వ్యవసాయంలో రైతులకు మద్దతుగా నిలిచేందుకు తెలంగాణ ప్రభుత్వం సరికొత్త వ్యవస్థను తీసుకురానుంది. ప్రధానంగా భూసార పరీక్షలు, ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించటమే లక్ష్యంగా వాలంటీర్ల వ్యవస్థను తీసుకురానుంది. ఇందుకోసం 30 వేల మందిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తుంది.
గ్రామానికి ముగ్గురు..!

రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం….. రైతులకు ఉపయోగపడేలా సాయిల్ హెల్త్ వాలంటీర్లను తీసుకురానున్నారు. ప్రతి గ్రామానికి ముగ్గురిని నియమిస్తారు. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 30 వేల మంది సేవలు అందిస్తారు. విడతల వారీగా వీరిని ఎంపిక చేసి శిక్షణ ఇస్తారు.
తాజాగా ఇక్రిశాట్ లో తొలి విడతగా వాలంటీర్లకు శిక్షణ(సాయిల్ హెల్త్ మేనేజ్మెంట్) ఇచ్చే కార్యక్రమాన్ని తుమ్మల ప్రారంభించారు. ఇక్రిశాట్, తెలంగాణ వ్యవసాయ శాఖ ఈ వాలంటీర్లను నియమించనుంది. పైలెట్ ప్రాజెక్ట్ కింద ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్ నియోజకవర్గం నుంచి ఎంపికైన 120 మంది వాలంటీర్లకు శిక్షణ అందించారు. భూసారం ఎలా కాపాడాలి….? పంటకు అనుకూలంగా భూమిని ఎలా మార్చుకోవాలి..? సేంద్రియ వ్యవసాయాన్ని పెంపొదించేందుకు ఎలాంటి పద్ధతులను పాటించాలి..? వంటి అంశాలపై సలహాలు, సూచనలు ఇచ్చారు.
సాయిల్ హెల్త్ వాలంటీర్ల బాధ్యతలేంటి..?
- ఎంపికైన గ్రామాల్లో భూసార పరీక్షలు నిర్వహిస్తారు
- సేంద్రియ పద్ధతులపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
- పంటల అవశేషాల(పంటల పూర్తి అయిన తర్వాత ఉండే) వినియోగం ప్రత్యేక పద్ధతులను వివరిస్తారు.
- ఎరువుల వినియోగంతో పాటు ఇతర అంశాలపై రైతులకు అవగాహన కల్పిస్తారు.
- రసాయన ఎరువుల తగ్గించటంతో పాటు సేంద్రియ ఎరువుల వాడకాన్ని ఎక్కువ చేసే దిశగా వీరి సేవలు ఉంటాయి.
- భూసారాన్ని పెంచే దిశగా ఈ వాలంటర్లీ రైతులకు అండగా ఉంటారు.

గత కొంతకాలంగా తెలుగు రాష్ట్రాల్లో రసాయన ఎరువుల కొరత ఉంటోంది. ముఖ్యంగా యూరియా కోసం బారులు తీరుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. కానీ కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం యూరియా వాడకాన్ని తగ్గించాలని సూచిస్తున్నాయి. రసాయన ఎరువులను తగ్గించి… సేంద్రియ ఎరువుల వాడకాన్ని పెంచాలని ప్రకటనలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా తెలంగాణ ప్రభుత్వం పలు కార్యక్రమాలు చేపట్టేందుకు సిద్ధమవుతోంది.