌కు సంబంధించిన కథనాలను అందిస్తున్నారు. ప్రతి కథనాన్ని లోతుగా విశ్లేషించి పాఠకులకు సులభంగా అర్థమయ్యేలా అందించడం సంజీవ్ కుమార్ శైలి.Read More