...
...
Next Story

రైల్వే ప్రయాణికులకు అప్డేట్.. ఈ తేదీల్లో చర్లపల్లి-రేవా మధ్య ప్రత్యేక రైళ్లు

రైల్వే ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే గుడ్‌న్యూస్ చెప్పింది. పలు ప్రత్యేక రైళ్లను నడుపుతుంది. దీనికి సంబంధించిన పూర్తి షెడ్యూల్ చూడండి.

Published on: Jun 01, 2026 01:41 PM IST
Advertisement

వేసవి కాలంలో ప్రయాణికుల రద్దీని తట్టుకోవడానికి దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. మధ్యప్రదేశ్‌లోని రేవా-హైదరాబాద్‌ చర్లపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక సమ్మర్ స్పెషల్ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ ప్రకటించింది. మొత్తం 4 ట్రిప్పుల చొప్పున నడిచే ఈ స్పెషల్ రైళ్లకు సంబంధించిన పూర్తి వివరాలు, టైమ్ టేబుల్ కింద ఉన్నాయి.

దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు
దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు

02158 రేవా - చర్లపల్లి మధ్య రైలు 07.06.2026 నుంచి 28.06.2026 వరకు 4 ట్రిప్పులు నడుస్తుంది. ఆదివారం మధ్యాహ్నం 12:30కి రేవా నుంచి బయల్దేరుతుంది. సోమవారం మధ్యాహ్నం 02:45కి చర్లపల్లికి చేరుకుంటుంది.

02157 చర్లపల్లి - రేవా 08.06.2026 నుంచి 29.06.2026 వరకు 4 ట్రిప్పులు నడవనుంది. సోమవారం సాయంత్రం 05:00 గంటలకు చర్లపల్లి నుంచి మంగళవారం రాత్రి 7:30కి రేవా చేరుకుంటుంది.

ఈ ప్రత్యేక రైళ్లు రెండు వైపుల ప్రయాణంలోనూ కింద ముఖ్యమైన రైల్వే స్టేషన్లలో ఆగుతాయి. అవి ఏంటంటే.. సాత్నా, మైహార్, కట్ని ముర్వారా, దామోహ్, సాగోర్, బీనా, రాణి కమలాపతి, ఇటార్సి, బేతుల్, ఆమ్లా, నాగ్‌పూర్, బల్లార్షా, సిర్పూర్ కాగజ్‌నగర్, బెల్లంపల్లి, మంచిర్యాల, పెద్దపల్లి, కాజీపేట, జనగాం స్టేషన్లలో ఆగుతాయి.

ప్రయాణికుల సౌకర్యార్థం ఈ ప్రత్యేక రైళ్లలో అన్ని రకాల కేటగిరీల కోచ్‌లను అందుబాటులో ఉంచారు. ఫస్ట్ ఏసీ (1AC), సెకండ్ ఏసీ (2AC), థర్డ్ ఏసీ (3AC), స్లీపర్ క్లాస్, జనరల్ సెకండ్ క్లాస్ కోచ్‌లు ఉన్నాయి. ఈ రైళ్లకు సంబంధించిన మరిన్ని వివరాలు లేదా టికెట్ బుకింగ్ కోసం ప్రయాణికులు ఐఆర్‌సీటీసీ (IRCTC) అధికారిక వెబ్‌సైట్ లేదా దక్షిణ మధ్య రైల్వే సోషల్ మీడియా ఖాతాలను సంప్రదించవచ్చు.

కీలక రైళ్లు పునరుద్ధరణ

ఈ ట్రాక్ పనులు పూర్తయినందున గతంలో రద్దు చేసిన తేదీలలోనే ఈ రైళ్లు ఇప్పుడు యథావిధిగా పాత టైమ్ టేబుల్ ప్రకారం నడుస్తాయని అధికారులు స్పష్టం చేశారు. గతంలో పేర్కొన్న తేదీలలో రద్దు చేయాలని భావించిన ఈ రైళ్లు, ఇప్పుడు సాధారణ షెడ్యూల్ ప్రకారమే ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి.

పునరుద్ధరించిన రైళ్లు

  • 17321 వాస్కో-డా-గామా - జసిదిహ్
  • 17322 జసిదిహ్ - వాస్కో-డా-గామా
  • 17005 హైదరాబాద్ - రక్సౌల్
  • 17006 రక్సౌల్ - హైదరాబాద్
  • 17007 చర్లపల్లి - దర్భంగా
  • 17008 దర్భంగా - చర్లపల్లి
  • 12767 నాందేడ్ - సత్రాగచ్చి
  • 12768 సత్రాగచ్చి - నాందేడ్
  • 12251 యస్వంతపూర్ - కోర్బా
  • 12252 కోర్బా - యస్వంతపూర్
  • 22648 కొచ్చువేలి - కోర్బా
  • 22647 కోర్బా - కొచ్చువేలి

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe