వెదర్ అప్డేట్స్ : తెలంగాణలో మళ్లీ చలి పెరిగే అవకాశం - అంచనాలు ఇలా...!

రాష్ట్రంలో చలి తీవ్రత కొనసాగుతోంది. గడిచిన వారం రోజులుగా కొంత మేర తగ్గినప్పటికీ… మళ్లీ చలి తీవ్రత పెరిగే అవకాశం ఉంది. ఈనెల 12వ తేదీ వరకు చలి తీవ్రత ఎక్కువగా ఉండే సూచనలున్నాయి.

Published on: Jan 4, 2026, 13:17:54 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

డిసెంబర్ వరకు చలి తీవ్రతతో ప్రజలంతా గజగజ వణికిపోయారు. ఉదయం, రాత్రి వేళలో బయటికి వెళ్లలేని పరిస్థితులు ఉండేవి. ముఖ్యంగా పొగమంచు పరిస్థితులతో ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. ముఖ్యంగా వృద్ధులు చాలా ఇబ్బందిపడ్డారు. అయితే గడిచిన నాలుగైదు రోజులుగా వాతావరణంలో మార్పులు ఉన్నాయి. చలి తీవ్రత క్రమంగా తగ్గిపోయిన పరిస్థితులు కనిపించాయి. హైదరాబాద్ శివారు, ఏజెన్సీ ప్రాంతాలు మినహాయిస్తే చాలా ఏరియాల్లో చలి తీవ్రత తగ్గింది.

పెరగనున్న చలి తీవ్రత...!
పెరగనున్న చలి తీవ్రత...!

చలి పెరిగే అవకాశం…!

తెలంగాణ వెదర్ మ్యాన్ రిపోర్ట్ ప్రకారం… రాష్ట్రంలో మళ్లీ చలి పెరిగే అవకాశం ఉంది. ఈనెల 5వ తేదీ నుంచి 12వ తేదీ వరకు మళ్లీ చలి గాలుల తీవ్రత ఉంటుంది. పొగమంచు పరిస్థితులు ఉంటాయి. అంతేకాకుండా ఉష్ణోగ్రతలు పడిపోతాయి.

హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిపోర్ట్ ప్రకారం... రాబోయే రోజుల్లో తెలంగాణలో అక్కడకక్కడ పొగమంచు కురిసే అవకాశం ఉంది. ఎలాంటి హెచ్చరికలు లేవు. మిగతా రోజుల్లో పూర్తిగా పొడి వాతావరణం ఉండే అవకాశం ఉంటుంది.

హైదరాబాద్ లో ఆకాశం పాక్షికంగా మేఘావృతమై ఉంటుంది. ఉదయం లేదా రాత్రి వేళల్లో పొగమంచుతో కూడిన పరిస్థితులుంటాయి. ఉపరితల గాలులు తూర్పు ఆగ్నేయం దిశలో గంటకు 4- 6 కిమీ వేగంతో వీచే అవకాశం ఉంటుంది.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More