SIR in Telangana : తెలంగాణలో ఓటర్ల జాబితా రూపకల్పన, సవరణల ప్రక్రియ ముమ్మరంగా సాగుతోంది. ఇందులో భాగంగా ఓటర్ల వివరాల సేకరణకు ఎన్యూమరేషన్ ఫామ్ (EF) ఎంతో కీలకం. అయితే, చాలామంది ఓటర్లకు ఈ ఫామ్ ఎలా పొందాలో, ఒకవేళ ఇంటికి రాకపోతే ఏం చేయాలో తెలియక అయోమయానికి గురవుతుంటారు. ఈ నేపథ్యంలో ఓటర్లలో అవగాహన కల్పించేందుకు భారత ఎన్నికల సంఘం, తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (CEO) కార్యాలయం సంయుక్తంగా కీలక మార్గదర్శకాలను విడుదల చేశాయి.
ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అందకపోతే ఇలా చేయండి...!
- నేరుగా లేదా ఆన్‌లైన్ ద్వారా : సాధారణంగా ఎన్యూమరేషన్ ఫామ్ (EF)ను మీ పరిధిలోని బూత్ స్థాయి అధికారి (BLO) నేరుగా మీ ఇంటికి వచ్చి అందిస్తారు. ఒకవేళ ఏవైనా కారణాల వల్ల బీఎల్ఓ మిమ్మల్ని సంప్రదించలేకపోతే, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఓటర్లు నేరుగా ఎన్నికల సంఘం అధికారిక వెబ్‌సైట్ https://voters.eci.gov.in నుండి ఈ ఫారాన్ని సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
- ఇంట్లో లేకపోయినా ఇబ్బంది లేదు : బీఎల్ఓ మీ ఇంటికి వచ్చిన సమయంలో మీరు అందుబాటులో లేకపోయినా పర్వాలేదు. ఆ సమయంలో మీ ఇంట్లో ఉండే ఏ రకమైన వయోజన సభ్యునికైనా (కుటుంబంలోని పెద్దలు లేదా అర్హులైన ఇతరులు) బీఎల్ఓ ఈ ఫారమును అందజేస్తారు. వారి ద్వారా మీరు ఫారమ్‌ను సేకరించి పూర్తి చేయవచ్చు.
- ఫోన్ ద్వారా బీఎల్ఓను సంప్రదించవచ్చు : పైన పేర్కొన్న రెండు పద్ధతుల్లోనూ మీకు ఫామ్ లభించకపోతే, ఓటరు నేరుగా తన బూత్ స్థాయి అధికారి (BLO)కి ఫోన్ చేసి మాట్లాడవచ్చు. ఇందుకోసం కేటాయించిన ప్రత్యేక సంప్రదింపు నంబర్ ద్వారా బీఎల్ఓను సంప్రదించి, మీ ఎన్యూమరేషన్ ఫామ్‌ను కోరవచ్చు.

సాంకేతికతను వాడుకుంటూ ఓటర్ల కోసం ఎన్నికల సంఘం మరో అద్భుతమైన అవకాశాన్ని కల్పించింది. ఓటర్లు అధికారిక వెబ్‌సైట్ ( https://voters.eci.gov.in ) సందర్శించి, అక్కడ అందుబాటులో ఉన్న "Book a Call with BLO" అనే ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. దీని ద్వారా బీఎల్ఓతో నేరుగా మాట్లాడేందుకు సమయాన్ని ఖరారు చేసుకోవచ్చు. ఓటర్లందరూ ఈ అవకాశాలను ఉపయోగించుకుని తమ ఓటు హక్కును భద్రపరుచుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
తరుచుగా అడిగే ప్రశ్నలు :
ప్రశ్న: ఎన్యూమరేషన్ ఫామ్ (EF) అంటే ఏమిటి, దీన్ని ఎవరు ఇస్తారు...?
జవాబు: ఓటర్ల వివరాల నమోదు, ధ్రువీకరణ కోసం ఉపయోగించే ఫారమే ఎన్యూమరేషన్ ఫామ్ (EF). దీన్ని మీ ప్రాంతానికి సంబంధించిన బూత్ లెవెల్ ఆఫీసర్ (BLO) ఇంటికి వచ్చి ఇస్తారు.
ప్రశ్న: బీఎల్ఓ ఇంటికి వచ్చినప్పుడు నేను ఊళ్లో లేకపోతే ఫామ్ ఎలా అందుతుంది...?
జవాబు: మీరు ఇంట్లో లేని సమయంలో మీ కుటుంబంలోని ఎవరైనా వయోజన సభ్యునికి బీఎల్ఓ ఆ ఫారమును అందజేస్తారు.
ప్రశ్న: ఆన్‌లైన్‌లో ఈ ఫారమ్‌ను ఎక్కడ డౌన్‌లోడ్ చేసుకోవాలి..?
జవాబు: భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in వెబ్‌సైట్ నుంచి ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}జవాబు: భారత ఎన్నికల సంఘం అధికారిక పోర్టల్ https://voters.eci.gov.in వెబ్‌సైట్ నుంచి ఈ ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
{{/usCountry}}