తెలంగాణ అంతటా ప్రస్తుతం కొనసాగుతున్న చల్లని రాత్రుల పరిస్థితి రాబోయే కొన్ని రోజుల్లో మారే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల స్థానంలో తూర్పు దిశ నుండి వీచే గాలులు రానున్నాయి. తెలంగాణ డెవలప్మెంట్ ప్లానింగ్ సొసైటీ(TGDPS) వాతావరణ నిపుణుల అంచనా ప్రకారం ఎల్ నినో పరిస్థితుల ప్రభావంతో మిగిలిన శీతాకాలం అంతగా చలి లేకుండా సాధారణంగా ఉండే అవకాశం ఉంది.

ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కనిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీల సెల్సియస్ తక్కువగా నమోదవుతున్నాయి. ఉత్తర దిశ నుండి వీచే చల్లని గాలుల ప్రభావంతో హైదరాబాద్, పరిసర ప్రాంతాల్లో రాత్రి ఉష్ణోగ్రతలు 15 డిగ్రీల నుండి 18 డిగ్రీల మధ్య ఉన్నాయి. తెలంగాణలోని ఇతర జిల్లాల్లో 14 డిగ్రీల నుండి 19 డిగ్రీల మధ్య నమోదవుతున్నాయి.
ఇక గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే రెండు నుండి మూడు డిగ్రీలు ఎక్కువగా ఉన్నాయి. హైదరాబాద్లో పగటి ఉష్ణోగ్రతలు 31 డిగ్రీల నుండి 33 డిగ్రీల మధ్య ఉండగా, పలు జిల్లాల్లో 32 డిగ్రీల నుండి 35 డిగ్రీల వరకు నమోదయ్యాయి. ఈ అసాధారణ వాతావరణ పరిస్థితులు ఎక్కువ కాలం కొనసాగే అవకాశం కనిపించడం లేదు.
తూర్పు దిశ నుండి బలమైన గాలులు వీచే అవకాశం ఉంది. దీంతో గాలిలో తేమ పెరిగి మేఘావృతమైన వాతావరణం ఏర్పడనుంది. దీనివల్ల పగటి ఉష్ణోగ్రతలు తిరిగి సాధారణ స్థాయికి చేరుకుంటాయి. రాత్రి ఉష్ణోగ్రతలు స్వల్పంగా పెరుగుతాయి. ప్రస్తుత అంచనాల ప్రకారం, మిగిలిన శీతాకాలంలో తీవ్రమైన చలి ఉండే అవకాశం లేదు అని నిపుణులు అంటున్నారు.
రాబోయే రోజుల్లో అనుకున్నస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువే. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో కూడా రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణమే నమోదైంది. ఇటీవల ఏర్పడిన రెండు తుపానులతో రాష్ట్రం మెుత్తం ఆశించిన వర్షాలు కురవలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ వంటి కొన్ని జిల్లాలు మాత్రమే వర్షాలు పడ్డాయి.
{{/usCountry}}రాబోయే రోజుల్లో అనుకున్నస్థాయిలో వర్షాలు కురిసే అవకాశాలు తక్కువే. సాధారణంగా నవంబర్, డిసెంబర్ నెలల్లో వర్షపాతం తక్కువగా ఉంటుంది. అక్టోబర్ నెలలో కూడా రాష్ట్రంలో దాదాపు పొడి వాతావరణమే నమోదైంది. ఇటీవల ఏర్పడిన రెండు తుపానులతో రాష్ట్రం మెుత్తం ఆశించిన వర్షాలు కురవలేదు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, కొమురం భీమ్ వంటి కొన్ని జిల్లాలు మాత్రమే వర్షాలు పడ్డాయి.
{{/usCountry}}నవంబర్ 13 ప్రాంతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు అంటున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే నవంబర్ 19-20 తేదీల ప్రాంతంలో దక్షిణ తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉంది. రాష్ట్రంలో అక్టోబర్లో 86 శాతం వర్షపాతం లోటు నమోదైంది.
సాధారణంగా డిసెంబర్ నాటికి సుమారు 11 సెం.మీ. వర్షపాతాన్ని అందించే ఈశాన్య రుతుపవనాలు, ఇప్పటివరకు కేవలం 3 సెం.మీ. వర్షపాతాన్ని మాత్రమే అందించాయి. దాదాపు 70 శాతం లోటు. జూన్ 1 నుండి నవంబర్ 11 వరకు తెలంగాణ వ్యాప్తంగా సాధారణ వర్షపాతం 83.9 సెం.మీ. కాగా, అది 64.5 సెం.మీ.గా నమోదైంది. ఇది 23 శాతం లోటును సూచిస్తుంది.