తిరుమల : రికార్డు స్థాయిలో వైకుంఠద్వార దర్శనాలు - 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం…!

తిరుమల శ్రీవారి ఆలయంలో వైకుంఠ ద్వారా దర్శనాలు ముగిశాయి. పదిరోజుల పాటు వేడుకగా సాగిన ఉత్తర ద్వారా దర్శనాలు గురువారం అర్ధరాత్రితో పరిసమాప్తం అయ్యాయి. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు. 

Published on: Jan 9, 2026, 13:16:00 IST
Share
Share via
  • facebook
  • twitter
  • linkedin
  • whatsapp
Copy link
  • copy link

తిరుమలలో శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాలు గురువారం అర్ధరాత్రితో ముగిశాయి. డిసెంబరు 30న ప్రారంభమైన ఈ దర్శనాలకు రికార్డు స్థాయిలో భక్తులు తరలివచ్చారు. ఏకాంత సేవ అనంతరం వైకుంఠ ద్వార దర్శనం తలుపులు మూసివేశారు. మొత్తం 10 రోజుల్లో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం దక్కింది.

తిరుమల
తిరుమల

రికార్డు స్థాయిలో దర్శనాలు…

టీటీడీ చరిత్రలోనే కాక, ఎన్నడూ లేని విధంగా ఈసారి వైకుంఠ ద్వార దర్శనాలు అత్యంత వైభవంగా నిర్వహించబడ్డాయని టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం… రికార్డు స్థాయిలో 7.83 లక్షల మంది భక్తులకు వైకుంఠద్వార దర్శనం కలిగింది. టీటీడీ ఏర్పాట్లు, సదుపాయాలపై 93 శాతం భక్తులు సంతృప్తి వ్యక్తం చేశారు.

2024 ఏడాదిలో 6.83 లక్షలు, 2023లో 6.47 లక్షలతో పోలిస్తే భక్తుల సంఖ్య ఎక్కువగా పెరిగింది. 10 రోజుల్లో రూ.41 కోట్ల హుండీ ఆదాయం వచ్చింది. 44 లక్షల లడ్డూలు విక్రయం కాగా… గతేడాదితో పోలిస్తే 10 లక్షలు అధికంగా విక్రయించినట్లు ప్రకటించారు.

గతేడాదికంటే 27 శాతం అధికంగా అన్నప్రసాదాల పంపిణీ జరిగింది. 50 టన్నుల సంప్రదాయ పుష్పాలు, 10 టన్నుల పండ్లు, 4 టన్నుల కట్ ఫ్లవర్స్‌తో అద్భుతమైన అలంకరణలు చేశారు. కళ్యాణకట్ట, పారిశుద్ధ్యం, వైద్య సేవల ఏర్పాట్లు భక్తులకు ఎంతో ఉపయోగకరంగా నిలిచాయి AI కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా నిరంతర పర్యవేక్షణ కొనసాగింది.

ప్రణాళికాబద్ధ క్యూలైన్ నిర్వహణతో అంచనాలకన్నా ఎక్కువ మందికి దర్శనం కల్పించగలిగామని టీటీడీ ఛైర్మన్ బీఆర్ఎస్ నాయుడు పేర్కొన్నారు. ఈ వైకుంఠద్వార దర్శనాలను శాంతియుతంగా విజయవంతం చేసిన భక్తులకూ, మెరుగైన సేవలు అందించిన అధికారులు, సిబ్బంది మరియు సేవకులకూ కృతజ్ఞతలు తెలిపారు.

  • మహేంద్ర చారి మహేశ్వరం ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్ గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ జర్నలిజంలో 9 ఏళ్లకు పైగా అనుభవం ఉంది. ఇక్కడ ఏపీ, తెలంగాణకు సంబంధించిన ప్రాంతీయ వార్తలను రాస్తారు. ముఖ్యంగా రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ఏపీ, తెలంగాణ ప్రభుత్వ పథకాలకు సంబంధించి ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.జర్నలిజంలో పీజీ చేసే సమయంలో క్యాంపస్ రిక్రూట్ మెంట్ లో భాగంగా 2017లో ఈటీవీ భారత్ లో చేరారు. 2018 అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటీవీ డెస్క్ లోనూ కొన్ని నెలలపాటు పని చేశారు. 2019 ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించిన ఈటీవీ భారత్ ఏర్పాటు ఏర్పాటు చేసిన స్పెషల్ డెస్క్ లో కూడా పని చేశారు. ఈనాడు జర్నలిజం స్కూల్ లో కొద్దిరోజుల పాటు ట్రైనీ జర్నలిస్టులకు పాఠాలు కూడా బోధించిన అనుభవం ఉంది.2022లో హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో చేరారు. అద్భుతమైన పనితీరుతో ప్రస్తుతం పని చేస్తున్న సంస్థలో 2023 - 2024 ఏడాదికానూ ప్రతిష్టాత్మకమైన 'లాంగ్వేజేస్ జర్నో' అవార్డును అందుకున్నారు. పలుమార్లు హెచ్​టీ ఇన్​స్టా అవార్డులు దక్కించుకున్నారు. ఇది డిజిటల్ జర్నలిజంలో ఆయన చూపిస్తున్న నిబద్ధతకు, వార్తా సేకరణలో ఆయన పాటించే ఖచ్చితత్వానికి నిదర్శనం.హైదరాబాద్ లోని నిజాం కాలేజీ నుంచి బీఎస్సీలో డిగ్రీ పట్టా పొందారు. తెలుగు విశ్వవిద్యాలయం నుంచి జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ లో పీజీ పూర్తి చేశారు. అకడమిక్స్ లో మంచి ప్రతిభకు గానూ యూనివర్శిటీ నుంచి గోల్డ్ మెడల్ ను పొందారు. ఆ తర్వాత ఉస్మానియా యూనివర్శిటీ క్యాంపస్ నుంచి లా డిగ్రీ పట్టా పొందారు.Read More