...
...
Next Story

హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్ - ఈ ప్రాంతాల్లో నీటి సరఫరా బంద్, ఎప్పటివరకంటే..?

హైదరాబాద్ నగర వాసులకు జలమండలి అధికారులు అలర్ట్ ఇచ్చారు. మానేరు నది ఒడ్డున HMWS పైపులైన్ లీకేజ్ ఏర్పడటంతో నగరంలోని పలు ప్రాంతాల్లో నీటి సరఫరాకు అంతరాయం ఏర్పడింది.

Published on: Jan 2, 2026, 15:49:22 IST
Advertisement

హైదరాబాద్ నగరవాసులకు జలమండలి అలర్ట్ ఇచ్చింది. సిటీకి తాగునీరు సరఫరా చేసే గోదావరి డ్రింకింగ్ వాటర్ సప్లై పథకంలో భాగంగా బొమ్మకల్ పంపింగ్ స్టేషన్ సమీపంలో పైప్ లీకేజీ ఏర్పడింది. శ్రీనివాస్ నగర్ బ్రిడ్జి వద్ద 3000 మీమీ డయా ఎంఎస్ పంపింగ్ మెయిన్‌ కి ఏర్పడిన లీకేజీతో వాటర్ సరఫరాకు బ్రేక్ పడిందని అధికారులు తెలిపారు.

19 గంటల పాటు సరఫరా నిలిపివేత….

పైప్ లీకేజీ
పైప్ లీకేజీ

పైప్ లీకేజీ కారణంతో 02.01.2026 శుక్రవారం మధ్యాహ్నం 1 గంటల నుంచి మరునాడు 03.01.2026 (శనివారం) ఉదయం 6 గంటల వరకు నీటి సరఫరా బంద్ కానుంది. మొత్తం 19 గంటల పాటు ఈ మరమ్మత్తు ప్రక్రియ కొనసాగుతుంది. కాబట్టి ఈ 19 గంటలు పలు ప్రాంతాల్లో మంచినీటి సరఫరాలో అంతరాయం ఏర్పడుతుంది.

అంతరాయం ఏర్పడే ప్రాంతాలు:

1. ఓ అండ్ ఏం డివిజన్–VI: ఎస్.ఆర్. నగర్, సనత్‌నగర్, బోరబండ, ఎస్పీఆర్ హిల్స్, ఎర్రగడ్డ, బంజారాహిల్స్, వెంగల్‌రావు నగర్, ఎల్లారెడ్డిగూడ, సోమాజిగూడ, ఫతేనగర్ సెక్షన్లు.

2. ఓ అండ్ ఏం డివిజన్–IX: కూకట్‌పల్లి, భాగ్యనగర్, వివేకానందనగర్, ఎల్లమ్మబండ, మూసాపేట, భారత్నగర్, మోతీనగర్, గాయత్రినగర్, బాబానగర్, కేపీహెచ్‌బీ, బాలాజీనగర్, హస్మత్‌పేట్ సెక్షన్.

3. ఓ అండ్ ఏం డివిజన్డి–XII: చింతల్, సుచిత్ర, జీడిమెట్ల, షాపూర్‌నగర్, గాజులరామారం, సూరారం, ఆదర్శ్‌నగర్, భగత్‌సింగ్ నగర్, జగద్గిరిగుట్ట, ఉషోదయ సెక్షన్.

4. ఓ అండ్ ఏం డివిజన్ –XIII: అల్వాల్, ఫాదర్ బాలయ్యనగర్, వెంకటాపురం, మచ్చబొల్లారం, డిఫెన్స్ కాలనీ, వాజ్‌పాయినగర్, యాప్రాల్, చాణక్యపురి, గౌతమ్‌నగర్, సాయినాథ్‌పురం సెక్షన్.

5. ఓ అండ్ ఏం డివిజన్ –XIV(కాప్రా మున్సిపాలిటీ): చర్లపల్లి, సాయిబాబానగర్, రాధిక సెక్షన్లు.

7. ఓ అండ్ ఏం డివిజన్–XVII: హఫీజ్‌పేట్, మియాపూర్ సెక్షన్లు.

8. ఓ అండ్ ఏం డివిజన్ –XXI: కొంపల్లి, గుండ్లపోచంపల్లి, తూముకుంట, జవహర్‌నగర్, దమ్మాయిగూడ, నగరం సెక్షన్.

9. ఓ అండ్ ఏం డివిజన్ –XXI : నిజాంపేట్, బాచుపల్లి, ప్రగతినగర్, గండిమైసమ్మ, తెల్లాపూర్, బొల్లారం సెక్షన్లు.

10. ట్రాన్స్‌మిషన్ డివిజన్–IV: ఎంఈఎస్, త్రిశూల్ లైన్లు, గన్‌రాక్, హకీంపేట్ ఎయిర్ ఫోర్స్, సికింద్రాబాద్ కాంటోన్మెంట్, ఏఐఐఎంఎస్–బిబినగర్.

11. ఆర్‌డబ్ల్యూఎస్ ఆఫ్‌టేక్స్: ఆలేరు (భువనగిరి), ఘనపూర్ (మెద్చల్/షామీర్‌పేట్) ప్రాంతాలు.

నీటి సరఫరాలో అంతరాయం కలగనున్న ప్రాంతాల్లోని వినియోగదారులు నీటి వాడకంలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జలమండలి అధికారులు ప్రకటన విడుదల చేశారు. ముందస్తు ప్రకటన నేపథ్యంలో… తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

 

మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.

SHARE THIS ARTICLE ON
Hindustantimes wants to start sending you push notifications. Click allow to subscribe