...
...
Next Story

వినాయక నిమజ్జనం కోసం ఎస్‌ఆర్‌ఎస్‌పీ నుండి కాకతీయ ప్రధాన కాలువలోకి నీటి విడుదల

గణేష్ విగ్రహాల నిమజ్జనం చేసుకునేందుకు వీలుగా నీటిపారుదల శాఖ ఎస్‌ఆర్‌ఎస్పీ నుంచి నీటిని విడుదల చేసింది. కాకతీయ ప్రధాన కాలువకు నీటిని విడుదల చేశారు.

Published on: Sep 21, 2026, 15:29:51 IST
Advertisement

గణేష్ విగ్రహాల నిమజ్జన ఉత్సవాలను సులభతరం చేసేందుకు నీటిపారుదల శాఖ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. సోమవారం రోజున శ్రీరామ్‌ సాగర్‌ ప్రాజెక్టు(SRSP) నుంచి లోయర్ మానేర్ డ్యామ్(LMD) ఎగువన ఉన్న కాకతీయ ప్రధాన కాలువలోకి నీటిని విడుదల చేశారు. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్ జిల్లాల యంత్రాంగం పంపిన అభ్యర్థనలు, అందించిన మార్గదర్శకాలకు అనుగుణంగా నిమజ్జన ఘాట్ల వద్ద తగినంత నీటి మట్టం ఉండేలా చూడటానికి ఈ నీటి విడుదల ప్రక్రియను చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.

గణేష్ నిమజ్జనం
గణేష్ నిమజ్జనం

ప్రారంభంలో 1,000 క్యూసెక్కుల నీటిని కాకతీయ కాలువలోకి వదిలారు. రోజు గడిచేకొద్దీ క్రమంగా ఈ ప్రవాహాన్ని పెంచి, సాయంత్ర సమయానికి 3,000 క్యూసెక్కులకు పెంచుతామని నీటిపారుదల శాఖ తెలిపింది. ఈ నీటి విడుదల వల్ల లోయర్ మానేరు డ్యామ్ ఎగువన ఉన్న కాకతీయ కాలువ పరివాహక ప్రాంతాల్లో భక్తులు వినాయక విగ్రహాలను ఎటువంటి ఇబ్బందులు లేకుండా ప్రశాంతంగా, సురక్షితంగా నిమజ్జనం చేయడానికి మార్గం సుగమమైంది.

గణేష్ నిమజ్జనం వేళ జాగ్రత్తలు

గణపతి నిమజ్జన శోభాయాత్రలు, నీటి వనరుల వద్ద భక్తుల రద్దీ అధికంగా ఉంటుంది. ఎలాంటి ప్రమాదాలు, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉత్సవాలను ఆనందోత్సాహాల నడుమ పూర్తి చేసుకోవడానికి కొన్ని ప్రధాన భద్రతా జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి:

కాలువలు, చెరువుల వద్ద జాగ్రత్తగా ఉండాలి. లోతుగా ఉండే ప్రాంతాల్లోకి వెళ్లవద్దు. శ్రీరామ్ సాగర్ కాకతీయ కాలువ వంటి ప్రవాహ నీటిలో ప్రవాహ వేగం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈత వచ్చినప్పటికీ కాలువల్లో దిగి నిమజ్జనం చేయడం ప్రమాదకరం.

ప్రభుత్వం, స్థానిక యంత్రాంగం ఏర్పాటు చేసిన నిమజ్జన ఘాట్లు లేదా బారికేడ్ల పరిధిలోనే విగ్రహాలను నిమజ్జనం చేయాలి. రద్దీగా ఉండే నీటి వనరుల వద్దకు, కాలువ గట్లపైకి పిల్లలను ఒంటరిగా వెళ్లనివ్వకూడదు. నీటి ప్రవాహ ప్రాంతాలకు వారిని దూరంగా ఉంచాలి.

విగ్రహాలను తీసుకెళ్లే వాహనాలపై పరిమితికి మించి యువకులు, భక్తులు ఎక్కకూడదు. నిమజ్జన ప్రాంతాల వద్ద విధులు నిర్వహించే అధికారుల సూచనలను కచ్చితంగా పాటించాలి. ప్రమాదవశాత్తు ఎవరైనా నీటిలో పడిపోయినా లేదా అత్యవసర పరిస్థితి ఏర్పడినా వెంటనే డ్యూటీలో ఉన్న పోలీసులకు, ఎన్డీఆర్‌ఎఫ్/లైఫ్‌గార్డ్ సిబ్బందికి సమాచారం అందించాలి.

 
ABOUT THE AUTHOR
Anand Sai

ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.

SHARE THIS ARTICLE ON
Notifications

Get breaking alerts directly from the newsroom

Notifications are on!You'll be notified when news breaks