ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా గోదావరి నది ఉగ్రరూపం దాల్చుతోంది. పరివాహక ప్రాంతాల్లో ప్రవాహం రోజురోజుకూ విపరీతంగా పెరుగుతోంది. కేవలం రెండు రోజుల క్రితం భద్రాచలం వద్ద 17 అడుగులుగా ఉన్న గోదావరి నీటిమట్టం…. ఇవాళ ఉదయానికి ఏకంగా 40 అడుగుల మార్కును దాటేసింది.

ఉద్ధృతంగా ప్రవహిస్తున్న వరద నీటి కారణంగా భద్రాచలంలోని స్నానఘట్టాల వద్ద మెట్లు మెజారిటీ భాగం నీట మునిగిపోయాయి. ప్రవాహం 43 అడుగులకు చేరే అవకాశం ఉండటంతో… అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేయడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
ఎగువన పెరుగుతున్న ప్రవాహం …
గోదావరి పరివాహక ప్రాంతాలైన కూనవరం వద్ద ప్రస్తుతం నీటిమట్టం 14.8 మీటర్లకు చేరగా, పోలవరం ప్రాజెక్ట్ వద్ద 9.98 మీటర్లుగా నమోదైంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌లోని రాజమండ్రి ధవళేశ్వరం వద్ద ఉన్న సర్ ఆర్ధర్ కాటన్ బ్యారేజికి ఇన్ ఫ్లో, ఔట్ ఫ్లో 5.61 లక్షల క్యూసెక్కులుగా ఉంది. ఈ వరద ప్రవాహం క్రమంగా పెరుగుతూ 8 నుంచి 9 లక్షల క్యూసెక్కుల వరకు చేరే అవకాశం ఉందని జలవనరుల శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. అయితే ఈ గరిష్ట మట్టానికి చేరిన తర్వాత వరద క్రమంగా తగ్గుముఖం పట్టే సూచనలు ఉన్నాయని వాతావరణ మరియు జలవనరుల నిపుణులు వెల్లడించారు.
గోదావరి ఉద్ధృతి నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని ముంపు ముప్పు ఉన్న ప్రభావిత జిల్లాల్లో ప్రభుత్వం ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్ (NDRF), ఎస్డీఆర్‌ఎఫ్ (SDRF) బృందాలను రంగంలోకి దించారు.
"వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నందున ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కలవర్టులు మరియు కాజ్వేల వద్ద ప్రజలు ప్రమాదకర ప్రయాణాలు చేయకూడదు," అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు, స్థానికులు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}"వరద ప్రవాహం తీవ్రంగా ఉన్నందున ఉప్పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు, కలవర్టులు మరియు కాజ్వేల వద్ద ప్రజలు ప్రమాదకర ప్రయాణాలు చేయకూడదు," అని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ ఓ ప్రకటన విడుదల చేసింది. ప్రయాణికులు, స్థానికులు అధికారుల సూచనలను పాటిస్తూ సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఆయన విజ్ఞప్తి చేసింది.
{{/usCountry}}