Dating App Scam : గుండె పగలడమే కాదు.. జేబుకు కూడా చిల్లు.. బిల్లు వచ్చేసరికి ట్విస్ట్!
Dating app scam : ఇప్పుడు చాలా మంది యువత డేటింగ్ యాప్స్ మాయలో పడిపోతున్నారు. పబ్, రెస్టారెంట్లలో వేల రూపాయల బిల్లులతో జేబుకు చిల్లు పడేలా చేసుకుంటున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఓ ఘటనే ఇందుకు ఉదాహరణ.
డేటింగ్ యాప్‌లో పరిచయమైన ఓ అందమైన అమ్మాయి 'కాఫీ తాగుదాం పదా' అని పిలిస్తే.. శేఖర్ అనే వ్యక్తి గుండెల్లో సంతోషమైంది. ‘నాకూ ఒక రోమియో కథ దొరికింది’ అని సంబరపడిపోతూ, జూబ్లీహిల్స్‌లోని ఒక రిచ్ రెస్టారెంట్‌కు వెళ్లాడు. వాతావరణం చాలా ఆహ్లాదకరంగా సాగింది. మాటలు, నవ్వులు, రకరకాల వంటకాలతో కాలాన్ని మర్చిపోయారు.

కానీ అసలు ట్విస్ట్ బిల్లు రూపంలో ముంగిట వాలినప్పుడే ఎదురైంది. చేతికి వచ్చిన బిల్లు చూసి శేఖర్ కళ్ళు బైర్లు కమ్మాయి. అక్షరాలా రూ.28,000 బిల్లు. ఓ సాధారణ ఉద్యోగి నెల జీతం, కొంతమందికి అంతకంటే ఎక్కువనే. బిల్లు వచ్చేముందు అమ్మాయి తన తెలివి ఉపయోగించింది. ఓయ్ కాసేపట్లో వస్తాను.. అని వాష్‌రూమ్ సాకు చెప్పి లేచి వెళ్లింది. మళ్లీ తిరిగి రాలేదు. పాపం, శేఖర్ జేబు ఖాళీ చేసుకుని, హృదయం గాయపడి, ఏం చేయాలేక పోయిన సొమ్మును తలుచుకుంటూ నేరుగా పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
హైదరాబాద్‌లో ఇలా ప్రేమ దోపిడీకి గురైనవారు నగరంలో చాలా మంది ఉన్నారు. సైబర్ క్రైమ్ పోలీసులకు వచ్చిన ఫిర్యాదుల్లో ఏకంగా 70కి పైగా ఇలాంటి కేసులే ఉండటం గమనార్హం. ఇందులో 33 కేసులు కేవలం నగరంలోని ప్రధాన పబ్‌లు, రెస్టారెంట్లలో జరిగినవే. గత 5 నెలల్లోనే ఈ రకం డేటింగ్ స్కామ్‌లలో నగర యువకులు ఏకంగా రూ.35 లక్షల రూపాయలు పోగొట్టుకున్నారని తెలుస్తోంది.
'మహిళలు తమను ఖరీదైన రెస్టారెంట్లు, కేఫ్‌లకు తీసుకెళ్లి, భారీ బిల్లులు ఇచ్చి, తమను ఇరకాటంలో పెట్టి అదృశ్యమవుతున్నారని వారు ఆరోపిస్తున్నారు. వీటిలో చాలా వరకు అధిక బిల్లులు వసూలు చేయడం, మైనర్లకు మద్యం అందించడం వంటి వాటికి సంబంధించినవి.' అని ఓ పోలీసు అధికారి తెలిపారు.
అబ్బాయిలను నమ్మించి, జూబ్లీహిల్స్ లాంటి ఏరియాల్లోని కాస్ట్లీ పబ్‌లు, కేఫ్‌లకు తీసుకెళ్లడం, భారీగా ఆర్డర్లు పెట్టి బిల్లు ఊహించని రేంజ్‌కు పెంచేయడం, ఆ తర్వాత అమ్మాయిలు మెల్లగా జారుకోవడం.. ఇదీ ఈ స్ట్రాటజీ. ఈ వ్యవహారంలో కేవలం అమ్మాయిలే కాకుండా, పబ్‌ల యాజమాన్యాలు కూడా జతకట్టి ఇలాంటి దోపిడీలకు పాల్పడుతున్నాయా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. జూబ్లీహిల్స్‌లోని 33కి పైగా పబ్‌లపై సైబర్ క్రైమ్, షీ టీమ్స్ ఫోకస్ చేశాయి.
డేటింగ్ యాప్ ఆధారిత హనీ ట్రాప్ కేసులకు పోలీసులు అత్యంత ప్రాధాన్యతనిచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పబ్‌ల యజమానులకు ఈ మోసాలలో ప్రమేయం ఉందా అనే కోణంలో సాక్ష్యాధారాలు సేకరిస్తున్నారు. అర్ధరాత్రి దాటినా పబ్‌లు నడపడం, మైనర్లకు మద్యం సరఫరా చేయడం, శబ్ద కాలుష్యం వంటి నిబంధనల ఉల్లంఘనలపై కూడా ప్రత్యేక నిఘా పెట్టారు.
డేటింగ్ యాప్‌లో ఎవరో పంపిన స్మైలీకి మైమరిచిపోయి, మొదటి డేట్‌లోనే కాస్ట్లీ పబ్‌లకు వెళ్లే ముందు కాస్త జాగ్రత్తగా ఉండండి. లేదంటే గుండె పగలడమే కాదు.. జేబుకి పెద్ద చిల్లేపడుతుంది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


