రామగుండం కార్పొరేషన్‌లో రూ.175 కోట్ల విలువైన పనులకు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క శంకుస్థాపన చేశారు. మంత్రులు శ్రీధర్‌బాబు, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ, అడ్లూరి లక్ష్మణ్ కూడా హాజరయ్యారు. అనంతరం ఇందిరమ్మ ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని భట్టి మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతీ నియోజకవర్గానికి 3500 చొప్పున ఇందిరమ్మ ఇళ్లకు కేటాయించిందన్నారు. ఈ ఇళ్ల కోసం రూ.22,500 కోట్లు ఖర్చు చేస్తున్నట్టుగా వెల్లడించారు. స్థలం ఉన్నవారు.. ఇల్లు నిర్మించుకోవడానికి రూ.5లక్షలు అందజేస్తోందని చెప్పారు. ప్రతీవారం ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు బిల్లులు మంజూరు చేస్తామన్నారు. లబ్ధిదారులకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తి చేసే కొద్దీ నిధులు మంజూరు చేస్తామని భట్టి విక్రమార్క అన్నారు. ఇందిరమ్మ ఇళ్ల బిల్లులు విడతలవారీగా విడుదల చేయనున్నట్టుగా స్పష్టం చేశారు. లబ్ధిదారులు త్వరితగతిన ఇంటి నిర్మాణాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. రామగుండం అభివృద్ధి కోసం, ప్రజల అవసరాల కోసం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ ఎల్లప్పుడూ పని చేస్తారని పేర్కొన్నారు.
'రామగుండంలో 800 మెగావట్ల థర్మల్ పవర్ ప్లాంట్ కోసం చర్యలు చేపడుతున్నాం. కొద్ది రోజుల్లోనే పవర్ ప్రాజెక్టు ప్రకటన చేస్తాం. రాజకీయ అవసరాల కోసం ప్రజలను అయోమయానికి గురి చేయవద్దు. రామగుండం ప్రాంతంలోని పరిశ్రమలు అందరికి ఉపయోగపడుతున్నాయి. రామగుండంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ప్రాజెక్టులే తప్ప బీఆర్ఎస్ చేసింది ఏం లేదు.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అన్నారు.
సింగరేణి కాలరీస్ అనేది అతిపెద్ద ప్రభుత్వ రంగ సంస్థ అని భట్టి విక్రమార్క చెప్పారు. దానిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. సింగరేణి మైనింగ్ కేవలం బొగ్గు ఉత్పత్తిలోనే కాదని, అన్ని రంగాల్లో అభివృద్ధి చెందడానికి ప్రభుత్వం చర్యలు చేపడుతోందని స్పష్టం చేశారు. సింగరేణి కార్మికులకు కోటి రుపాయల ప్రమాద బీమా కల్పించిన ఏకైక ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పారు. రామగుండం అభివృద్ధి ప్రత్యేక నిధులు కేటాయించి.. పూర్తి సహకారం అందిస్తామని వెల్లడించారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వ పరంగా కృషి చేస్తామన్నారు.
'గతంలో బీఆర్ఎస్ హయాంలో పురుగుల బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం అందిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
{{/usCountry}}'గతంలో బీఆర్ఎస్ హయాంలో పురుగుల బియ్యం ఇస్తే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక సన్నబియ్యం అందిస్తోంది. పేద, మధ్యతరగతి కుటుంబాల సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందిస్తోంది. మహిళలకు ఉచిత ఆర్టీసీ బస్సు సౌకర్యాన్ని ఏర్పాటు చేశాం. పాలకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును పూర్తి చేస్తాం.' అని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చెప్పారు.
{{/usCountry}}