AP University Recruitment 2026 : రాష్ట్రంలోని ప్రభుత్వ విశ్వవిద్యాలయాలలో ఖాళీగా ఉన్న అధ్యాపక పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. జాబ్ క్యాలెండర్‌లో ప్రకటించిన విధంగా మొత్తం 1,523 ఫ్యాకల్టీ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ కూడా విడుదలైంది. ఈ భారీ నియామక ప్రక్రియ ద్వారా ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్, అసిస్టెంట్ లైబ్రేరియన్ వంటి కీలక కేడర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

ఈ నోటిఫికేషన్ ద్వారా రాష్ట్రంలోని ప్రముఖ విశ్వవిద్యాలయాలలో పోస్టులను భర్తీ చేయనున్నారు. అత్యధికంగా రాజీవ్ గాంధీ నాలెడ్జ్ టెక్నాలజీస్ విశ్వవిద్యాలయం (RGUKT) లో 311 పోస్టులు, విశాఖపట్నంలోని ఆంధ్ర విశ్వవిద్యాలయం (AU) లో 246 పోస్టులు, తిరుపతిలోని శ్రీ వేంకటేశ్వర విశ్వవిద్యాలయం (SVU) లో 125 పోస్టులు ఉన్నాయి. వీటితో పాటు అనంతపురంలోని ఎస్‌కేయూ (103 పోస్టులు), జేఎన్‌టీయూ అనంతపురం (95 పోస్టులు), గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (82 పోస్టులు) సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మొత్తం 19 ప్రభుత్వ ఉన్నత విద్యా సంస్థల్లో ఈ నియామకాలు జరుగుతాయి.
ఖాళీల వివరాలు:
- ప్రొఫెసర్: 63 (రెగ్యులర్: 63, బ్యాక్‌లాగ్: 0)
- అసోసియేట్ ప్రొఫెసర్: 334 (రెగ్యులర్: 191, బ్యాక్‌లాగ్: 143)
- అసిస్టెంట్ ప్రొఫెసర్: 1,020 (రెగ్యులర్: 886, బ్యాక్‌లాగ్: 134)
- లెక్చరర్ (కేవలం RGUKTలో): 104 (రెగ్యులర్: 104, బ్యాక్‌లాగ్: 0)
- అసిస్టెంట్ లైబ్రేరియన్: 2 (రెగ్యులర్: 0, బ్యాక్‌లాగ్: 2)
ఈ నోటిఫికేషన్ కు సంబంధించిన ఆన్ లైన్ దరకాస్తుల ప్రక్రియ ప్రారంభమైంది. అర్హులైన వాళ్లు జూన్ 8వ తేదీలోపు అప్లికేషన్ చేసుకోవాలి. ఇక హార్ట్ కాపీని మాత్రం జూన్ 15లోపు సమర్పించాలి. స్క్రీనింగ్ టెస్ట్‌కు తుది అర్హత జాబితాను జూన్ 30వ తేదీన విడుదల చేస్తారు.
- ఆన్‌లైన్ అప్లికేషన్, ఫీజు చెల్లింపునకు ఆఖరి తేదీ: జూన్ 8
- దరఖాస్తుల హార్డ్ కాపీ సమర్పించడానికి గడువు: జూన్ 15
- అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ప్రాథమిక అర్హత జాబితా వెల్లడి: జూన్ 22
- అర్హత జాబితాపై అభ్యంతరాల స్వీకరణ: జూన్ 29 వరకు
- స్క్రీనింగ్ టెస్ట్‌కు తుది అర్హత జాబితా విడుదల: జూన్ 30
దరఖాస్తు విధానం ఇలా,,,.
రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్‌ను ( https://apuniversitiesrecruitment.apcfss.in ) అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు ఈ సింగిల్ విండో పోర్టల్‌లో ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుని, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, భవిష్యత్ సంప్రదింపులన్నీ ఈ స్మార్ట్ పోర్టల్ ద్వారానే సాగుతాయి. ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన నైపుణ్యం పోర్టల్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.
{{/usCountry}}రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా అన్ని ప్రభుత్వ విశ్వవిద్యాలయాల నియామకాల కోసం ఒకే ఒక కామన్ రిక్రూట్మెంట్ పోర్టల్‌ను ( https://apuniversitiesrecruitment.apcfss.in ) అందుబాటులోకి తెచ్చారు. అభ్యర్థులు ఈ సింగిల్ విండో పోర్టల్‌లో ఒక్కసారి తమ వివరాలను నమోదు చేసుకుని, మల్టీ-యూనివర్సిటీ ప్రిఫరెన్స్ ఆప్షన్ ద్వారా ఒకటి కంటే ఎక్కువ వర్సిటీలకు దరఖాస్తు చేసుకోవచ్చు. వన్-టైమ్ పాస్వర్డ్ (OTP) వెరిఫికేషన్, ఆన్‌లైన్ ఫీజు చెల్లింపు, భవిష్యత్ సంప్రదింపులన్నీ ఈ స్మార్ట్ పోర్టల్ ద్వారానే సాగుతాయి. ఈ పోర్టల్‌ను ప్రభుత్వం ప్రవేశపెట్టిన నైపుణ్యం పోర్టల్ ద్వారా కూడా యాక్సెస్ చేయవచ్చు.
{{/usCountry}}ఈ నియామకాలు పూర్తిగా యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (UGC) మార్గదర్శకాలకు అనుగుణంగానే జరుగుతాయి.అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల ఎంపిక ప్రక్రియలో భాగంగా నిర్వహించే స్క్రీనింగ్ టెస్ట్ మరియు ఇంటర్వ్యూల వివరాలను కామన్ పోర్టల్ ద్వారా ఎప్పటికప్పుడు అప్‌డేట్ చేస్తారు.