కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుంది? లోక్‌సభలో చర్చించిన ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఇటీవలి కాలంలో కోతుల సమస్య ఎక్కువైపోయింది. అయితే దీని గురించి ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి లోక్‌సభలో ప్రస్తావించారు.
తెలంగాణలో ప్రస్తుతం కోతుల సమస్య గురించి ఎక్కువగా చర్చ జరుగుతోంది. చాలా గ్రామాల్లో సర్పంచ్‌ని గెలిపించాలంటే ఈ సమస్యను తీర్చాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. పట్టణాల్లోనూ కోతుల బెడద ఎక్కువగానే ఉంది. హైదరాబాద్ సిటీలోనూ కోతుల సమస్య బాగా ఉంది. తాజాగా ఈ సమస్యను చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి పార్లమెంటులో ప్రస్తావించారు. లోక్‌సభ జీరో అవర్‌లో మాట్లాడారు.

తెలంగాణతోపాటుగా దేశంలో అనేక రాష్ట్రాల్లో కోతుల సమస్య ఉందని ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి చెప్పుకొచ్చారు. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయని చెప్పారు. కోతుల సమస్య ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలని అడిగారు.
'కోతుల సమస్యతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. పెద్ద మెుత్తం వానరాలు పంటలను పాడు చేస్తున్నాయి. ఈ సమస్యను నివారించేందుకు జాతీయ స్థాయిలో కార్యక్రమం చేపట్టాలి. ఈ సమస్య తమ శాఖ కిందకు రాదని ప్రభుత్వ శాఖలు తప్పించుకుంటున్నాయి. ఏ శాఖ కిందకు వస్తుందో చెప్పాలి.' అని ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ప్రశ్నించారు.
కోతుల సమస్య చాలా చిన్న విషయంగా అనిపిస్తుందని, అందరూ నవ్వుతారని కొండా విశ్వేశ్వర్ రెడ్డి చెప్పారు. కానీ ఇది పెద్ద సమస్య అని, తెలంగాణ మాత్రమే కాదని దేశంలోని అనేక రాష్ట్రాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయన్నారు. కోతుల విషయంలో నోడల్ ఏజెన్సీ అవసరం అని ఎంపీ అన్నారు. సర్పంచ్ ఎన్నికల్లో కూడా కోతుల సమస్య ఎజెండాగా మారిందని గుర్తు చేశారు. దేశ రాజధానిలో సైతం కోతుల సమస్య ఉందని పేర్కొన్నారు.
తెలంగాణలో కోతుల సమస్య విపరీతంగా ఉంది. కొన్ని గ్రామాల్లో తాము సర్పంచ్‌ను గెలిపించాలంటే కోతుల సమస్యను తీర్చాలని జనాలు డిమాండ్ చేస్తున్నారు. కోతుల బెడద నుంచి విముక్తి కలిగించిన వారికే తమ ఓటు అని పక్కాగా చెబుతున్నారు. మరోవైపు సర్పంచ్ అభ్యర్థులు సైతం గ్రామాల్లో కోతుల సమస్యను తగ్గించేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. కొండముచ్చు మాస్కులను తెప్పించి ఊర్లలో కోతులను భయపెట్టించే ప్రయత్నం చేస్తున్నారు.
కేవలం గ్రామాల్లోనే కాదు.. హైదరాబాద్‌లాంటి నగరాల్లోనూ కోతుల సమస్య విపరీతంగా పెరిగిపోయింది. కొన్ని ప్రాంతాల్లో కోతులు ఉన్న దగ్గర నుంచి ఒంటరిగా వెళ్లాలి అంటే జనాలు భయపడుతున్నారు. కొన్ని చోట్ల దాడులు చేసిన ఘటనలు కూడా ఉన్నాయి. హైదరాబాద్ ఓఆర్ఆర్ చుట్టుపక్కల కోతులు గుంపులు గుంపులుగా తిరుగుతున్నాయి.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


