రాత్రికి రాత్రే మాయం.. అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్.. 71 కరెంట్ మోటార్లు స్వాధీనం

అంతర్ జిల్లా కరెంట్ మోటార్ల దొంగల ముఠాను వరంగల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి దగ్గర నుంచి 71 కరెంట్ మోటార్లు, రెండు వాహనాలు స్వాధీనం చేసుకున్నారు.

Published on: Mar 12, 2026, 19:25:59 IST
By , Warangal
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలిస్తూ రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్న అంతర్ జిల్లా దొంగల ముఠాను వరంగల్ సీసీఎస్ పోలీసులు కమలాపూర్ పోలీసులతో కలిసి అరెస్ట్ చేశారు. ఈ కేసులో 7 మంది నిందితులను పట్టుకుని, వారి వద్ద నుంచి రూ.6,60,000 విలువ గల 71 కరెంట్ మోటార్లు, దొంగతనాలకు ఉపయోగించిన ఒక ఆటో ట్రాలీ, ఒక కారు, 3 సెల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

దొంగల ముఠా అరెస్ట్
దొంగల ముఠా అరెస్ట్

అరెస్టయిన నిందితులు:

  • సిరిగిరి ప్రసాద్ (26) – తారకరామా కాలనీ, ఓదెల గ్రామం, పెద్దపల్లి జిల్లా
  • మోతే రాజు (25) – భగత్ సింగ్ నగర్, చున్నంబట్టి కాలనీ, మంచిర్యాల
  • టేకు నవీన్ – ప్రగతి నగర్, ఎన్టిపిసి, గోదావరిఖని
  • మోటం తిరుపతి – గాంధీ నగర్, మంచిర్యాల టౌన్
  • వారణాసి లక్ష్మణ్ (26) – ఎన్టీఆర్ నగర్, మంచిర్యాల
  • మోటం నరేష్ (25) – గాంధీనగర్, మంచిర్యాల
  • వస్తం భీమేష్ (28) – భగత్ సింగ్ నగర్, మంచిర్యాల

నిందితులు మద్యానికి అలవాటు పడి జల్సాల కోసం సులభంగా డబ్బు సంపాదించేందుకు వ్యవసాయ బావులు, కాల్వలకు అమర్చిన కరెంట్ మోటార్లను దొంగిలించి అమ్ముకుంటూ వచ్చినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. నిందితులు గతంలో కూడా కరీంనగర్, రామగుండం కమిషనరేట్ పరిధిలో ఎలక్ట్రికల్ ట్రాన్స్‌ఫార్మర్లను ధ్వంసం చేసి కాపర్ వైర్లు దొంగిలించిన కేసుల్లో అరెస్టై జైలుకు వెళ్లి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

దర్యాప్తులో భాగంగా వరంగల్ కమిషనరేట్ పరిధిలోని కమలాపూర్, దామెర పోలీస్ స్టేషన్ల పరిధిలో 34 మోటార్లు, కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని కేశవపట్నం, సైదాపూర్, ఇల్లంతకుంట ప్రాంతాల్లో 36 మోటార్లు, భూపాలపల్లి జిల్లా రేగొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక మోటార్ దొంగిలించినట్లు తేలింది.

వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, ఆదేశాల మేరకు సెంట్రల్ జోన్ డీసీపీ దార కవిత , ఏసీపిలు పీ.సదయ్య, ప్రశాంత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటుచేసి శాస్త్రీయ, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు చేపట్టారు.

వంగపెళ్లి క్రాస్ రోడ్ వద్ద వాహనాల తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో నిందితులు ఆటో ట్రాలీ, కారులో వస్తుండగా పోలీసులు అడ్డుకుని పట్టుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు పరకాల ప్రాంతంలోని ఒక ఇంటిలో దాచిపెట్టిన మరికొన్ని మోటార్లను కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ కేసును ఛేదించిన సీసీఎస్ ఇన్స్పెక్టర్లు ఎ.రాఘవేందర్, కె.రామకృష్ణ, కమలాపూర్ ఇన్స్పెక్టర్ నవీన్, ఐటి కోర్ టీమ్ ఏఏఓ మొహమ్మద్ సల్మాన్ పాషా, ఎస్సై శ్రీనివాస రాజు, హెడ్ కానిస్టేబుళ్లు నసీమ్ హమ్మెద్, కె. మహేశ్వర్, వి.జంపయ్య, కానిస్టేబుళ్లు విశ్వేశ్వర్, వంశీ, వినోద్, కమలాపూర్ ఎస్.ఐ దిలీప్, సిబ్బందిని సెంట్రల్ జోన్ డీసీపీ అభినందించారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More