తెలంగాణ టెట్ పరీక్షలు ముగిసిన సంగతి తెలిసిందే. పరీక్షలకు హాజరైన అభ్యర్థులంతా కూడా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు. గతేడాది నిర్వహించిన టెట్ తో పోల్చితే… ఈసారి ఎక్కువ మంది అభ్యర్థులే హాజరయ్యారు. ఇప్పటికే ప్రాథమిక కీలు అందుబాటులోకి రాగా.. అభ్యంతరాలను కూడా స్వీకరించారు. తుది ఫలితాల విడుదలకు విద్యాశాఖ కూడా కసరత్తు కొనసాగిస్తోంది.
టీజీ టెట్ ఫలితాలు ఎప్పుడు..?

టీజీ టెట్ నోటిఫికేషన్ షెడ్యూల్ ప్రకారం…. ఫలితాలను ఫిబ్రవరి 10 నుంచి ఫిబ్రవరి 16వ తేదీల మధ్య ప్రకటిస్తామని విద్యాశాఖ తెలిపింది. ఈ తేదీల ప్రకారం చూస్తే… వచ్చే వారంలో టెట్ ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది.
టెట్ స్కోర్ కార్డు ఎక్కడ చెక్ చేసుకోవాలి..?
- అభ్యర్థులు https://tgtet.aptonline.in/tgtet/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలోని టీజీ టెట్ జనవరి - 2026 ఫలితాలపై క్లిక్ చేయాలి.
- అభ్యర్థి హాల్ టికెట్, పేపర్, పుట్టిన తేదీ వివరాలను నమోదు చేయాలి.
- సబ్మిట్ పై క్లిక్ చేస్తే మీ టెట్ స్కోర్ డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ ఆప్షన్ ద్వారా రిజల్ట్(స్కోర్ కార్డు) కాపీని పొందవచ్చు.
ఈసారి గతంతో పోల్చితే టీజీ టెట్ - 2026కు భారీగానే దరఖాస్తులు వచ్చాయి. పేపర్1, 2, కలిపి మొత్తం 2,37,754 దరఖాస్తులు అందాయి. ఇందులో 71,670 మంది ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులున్నారు. వీరంతా కూడా పరీక్షలకు హాజరయ్యారు.
టెట్‌లో ఉత్తీర్ణత సాధించిన వారికే డీఎస్సీ రాసుకునేందుకు అవకాశం ఉంటుంది. అంతేకాదు టెట్ స్కోర్ డీఎస్సీ పరీక్షలో కీలకంగా ఉంటుంది. డీఎస్సీ రిక్రూట్ మెంట్ లో టెట్ స్కోర్ కు వెయిటేజీ ఉంటుంది. కాబట్టి ఈ పరీక్షలకు భారీ సంఖ్యలోనే టీచర్ అభ్యర్థులు హాజరవుతుంటారు.
ఇక ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్లుగా పని చేయాలంటే.. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కాబట్టి టెట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. గతంలో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఏడాదిలో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు జారీ చేసి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}ఇక ప్రైవేట్ పాఠశాలల్లో కూడా టీచర్లుగా పని చేయాలంటే.. టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. కాబట్టి టెట్ పరీక్ష రాసేందుకు అభ్యర్థులు ఆసక్తి చూపుతుంటారు. గతంలో ఏడాదిలో ఒక్కసారి మాత్రమే ఈ పరీక్ష నిర్వహించేవారు. కానీ ప్రస్తుతం ఏడాదిలో రెండు సార్లు టెట్ నోటిఫికేషన్లు జారీ చేసి ఎగ్జామ్స్ నిర్వహిస్తున్నారు.
{{/usCountry}}