...
...
Next Story

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు తెలుగు యువతులు మృతి

అమెరికాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఇద్దరు తెలుగు యువతులు ఈ ఘటనలో మృతి చెందారు.

Published on: Dec 29, 2025, 12:15:47 IST
Advertisement

అమెరికాలోని కాలిఫోర్నియాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో తెలంగాణకు చెందిన ఇద్దరు యువతులు మరణంచారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలానికి చెందిన మీసేవ కేంద్రం నిర్వాహకుడు నాగేశ్వరరావు కూతురు మేఘన, ముల్కనూరుకు చెందిన కడియాల కోటేశ్వరరావు కూతురు భావన మృతిచెందారు.

ఇద్దరు తెలంగాణ యువతులు
ఇద్దరు తెలంగాణ యువతులు

అమెరికాలో తెలుగు విద్యార్థుల మరణాలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే రోడ్డు ప్రమాదంలో తెలుగువారు మరణించిన వార్తలు వచ్చాయి. తాజాగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన మరో ఇద్దరు యువతలు దుర్మరణం పాలయ్యారు. ఉన్నత చదువుల కోసం వెళ్లి రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.

మేఘన, భావన మూడేళ్ల క్రితం అమెరికాకు వెళ్లారు. ఎమ్మెస్ పూర్తి చేశారు. ప్రస్తుతం ఉద్యోగం కోసం వెతుకుతున్నారు. తాజాగా మెుత్తం 8 మంది స్నేహితులు రెండు కార్లలో కాలిఫోర్నియాలో టూర్ వెళ్లారు. తిరిగి వస్తున్న సమయంలో కారు అలబామా హిల్స్ రోడ్డులో మలుపు వద్ద లోయలో పడిపోయింది. ఈ ఘటనలో మేఘన, భావన మృతి చెందారు.

మేఘన, భావన అమెరికాలో రోడ్డు ప్రమాదానికి గురై మృతి చెందడం పట్ల బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్, రాజ్యసభ సభ్యులు వద్దిరాజు రవిచంద్ర సంతాపం వ్యక్తం చేశారు. క్రిస్మస్ సెలవులు ఉండడంతో స్నేహితులతో కలిసి విహారయాత్రకు వెళ్తుండగా కాలిఫోర్నియాలోని రోడ్డు ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పడం బాధాకరమని ఎంపీ రవిచంద్ర పేర్కొన్నారు. తిరుపతిలో ఉన్న ఎంపీ రవిచంద్రకు ఈ విషాదవార్త తెలియగానే నాగేశ్వరరావు, కోటేశ్వరరావులను ఫోన్ ద్వారా పరామర్శించారు. ఈ విపత్కర పరిస్థితుల్లో ధైర్యాన్ని కోల్పోవద్దని చెప్పారు.

ఇటీవల అగ్నిప్రమాదం

ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో అందులో చిక్కుకున్న విద్యార్థులు ఉక్కిరి బిక్కిరి అయ్యారు. విద్యార్థులు శ్వాస తీసుకోవడానికి ఇబ్బంది పడ్డారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపుచేసి.. వారిని రక్షించారు. తీవ్ర గాయాలు అయిన విద్యార్థులను ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ చికిత్స పొందుతూ.. పరిస్థితి విషమించి ఇద్దరు విద్యార్థులు మృతి చెందారు.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks