హైదరాబాద్ నార్కోటిక్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ వింగ్ (H-NEW), చిక్కడపల్లి పోలీసులతో కలిసి డిసెంబర్ 24, 2025 బుధవారం నగరంలోని చిక్కడపల్లిలో ఒక మహిళా సాఫ్ట్‌వేర్ ప్రొఫెషనల్‌తో సహా ముగ్గురు మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న వారిరి అరెస్టు చేశారు. ఒక కస్టమర్‌ను కూడా ఈ సందర్బంగా అదుపులోకి తీసుకున్నారు.

ఈ ప్రాంతంలో మాదకద్రవ్యాల అక్రమ రవాణా కార్యకలాపాల గురించి విశ్వసనీయ సమాచారం మేరకు అరెస్టులు జరిగాయని పోలీసులు తెలిపారు. పోలీసులు 22 గ్రాముల OG (హైడ్రోపోనిక్ గంజాయి), MDMA, 5.57 గ్రాముల ఎక్స్‌టసీ మాత్రలు, ఆరు LSD బ్లాట్‌లు, రూ.50,000 నగదును స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న డ్రగ్స్‌తో కలిపి మెుత్తం విలువ రూ.3,12,980 ఉంటుందని అంచనా.
నిందితులను ఉమ్మిడి ఇమ్మానుయేల్ (25), ఈవెంట్ మేనేజర్‌గా గుర్తించారు. చోడవరపు సుస్మితా దేవి అలియాస్ లిల్లీ (21), సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. గొర్ల సాయి కుమార్ (28) డెలివరీ బాయ్. ముగ్గురూ కొండాపూర్‌లో ఉంటున్నట్టుగా తెలిసింది. వీరంతా ఆంధ్రప్రదేశ్‌కు చెందినవారే. వినియోగదారుడు చిక్కడపల్లికి చెందిన తాలబత్తుల తారక లక్ష్మీకాంతం(24)గా గుర్తించారు.
విచారణలో ఇమ్మాన్యుయేల్ తాను మొదట్లో మాదకద్రవ్యాలకు బానిసయ్యానని, తరువాత తన వ్యసనాన్ని కొనసాగించడానికి డ్రగ్స్ సరఫరాలోకి దిగినట్టుగా వెల్లడించాడు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో నమోదైన పలు కేసులలో నిందితుడిగా ఉన్నాడు. నేరుగా సరఫరాదారుల నుండి, తరువాత డార్క్ వెబ్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా డ్రగ్స్‌ను సేకరించాడు. క్రిప్టోకరెన్సీ వాలెట్ల ద్వారా చెల్లింపులు చేసేవాడని తెలిసింది.
నిందితులు కొరియర్ సేవల ద్వారా డ్రగ్స్‌ను స్వీకరించి హైదరాబాద్ అంతటా అధిక ధరలకు విక్రయించారు. ఇమ్మాన్యుయేల్ లేనప్పుడు, అతని ప్రియురాలు, సాఫ్ట్‌వేర్ ఉద్యోగి అయిన సుస్మితా దేవి ఈ కార్యకలాపాలను నిర్వహించారని పోలీసులు తెలిపారు. డ్రగ్స్‌ను డెలివరీ బాయ్ అయిన గొర్ల సాయి కుమార్ సరఫరా చేసేవాడు. తన బ్యాంక్ ఖాతాను ఉపయోగించి ఆన్‌లైన్ ఆర్థిక లావాదేవీలను నిర్వహించినట్లు సుస్మితా అంగీకరించింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చిన డబ్బును లగ్జరీ లైఫ్‌స్టైల్ కోసం ఉపయోగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులతో కలిసి H-NEW బృందాలు నిందితులను అరెస్టు చేసి NDPS చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు.
{{/usCountry}}పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, వచ్చిన డబ్బును లగ్జరీ లైఫ్‌స్టైల్ కోసం ఉపయోగించారు. విశ్వసనీయ సమాచారం మేరకు చిక్కడపల్లి పోలీసులతో కలిసి H-NEW బృందాలు నిందితులను అరెస్టు చేసి NDPS చట్టంలోని సంబంధిత సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. జ్యుడీషియల్ రిమాండ్ కోసం కోర్టు ముందు హాజరుపరిచారు.
{{/usCountry}}