అక్రమాస్తుల కేసులో వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి నాంపల్లిలోనీ సీబీఐ ప్రత్యేక కోర్టులో హాజరయ్యారు. ఉదయంపూట విజయవాడ నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట చేరుకున్నారు. వైసీపీ శ్రేణులు, అభిమానులు ఆయనకు ఘన స్వాగతం పలితారు. ఆ తర్వాత నాంపల్లి కోర్టు వరకు ర్యాలీగా వెళ్లారు. కొంతమంది అభిమానులు, కార్యకర్తలు అత్యుత్సాహం చూపించారు. దీంతో కొన్ని ప్రదేశాల్లో ట్రాఫిక్ సమస్యలు కూడా వచ్చాయి.

జగన్ రాకను దృష్టిలో ఉంచుకుని నాంపల్లి కోర్టు పరిసరాల్లో భారీగా ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. సుమారు ఆరు సంవత్సరాల తర్వాత జగన్ కోర్టుకు హాజరు అయ్యారు. నాంపల్లి కోర్టుకు ఉదయం 11.40 గంటలకు వచ్చి.. పన్నెండున్నర దాకా ఉండి వెళ్లిపోయారు. జగన్‌తో వచ్చిన కొంతమంది ముఖ్యనేతలను లోపలికి అనుమతి ఇవ్వలేదు. దీంతో గేటు వద్దే ఉన్నారు. మొత్తం 11 ఛార్జ్ షీట్లకు సంబంధించిన దర్యాప్తులో భాగంగా జగన్ ఉన్నారు.
కోర్టులో విచారణ పూర్తయిన తర్వాత అక్కడ నుంచి నుంచి జగన్ లోటస్ పాండ్‌కు వెళ్లారు. చాలా రోజుల తర్వాత అక్కడకు చేరుకున్నారు. కొందరు నేతలను కలిసి ఆ తర్వాత బేగంపేట చేరుకుంటారు. ప్రత్యేక విమానంలో బెంగళూరు వెళ్తారు. చివరిసారిగా వైఎస్ జగన్ 2020 మెుదట్లో నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరు అయ్యారు. సుమారుగా ఆరేళ్లు అవుతుంది. తాజాగా మళ్లీ కోర్టుకు వచ్చారు.
కొన్ని రోజుల కిందట కోర్టు అనుమతితో యూరప్ వెళ్లారు జగన్. వచ్చిన తర్వాత హాజరుకావాలని కోర్టు ఆదేశించిగా మినహాయింపు కావాలని పిటిషన్ వేశారు. కానీ దీనిపై సీబీఐ అభ్యంతరం తెలిపింది. దీంతో కోర్టుకు తప్పక హాజరు కావాల్సి వచ్చింది. ఆరేళ్లుగా జగన్ కోర్టుకు హాజరుకావడంలేదని, డిశ్ఛార్జి పిటిషన్లపై రోజూవారీ విచారణ జరుగుతున్నందున ప్రత్యక్షంగా హాజరుకావాలని సీబీఐ వెల్లడించింది. దీంతో ఈ నెల 21వ తేదీలోగా హాజరు కావాలని కోర్టు ఆదేశించగా.. ఒకరోజు ముందుగానే జగన్ కోర్టుకు వచ్చారు.
జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ 2012లో మెుదలైంది. అక్రమ ఆస్తులు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారని సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 11 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచారణ నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ మినహాయింపు పొందారు. తాజాగా కోర్టు ఎదుట హాజరు అయ్యారు.
{{/usCountry}}జగన్‌పై ఉన్న సీబీఐ, ఈడీ కేసుల విచారణ 2012లో మెుదలైంది. అక్రమ ఆస్తులు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని సంపాదించారని సీబీఐ, ఈడీ దర్యాప్తు చేస్తున్నాయి. ఇప్పటి వరకు 11 ఛార్జిషీట్లు దాఖలు అయ్యాయి. వాటి మీద విచారణ నడుస్తూనే ఉంది. ముఖ్యమంత్రి హోదాలో ఉన్నప్పుడు జగన్ మినహాయింపు పొందారు. తాజాగా కోర్టు ఎదుట హాజరు అయ్యారు.
{{/usCountry}}