సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం : సీఎం రేవంత్

సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపిస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతులను గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నామన్నారు.

Published on: Mar 19, 2026, 17:48:12 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తెలంగాణలో సాదా బైనామా భూములకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. ఉగాది పండుగ శుభదినం సందర్భంగా ఈ విషయాన్ని ప్రకటించారు. వ్యవసాయాన్ని లాభసాటిగా చేసి రైతును రాజుగా నిలబెట్టాలన్న సంకల్పంతో ముందుకు వెళుతున్నామని చెప్పారు.

సీఎం రేవంత్ రెడ్డి
సీఎం రేవంత్ రెడ్డి

తెలంగాణ ప్రభుత్వం భాషా సాంస్కృతి శాఖ, దేవాదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో రవీంద్రభారతిలో నిర్వహించిన శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. శ్రీ పరాభవ నామ ఉగాది పంచాంగాన్ని ముఖ్యమంత్రి ఆవిష్కరించారు. ప్రకృతి వైపరీత్యాలు రాకుండా ప్రజలు సుఖశాంతులతో వర్థిల్లాలని ఈ సందర్భంగా భగవంతుడిని ప్రార్థించారు. ఈ నెల 22న రైతు భరోసా అందించబోతున్నామని తెలియజేశారు.

రైతు సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి ప్రభుత్వం పనిచేస్తుందని ముఖ్యమంత్రి పునరుద్ఘాటించారు. 'ధరణి రూపంలో భూతమై రైతులను బాధ పెడుతున్న సందర్భంగా రైతులకు అండగా దాన్ని తరిమేసి భూ భారతితో రైతాంగ సమస్యలను పరిష్కరిస్తున్నాం. సాదా బైనామాకు సంబంధించి తొందరలోనే పరిష్కారం చూపించబోతున్నాం. సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న రైతాంగాన్ని గట్టెక్కించడానికి పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంతో పాటు బోనస్ కూడా ఇచ్చి ఆదుకుంటున్నాం. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన లెక్కల మేరకు దేశంలో అతితక్కువ రుణభారం కలిగిన రైతులున్న రాష్ట్రాల్లో తెలంగాణ మొదటి స్థానంలో ఉండటం గర్వకారణం.' అని అన్నారు.

పరిశ్రమలు ఎన్ని వచ్చినా, ఐటీ రంగాలు ఎంతగా రాణించినప్పటికీ రాష్ట్రంలో ఇప్పటికీ ప్రధాన జీవనాధారం వ్యవసాయమేనని రేవంత్ రెడ్డి అన్నారు. రైతులు బాగున్నప్పుడే రాష్ట్రం బాగుంటుందన్నారు. రాష్ట్రంలో 25.35 లక్షల రైతు కుటుంబాలకు రూ.20,616 కోట్ల 2 లక్షల వరకు రుణమాఫీ చేసి రైతులను ఆత్మగౌరవంతో బతకడానికి ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని పేర్కొన్నారు.

ప్రతి ఎకరాకు రూ. 12 వేల చొప్పున రైతు భరోసా అందిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఇప్పటికే ప్రభుత్వం 18 వేల కోట్ల రూపాయలు రైతు భరోసా కింద అందించిందన్నారు. 'పండించిన పంటలపై రైతుల్లో విశ్వాసం కల్పించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన ఉద్దేశం. వ్యవసాయ రంగానికి ఉచిత కరెంట్, పంటలకు గిట్టుబాటు ధర కల్పించడం, రుణమాఫీ చేయడం, రైతుభరోసా అందించడంతో పాటు రైతు బీమా అమలు చేయడం వంటివన్నీ రైతు సంక్షేమం, అభివృద్ధి కోసం తీసుకున్న నిర్ణయాలు.' అని రేవంత్ రెడ్డి చెప్పారు.

ప్రభుత్వం రైతుల కోసం ప్రయత్నాలు, నిర్మిస్తున్న సాగునీటి ప్రాజెక్టులు, సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలన్నీ దేశంలో తెలంగాణ ప్రతిష్టను పెంపొదిస్తాయని సీఎం రేవంత్ వెల్లడించారు. మన పొలాల్లో సమృద్ధిగా పంటలు పండినప్పుడే రాష్ట్రం సుఖశాంతులతో విలసిల్లుతుందన్నారు.

  • Anand Sai
    ABOUT THE AUTHOR
    Anand Sai

    ఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్‌ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్‌ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్‌ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్‌, స్పోర్ట్స్‌ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More