జూబ్లీహిల్స్ గడ్డపై హస్తం జెండా రెపరెపలాడింది. అత్యంత ఉత్కంఠభరితంగా జరిగిన ఈ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ 24 వేలకుపైగా ఓట్ల తేడాతో విజయం సాధించారు. ఈ ఉపఎన్నికను ముందు నుంచి అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. అప్రమత్తంగా వ్యవహరించింది.

{{^htLoading}} {{/htLoading}}
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన రెండేళ్ల తర్వాత ఈ ఉపఎన్నిక రావటంతో రేవంత్ ప్రభుత్వానికి అతి పెద్ద సవాల్ గా మారింది. ఎలాగైనా ఈ బైపోల్ లో గెలిచి…. తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించాలని భావించింది. హైదరాబాద్ నగరంలో కూడా పట్టు పెంచుకునే దిశగా అడుగులు వేసింది. ఇందులో భాగంగానే గతంలో కంటోన్మెంట్ లో గెలిచిన కాంగ్రెస్ పార్టీ…. ప్రస్తుతం జరిగిన జూబ్లీహిల్స్ లోనూ జెండాను ఎగరవేసింది.
జూబ్లీహిల్స్ లో కాంగ్రెస్ విక్టరీ - 5 ప్రధాన కారణాలు
- జూబ్లీహిల్స్ ఉపఎన్నికను కాంగ్రెస్ పార్టీ అత్యంత సవాల్ గా తీసుకుంది. ఏ చిన్న తప్పదానికి అవకాశం ఇవ్వొద్దని భావించింది. మంత్రులు, కార్పొరేషన్ ఛైర్మన్లతో పాటు కీలక నేతలతో కమిటీలు ఏర్పాటు పకడ్బందీగా వ్యవహరించింది. నోటిఫికేషన్ రాకముందు నుంచే పక్కాగా అడుగులు వేసింది.
- అభ్యర్థి ఎంపిక విషయంలో కాంగ్రెస్ ఆచితూచీ వ్యవహరించింది. అనేక పేర్లు పరిశీలించినప్పటికీ బీసీ అభ్యర్థి అయిన నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. నవీన్ యాదవ్ స్థానికుడు కావటంతో పాటు గతంలో రెండు సార్లు ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. గతంలో ఎంఐఎం నుంచి పోటీ చేసి మంచి ఓట్లను సాధించారు. ఆ తర్వాత స్వతంత్రంగా కూడా పోటీ చేసిన చెప్పుకోదగ్గ ఓట్లను సాధించారు. దీంతో నవీన్ యాదవ్ వైపే మొగ్గు చూపింది. ఈ నిర్ణయం కాంగ్రెస్ కు అత్యంత కలిసివచ్చింది.
- ఎంఐఎంను పోటీలో లేకుండా చేయటంలో కూడా కాంగ్రెస్ ప్లాన్ వర్కౌట్ అయింది. ఆ పార్టీ నేతలతో చర్చలు జరిపి పోటీలో లేకుండా చేయటంతో ముస్లిం ఓట్లను తమవైపు తిప్పుకోగలిగింది. ఎంఐఎం పోటీలో ఉంటే ఓట్లు చీలి ప్రత్యర్థి పార్టీకి అవకాశం ఉంటుందని భావించి... ఎంఐఏంతో చర్చలు జరిపి నవీన్ యాదవ్ కు మద్దతు ఇచ్చేలా చేసింది. దీనితోడు అజహరుద్దీన్ ను కేబినెట్ లోకి తీసుకోవటం వంటి నిర్ణయం కూడా ఇంతో కొంత లాభం చేకూర్చింది.
- ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఈ ఉపఎన్నికను అత్యంత సవాల్ గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి హోదాను పక్కన పెట్టి... జూబ్లీహిల్స్ గల్లీల్లో రోడ్ షోలు నిర్వహించారు. కార్నర్ మీటింగ్స్ లో ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేశారు. పదునైన డైలాగ్స్ తో ప్రత్యర్థి పార్టీలను ఇరకాటంలో నెట్టే ప్రయత్నం చేశారు.
- పోల్ మేనేజ్మెంట్ లో కాంగ్రెస్ తిరుగులేని విధంగా వ్యవహరించింది. ప్రత్యర్థి పార్టీల అంచనాలకు మించి పార్టీ నాయకత్వం పని చేసింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు డివిజన్ల వారీగా ప్రతిదీ పర్యవేక్షిస్తూ వచ్చింది. కాంగ్రెస్ విజయంలో పోల్ మేనేజ్మెంటే అత్యంత కీలకమైందని పలువురు విశ్లేషిస్తున్నారు.
{{^htLoading}} {{/htLoading}}
Advertisement
{{/htLoading}}{{#usCountry}} {{/usCountry}}