...
...
Next Story

'ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ వార్తలన్నీ ఫేక్' - హైదరాబాద్ పోలీసుల ప్రకటన

పెండింగ్ ట్రాఫిక్ చలాన్లపై డిస్కౌంట్ అంటూ వస్తున్న వార్తలపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. ఆ వార్తలన్నీ ఫేక్ అని స్పష్టం చేశారు. ట్రాఫిక్ పోలీస్ విభాగం నుంచి అలాంటి ప్రకటనే రాలేదని క్లారిటీ ఇచ్చారు.

Published on: Dec 4, 2025, 10:04:10 IST
Advertisement

పెండింగ్ లో ఉన్న ట్రాఫిక్ చలాన్ల పైన 100 శాతం రాయితీ అంటూ వచ్చిన వార్తలు ఈ మధ్య తెగ వైరల్ గా మారింది. డిసెంబర్ 13వ తేదీన జాతీయ లోక్ అదాలత్ జరుగుతుందని… పలు భారతీయ రాష్ట్రాలలో జాతీయ లోక్ అదాలత్ లో వాహనదారులు తమ తమ పాత చలాన్ లను తగ్గించిన జరిమానాలతో పరిష్కరించుకోవచ్చని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతుంది. ఇదే వార్తను చాలా మంది నెటిజన్లు షేర్లు కూడా చేస్తున్నారు. ఇది నిజమేమో అనుకొని… వాహనదారులు పెండింగ్ చలాన్లను క్లియర్ చేసుకోవాలని చూస్తున్నారు.

ఆ వార్తలన్నీ ఫేక్ - సిటీ పోలీసులు

హైదరాబాద్ సిటీ పోలీసులు (image source from @hydcitypolice X)
హైదరాబాద్ సిటీ పోలీసులు (image source from @hydcitypolice X)

ఈ విషయంపై హైదరాబాద్ సిటీ పోలీసులు స్పందించారు. పలు సామాజిక మాధ్యమాలలో ప్రచారం అవుతున్న వార్తలు అవాస్తవమని సిటీ పోలీసులు స్పష్టం చేశారు. 100 శాతం డిస్కౌంట్ అనేది ఫేక్ అని… ఈ విషయంపై ట్రాఫిక్ పోలీసులు ఎటువంటి అధికారిక ప్రకటన జారీ చేయలేదని పేర్కొన్నారు.

ఆ రోజు (డిసెంబర్ 13) ఎలాంటి లోక్ అదాలత్ లేదని… తప్పుడు సమాచారాన్ని షేర్ చేయవద్దని కోరారు.ఇది కేవలం నకిలీ వార్త అని ఎక్స్ వేదికగా తెలియజేశారు. ఇలాంటి ప్రచారం పట్ల, సమాచారం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు కోరారు.

ఇదిలా ఉంటే తెలంగాణ పోలీస్ శాఖకు చెందిన వెబ్ సైట్లు హ్యాకింగ్ కు గురైనట్లు తెలిసింది.కమిషనరేట్ వెబ్ సైట్లు ఓపెన్ చేస్తే బెట్టింగ్ యాప్ వెబ్ సైట్లకు రీ-డైరెక్ట్ అవుతుండటాన్ని ఐటీ విభాగం గుర్తించింది. దీంతో వెంటనే సర్వర్లను డౌన్ చేసింది.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe