Cyclone Arnab Schools Holiday : అర్నబ్ తుపానుతో ఈ జిల్లాల్లో 27, 28 తేదీల్లో స్కూళ్లు, కాలేజీలకు సెలవు!
Cyclone Arnab Schools Holiday : బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుపాను ఆంధ్రప్రదేశ్‌లోని కోస్తా తీరాన్ని ముంచెత్తేందుకు దూసుకొస్తోంది. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో స్కూళ్లకు అధికారులు సెలవులు ప్రకటిస్తున్నారు.
బంగాళాఖాతంలో అర్నబ్ తుపాన్ దూసుకొస్తుంది. గడిచిన 6 గంటల్లో గంటకు 15 కిమీ వేగంతో కదిలింది. ప్రస్తుతానికి విశాఖపట్నానికి 610కి.మీ., కాకినాడకు 690 కి.మీ., మచిలీపట్నానికి 790 కి.మీ, బాపట్లకు 860కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ తెలిపారు.

అర్నబ్ తుపాను మంగళవారం రాత్రికి అతి తీవ్ర తుపానుగా రూపాంతరం చెంది.. బుధవారం(అక్టోబర్ 28) నాటికి బాపట్ల నుంచి విశాఖపట్నం మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉన్నట్లు భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ ప్రభావంతో ఏపీ తీరప్రాంతాల్లో గంటకు 100 నుండి 140 కిలోమీటర్ల భారీ వేగంతో ఈదురుగాలులు వీచే ప్రమాదం ఉండడంతో ప్రభుత్వం విపత్తు నిర్వహణ చర్యలను యుద్ధప్రాతిపదికన చేపట్టింది.
తుపాను ధాటికి కాకినాడ, పరిసర ప్రాంతాలు తీవ్రంగా ప్రభావితమయ్యే సూచనలు కనిపించడంతో జిల్లా యంత్రాంగం ముందస్తు భద్రతా చర్యలు చేపట్టింది. ముందస్తు జాగ్రత్త చర్యగా కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, విశాఖ, కృష్ణా, తూర్పుగోదావరి, విజయనగరం జిల్లాల్లో విద్యాసంస్థలకు రెండు రోజుల పాటు (అక్టోబర్ 27, 28) సెలవులు ప్రకటిస్తున్నట్లు అధికారులు తెలిపారు. జిల్లాలో 6 ప్రత్యేక తుపాను పునరావాస కేంద్రాలను సిద్ధం చేశారు.
తీరప్రాంతాల నివాసితులను మంగళవారం ఉదయానికల్లా షెల్టర్లకు తరలించనున్నారు. సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారనున్నందున మత్స్యకారులు ఎవరూ వేటకు వెళ్లకూడదని యంత్రాంగం కఠినంగా ఆదేశించింది. అత్యవసర సహాయక చర్యల కోసం ఎన్డీఆర్‌ఎఫ్, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలను రంగంలోకి దించారు.
ప్రజల కోసం కాకినాడ జిల్లా కలెక్టరేట్లలో 24 గంటలూ పనిచేసే కంట్రోల్ రూమ్‌లను అందుబాటులోకి తెచ్చారు. ఏ చిన్న సమస్య వచ్చినా వెంటనే కింది నంబర్లకు ఫోన్ చేయవచ్చని అధికారులు సూచించారు. కాకినాడ జిల్లా కంట్రోల్ రూమ్:0884-23568019849903879.
కోనసీమ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్. మహేష్ కుమార్ ప్రజలు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, వాతావరణ హెచ్చరికలను ఎప్పటికప్పుడు గమనించాలని కోరారు. కోనసీమ కలెక్టరేట్ కంట్రోల్ రూమ్: 08865-293104, అమలాపురం ఆర్డీఓ ఆఫీస్: 08856-233208, రామచంద్రపురం ఆర్డీఓ ఆఫీస్: 08857-245166, కొత్తపేట ఆర్డీఓ ఆఫీస్: 9989855444ను సంప్రదించవచ్చు.
ఈ తుపాను శ్రీ విజయ పురం (అండమాన్ దీవులు)కు వాయువ్య దిశలో సుమారు 590 కి.మీ దూరంలో, విశాఖపట్నానికి తూర్పు-ఆగ్నేయ దిశలో 650 కి.మీ దూరంలో, కాకినాడకు తూర్పు-ఆగ్నేయ దిశలో 730 కి.మీ దూరంలో, మచిలీపట్నానికి తూర్పు దిశలో 830 కి.మీ దూరంలో, బాపట్లకు తూర్పు దిశలో 910 కి.మీ దూరంలో కేంద్రీకృతమై ఉంది.
తాడేపల్లిలోని ఏపీ రాష్ట్ర అత్యవసర కార్యకలాపాల కేంద్రంలో అధికారులు అర్నబ్ తుపానును పర్యవేక్షిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విపత్తు నిర్వహణ అథారిటీ (ఏపీఎస్‌డీఎంఏ) అత్యవసర కార్యకలాపాల కేంద్రంలో వాతావరణ నిపుణులతో కలిసి ఎప్పటికప్పుడు తుపానును అంచనా వేస్తుంది. ఈ తుపాను బుధవారం నాటికి తీవ్ర తుపానుగా బలపడి విశాఖపట్నం, బాపట్ల మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని, సోమవారం రాత్రి నుంచి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం హెచ్చరించింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని కోరింది.
ABOUT THE AUTHORAnand Saiఆనంద్ సాయి మాదాసు ప్రస్తుతం హిందుస్తాన్ టైమ్స్ తెలుగులో డిప్యూటీ చీఫ్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. డిజిటల్ మీడియాలో 9 ఏళ్లకుపైగా అనుభవం ఉంది. హెచ్‌టీ తెలుగులో చేరడం కంటే ముందు ఏబీపీ దేశంలో డిజిటల్ కంటెంట్ ప్రొడ్యూసర్‌గా పని చేశారు. మెుదట నవతెలంగాణ అనే దినపత్రికలో సబ్ఎడిటర్‌గా జర్నలిజం కెరీర్ మెుదలుపెట్టారు. ఆ తర్వాత కరీంనగర్‌లో ఈనాడు దినపత్రికలో కొంతకాలం సబ్‌ఎడిటర్‌గా బాధ్యతలు చూసుకున్నారు. కాకతీయ యూనివర్సిటీలో 2015-2017 పీజీ మాస్ కమ్యూనికేషన్ అండ్ జర్నలిజం చేశారు. ఈ సమయంలో మేడారం సమ్మక్క-సారలమ్మ జాతర కోసం ప్రత్యేకంగా క్యాంపస్ నుంచి పంపించిన టీమ్‌లో ఉన్నారు. పీజీ చదివే సమయంలోనే క్యాంపస్ రిక్రూట్‌మెంట్‌లో భాగంగా ఈటీవీ భారత్‌కు సెలక్ట్ అయ్యారు. అక్కడ ఆంధ్రప్రదేశ్ డెస్క్‌లో పని చేశారు. అంతేకాదు కొన్ని ప్రత్యేక స్టోరీలు కూడా ఈటీవీ భారత్ వెబ్‌సైట్ కోసం రాసేవారు. 2019 ఎన్నికల్లో ఎలక్షన్ డెస్క్ టీమ్‌లో ఉన్న నలుగురిలో ఆనంద్ సాయి ఒకరు. ఆ తర్వాత అక్కడ నుంచి ఏబీపీ దేశంలోకి వెళ్లి కొంతకాలం పని చేశారు. ఈ సమయంలో కూడా డిజిటల్ మీడియాకు తగినట్టుగా అనేక ప్రత్యేక కథనాలు రాశారు. హిందూస్తాన్ టైమ్స్ తెలుగులో 2022లో చేరారు. ఇక్కడ గతంలో నేషనల్, బిజినెస్, లైఫ్‌స్టైల్, ఎంటర్‌టైన్‌మెంట్, స్పోర్ట్స్ సెక్షన్లకు పనిచేశారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సెక్షన్లకు వార్తలు రాస్తున్నారు. అన్ని సెక్షన్లకు డిజిటల్ కంటెంట్ రైటర్‌గా పని చేసిన అనుభవం ఆయనకు ఉంది. అంతేకాదు ఈటీవీ భారత్, ఏబీపీ దేశం, హిందుస్తాన్ టైమ్స్ వెబ్‌సైట్స్ లాంచ్ టీమ్‌లో ఈయన ఉన్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాజకీయ పరిణామాలు, విశ్లేషణలు, విద్య, ఉద్యోగ సమాచారంతో పాటు ఆసక్తికరమైన కథనాలను అందిస్తారు. ప్రభుత్వ పథకాలు, ఉద్యోగ నోటిఫికేషన్లు, ఇతర సమాచారం ప్రజలకు సులభంగా అర్థమయ్యే రీతిలో, వీలైనంత త్వరగా కథనాలను ఇవ్వటంలో ప్రత్యేక శైలి కలిగి ఉన్నారు. అనేకసార్లు హిందుస్తాన్ టైమ్స్ సంస్థ నుంచి ఇన్‌స్టా అవార్డులు అందుకున్నారు. డిజిటల్ మీడియాలో ఎక్కువకాలం పని చేసిన అనుభవం ఉంది. యూజర్లకు ఉపయోగపడే వార్తలను అందించడంలో ముందుంటారు.Read More

E-Paper


