BRAOU New Courses : దూర విద్యలో చదువుకోవాలనుకునే వారికి హైదరాబాద్ లోని డాక్టర్ బి.ఆర్. అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ (BRAOU) మరో తీపి కబురు అందించింది. ఈ విద్యా సంవత్సరం నుంచి విద్యార్థులకు మరింత నాణ్యమైన విద్యను చేరువ చేసేలా ఐదు కీలక కోర్సుల నిర్వహణకు యూజీసీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ ఐదు కోర్సులకు ప్రొఫెషనల్, అకాడమిక్ రంగాల్లో విపరీతమైన డిమాండ్ ఉందని వర్సిటీ వైస్-ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి ఓ ప్రకటనలో వెల్లడించారు.
యూజీసీ ఆమోదం తెలిపిన కోర్సులు:
- ఎమ్.ఏ. ఎడ్యుకేషన్ (M.A. Education).
- ఎమ్.ఏ. ఎడ్యుకేషన్ - స్కూల్ అడ్మినిస్ట్రేషన్ (M.A. Education - School Administration).
- మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW).
- ఎమ్.ఎస్సీ. జాగ్రఫీ (M.Sc. Geography).
- బి.ఈడీ. స్పెషల్ ఎడ్యుకేషన్ (B.Ed. Special Education) – (ఈ కోర్సు అనుమతిని పునరుద్ధరించారు).

ఈ ఏడాది జూన్ నెలలో యూజీసీ నిపుణుల కమిటీ వర్చువల్ పద్ధతిలో విశ్వవిద్యాలయాన్ని క్షుణ్ణంగా తనిఖీ చేసింది. వర్సిటీలో ఉన్న అత్యాధునిక మౌలిక వసతులు, అధ్యాపక సిబ్బంది నైపుణ్యాలు, ఇతర విద్యా ప్రమాణాలను పరిశీలించిన అనంతరం ఈ ప్రోగ్రామ్స్‌కు తుది ఆమోదం తెలిపింది.
ఈ కొత్త కోర్సుల రూపకల్పనలో తెలంగాణ ప్రభుత్వం పూర్తి సహకారం అందించిందని వర్సిటీ వర్గాలు తెలిపాయి. ముఖ్యంగా రాష్ట్ర విద్యాశాఖ కార్యదర్శి డాక్టర్ యోగితా రాణా చొరవతోనే ఇవి సాధ్యమయ్యాయని వైస్-ఛాన్సలర్ కొనియాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులకు ఓపెన్ అండ్ డిస్టెన్స్ లర్నింగ్ (ODL) విధానం ద్వారా ప్రత్యేక వృత్తిపరమైన శిక్షణ అందించాలనే లక్ష్యంతో వీటిని రూపొందించారు.
ఉపాధ్యాయులకు ప్రొఫెషనల్ ట్రైనింగ్
పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయుల వృత్తిపరమైన నైపుణ్యాలను, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి ఎమ్.ఏ. (ఎడ్యుకేషన్), ఎమ్.ఏ. (స్కూల్ అడ్మినిస్ట్రేషన్), ఇన్-సర్వీస్ టీచర్ల కోసం ఉద్దేశించిన బి.ఈడీ. కోర్సులు ఎంతో ఉపయోగపడతాయి.
"ఈ కోర్సులు ఉపాధ్యాయుల నైపుణ్యాలను పెంచడమే కాకుండా, వారి కెరీర్ ఎదుగుదలకు తోడ్పడతాయి. త్వరలోనే తెలంగాణ విద్యాశాఖతో దీనిపై ప్రత్యేక అవగాహన ఒప్పందం (MoU) కుదుర్చుకోబోతున్నాం," అని వీసీ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి వివరించారు.
మరోవైపు…. సామాజిక సేవా రంగంలో స్థిరపడాలనుకునే వారికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), పర్యావరణ-భౌగోళిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి జాగ్రఫీ పీజీ కోర్సులు కెరీర్ పరంగా ఎన్నో కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.
త్వరలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్
{{/usCountry}}మరోవైపు…. సామాజిక సేవా రంగంలో స్థిరపడాలనుకునే వారికి మాస్టర్ ఆఫ్ సోషల్ వర్క్ (MSW), పర్యావరణ-భౌగోళిక అంశాలపై ఆసక్తి ఉన్నవారికి జాగ్రఫీ పీజీ కోర్సులు కెరీర్ పరంగా ఎన్నో కొత్త అవకాశాలను సృష్టిస్తాయి.
త్వరలోనే అడ్మిషన్ల నోటిఫికేషన్
{{/usCountry}}యూజీసీ కొత్తగా ఆమోదించిన ఈ ఐదు కోర్సులకు సంబంధించిన కనీస అర్హతలు, ప్రవేశాల విధానం, ఫీజుల వివరాలు, కోర్సు వ్యవధి, స్టడీ సెంటర్ల సమాచారంతో కూడిన సమగ్ర అడ్మిషన్ నోటిఫికేషన్‌ను విశ్వవిద్యాలయం త్వరలోనే అధికారికంగా విడుదల చేయనుంది.
విద్యార్థులు ఎప్పటికప్పుడు తాజా సమాచారం కోసం వర్సిటీ అధికారిక వెబ్‌సైట్‌లు www.braou.ac.in లేదా www.braouonline.in సందర్శించవచ్చు. మరింత సమాచారం కోసం హెల్ప్ డెస్క్ నంబర్లు 040-23680333 లేదా 040-23680555 ద్వారా సంప్రదించవచ్చు.