వాట్సాప్‌లో క్యాస్ట్, ఇన్‌కమ్, బర్త్ సర్టిఫికేట్లు.. కానీ అప్లై చేస్తే మరో చోటికి!
whatsapp meeseva number : తెలంగాణ ప్రజలకు ప్రభుత్వం వాట్సాప్ ద్వారా పలు సేవలను అందిస్తున్న విషయం తెలిసిందే. చాలా సర్టిఫికేట్లు ఇంట్లో నుంచే అప్లై చేసుకోవచ్చు. హైదరాబాద్ వాసులు సైతం వాట్సాప్ ద్వారా మీ సేవా సర్వీసులు పొందవచ్చు.
తెలంగాణ ప్రభుత్వం మీ సేవ సర్వీసెస్ ఆన్ వాట్సాప్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ధృవీకరణ తర్వాత పౌరులు చాలా రకాల సేవలు పొందవచ్చు. మీసేవా వాట్సాప్ సర్వీసెస్ పౌరులకు సరళమైన చాట్ ఇంటర్‌ఫేస్ ద్వారా ప్రభుత్వ సేవలను పొందేలా చేస్తుంది. తెలంగాణ అంతటా పౌరుల మొబైల్ ఫోన్‌లకు ప్రభుత్వ సేవలను తీసుకురావడంపై చాలా ప్రశంసలు వచ్చాయి.

వాట్సాప్‌లోనే కులం, ఆదాయం, నివాసం, బర్త్, డెత్, సర్టిఫికేట్లు అప్లై చేసుకోవచ్చు. సుమారు 580 సేవలను రాష్ట్ర ప్రభుత్వం వాట్సాప్ ద్వారా అందిస్తోంది. వాట్సాప్ సేవల ద్వారా రోజులతరబడి వేచి చూడాల్సిన అవసరం లేకుండా పోతుంది. మీ సేవ కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పని కూడా లేదు. ఇంట్లో కూర్చొని కావాల్సిన సర్వీస్ అప్లై చేయవచ్చు.
వాట్సాప్ సౌకర్యం రాష్ట్రవ్యాప్తంగా 5,000 మీసేవా సేవా కేంద్రాల నెట్‌వర్క్‌కు కనెక్ట్ చేసింది తెలంగాణ ప్రభుత్వం. హాల్ టిక్కెట్లు, వాతావరణ సమాచారం, ప్రభుత్వ హెచ్చరికల నుండి బస్సు టిక్కెట్ల బుకింగ్ వరకు, భవిష్యత్తులో అనేక సేవలు దీనికి యాడ్ చేసే అవకాశం ఉంది.
అయితే ఈ వాట్సాప్ మీ సేవ హైదరాబాద్ ప్రజలకు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇకపై కాస్ట్, ఇన్కమ్, రెసిడెన్స్, బర్త్, డెత్ వంటి సర్టిఫికెట్ల కోసం మీసేవా కేంద్రాల వద్ద లైన్లలో నిలబడాల్సిన అవసరం లేదు. వాట్సాప్ ద్వారానే అప్లై చేసుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. ఎలా అప్లై చేయాలి.
- 8096958096 నంబర్‌ను సేవ్ చేసుకోవాలి.
- వాట్సాప్‌లో “Hi” అని మెసేజ్ పంపండి.
- వెంటనే అందుబాటులో ఉన్న సేవల జాబితా వస్తుంది.
- ఆధార్ ఆధారిత ధ్రువీకరణ చేయాలి.
- అవసరమైన పత్రాలను, స్కాన్ చేసిన ప్రతులను నేరుగా వాట్సప్‌లోనే అప్‌లోడ్ చేయవచ్చు.
- అక్కడి నుంచే మీకు అవసరమైన సర్టిఫికెట్‌కు అప్లై చేయవచ్చు.
- సుమారు 7 రోజుల్లో సర్టిఫికెట్ ప్రాసెస్ అవుతుంది.
సమ్మర్ తర్వాత కాలేజీ అడ్మిషన్లు తీసుకునే విద్యార్థులకు ఈ సర్వీస్ చాలా ఉపయోగపడుతుంది. వాట్సాప్ నంబర్ 80969 58096 కు 'హాయ్' పంపడం ద్వారా ఈ సేవను యాక్సెస్ చేయవచ్చు. వినియోగదారులు జనన, మరణ, కులం వంటి సర్టిఫికెట్ల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విద్యుత్, వాటర్ అలాగే ఆస్తి పన్ను వంటి యుటిలిటీలకు చెల్లింపులు చేయవచ్చు. పోలీసు చలాన్ చెల్లింపులను చెల్లించవచ్చు, దరఖాస్తులను ట్రాక్ చేయవచ్చు. జారీ చేసిన పత్రాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
అయితే ఇంత వరకు బాగానే ఉన్నా.. క్షేత్రస్థాయిలో మాత్రం పలు సమస్యలు కూడా ఉత్పన్నమవుతున్నాయి. సర్టిఫికేట్ కోసం ఒక చోట అప్లై చేస్తే మరో చోటికి వెళ్తుందని వినియోగదారులు చెబుతున్నారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి చెందిన శిరీష అనే మహిళ వాట్సాప్ ద్వారా ఇన్‌కమ్ సర్టిఫికేట్ ఇటీవల అప్లై చేశారు. కానీ అది వేరే మండలానికి వెళ్లింది.
'వాట్సాప్ ద్వారా నేను ఇన్‌కమ్ సర్టిఫికేట్ అప్లై చేశాను. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలానికి సంబందించి అప్లై చేస్తే అది రామగుండం దగ్గరలోని అంతర్గాం వెళ్లింది. అక్కడి నుంచి కాల్ చేసి మాట్లాడారు. వాట్సాప్ ద్వారా తప్పుగా చూపిస్తుందని, మీ సేవా కేంద్రానికి వెళ్లి అప్లై చేసుకోవాలని సలహా ఇచ్చారు.' అని శిరీష వెల్లడించారు.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper












