బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 610కి.మీ., కాకినాడకు 690 కి.మీ., మచిలీపట్నానికి 790 కి.మీ, బాపట్లకు 860కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అర్నబ్ తుపాను మంగళవారం రాత్రికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. బుధవారం(అక్టోబర్ 28) నాటికి బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ తీరప్రాంతాల్లో గంటకు 100 నుండి 140 కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం విపత్తు నిర్వహణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
తుపాను ధాటికి కాకినాడ, పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్త చర్యగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు (అక్టోబర్ 27, 28) సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
తీరప్రాంతాల నివాసితులను మంగళవారం ఉదయానికల్లా షెల్టర్లకు తరలించనున్నారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని యంత్రాంగం కఠినంగా ఆదేశించింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
ప్రజల కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కింది నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. కాకినాడ జిల్లా కంట్రోల్ రూమ్:0884-23568019849903879.
{{/usCountry}}ప్రజల కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్లను అందుబాటులోకి తెచ్చారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కింది నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. కాకినాడ జిల్లా కంట్రోల్ రూమ్:0884-23568019849903879.
{{/usCountry}}కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. కోనసీమ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08865-293104, అమలాపురం ఆర్డీఓ ఆఫీస్: 08856-233208, రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్: 08857-245166, కొత్తపేట ఆర్డీఓ ఆఫీస్: 9989855444ను సంప్రదించవచ్చు.
ఈ తుపాను శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో సుమారు 590 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తాడేపల్లిలోని ఏపీ రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రంలో అధికారులు అర్నబ్ తుపానును పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) అత్యవసర కార్యకలాపాల కేంద్రంలో వాతావరణ నిపుణులతో కలిసి ఎప్పటికప్పుడు తుపానును అంచనా వేస్తుంది. ఈ తుపాను బుధవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడి విశాఖపట్నం, బాపట్ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని, సోమవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.